Rashmi Gautam : చేసేవి గలిజు షోలు.. చెప్పేది నీతులు.. నెటిజన్ ప్రశ్నకి రష్మీ దిమ్మతిరిగే సమాధానం
Rashmi Gautam : బుల్లితెర పాపులర్ షో జబర్ధస్త్‌తో మంచి క్రేజ్ తెచ్చుకున్న రష్మీ ఇప్పుడు పలు షోలతో బిజీగా ఉంది.బుల్లితెరపై రష్మీ యాంకరింగ్ చేస్తూ అప్పుడప్పుడూ నటిగా కూడా రాణిస్తూ ఉంది. ఒకప్పుడు రష్మీ, సుధీర్ రొమాన్స్ బుల్లితెరపై ఆడియన్స్ కి మంచి వినోదాన్ని అందించింది. రష్మీ ఆఫ్ స్క్రీన్ లో జంతువులు అంటే అమితమైన ప్రేమ. జంతులకు ఎక్కడ ఆపద ఉందని తెలిసినా రష్మీ తట్టుకోలేదు. లాక్ డౌన్ టైంలో ఫుడ్ లేక అల్లాడుతున్న జంతువులకు రష్మీ స్వయంగా ఆహారం అందించింది. యానిమల్ ప్రొటక్షన్ విషయంలో రష్మీ తరచుగా నెటిజన్లతో వాగ్వాదానికి దిగుతూనే ఉంటుంది. తాజాగా రష్మీకి, నెటిజన్లకు మధ్య సినిమా, బుల్లితెరపై ప్రదర్శించే కంటెంట్ విషయంలో తీవ్రమైన వాగ్వాదం జరిగింది.
సోషల్ మీడియా వేదికగా రష్మీ గౌతమ్ మరోసారి రచ్చ చేసింది. యానిమల్స్ కి చిన్న ఆపద వచ్చినా రష్మీ తట్టుకోలేదు. ఓ నెటిజన్.. ట్రైన్ కి గుద్దుకోవడం వాళ్ళ ఓ ఏనుగు తీవ్రంగా గాయపడింది. ఆ దృశ్యాలని చూపిస్తూ.. నీకు దమ్ముంటే బిజెపి ప్రభుత్వాన్ని ఈ విషయంలో ప్రశ్నించు అని అన్నారు. తాను ఆల్రెడీ ఆ పని చేశానని రష్మీ రిప్లై ఇచ్చింది. మీకు దమ్ముంటే మాంసం మానేయండి అని కోరింది. ఆ తర్వాత వివాదం మరో టర్న్ తీసుకుంది. ఎలా అంటే సినిమాల్లో చూపించే అడల్ట్ కంటే, టివి షోలలో చూపించే అడల్ట్ డైలాగ్స్ విషయంలో పెద్ద రచ్చే జరిగింది. సమాజంలో అత్యాచారాలు లాంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే పిల్లల్ని పేరెంట్స్ సరిగా పెంచాలని రష్మీ సూచించింది. దీనితో ఓ నెటిజన్ మీరు చేసేది చేస్తూనే ఉంటారు.. కానీ పిల్లలని మాత్రం కంట్రోల్ లో ఉంచాలని చెబుతారు అంటూ ప్రశ్నించారు. ఈ విషయంలో బుల్లితెరని నిందించడం ఆపండి.
Rashmi Gautam : చేసేవి గలిజు షోలు.. చెప్పేది నీతులు.. నెటిజన్ ప్రశ్నకి రష్మీ దిమ్మతిరిగే సమాధానం
బుల్లితెర మాత్రమే కాదు ప్రతి కంటెంట్ ప్రభావం చూపుతోంది. ఓటిటి, సినిమా ప్రభావం కూడా ఉంది అని రష్మీ పేర్కొంది. ఓ నెటిజన్ మరింత ఘాటుగా ప్రశ్నించాడు. ఫ్యామిలీ షోలు అని చెప్పి అడల్ట్ కంటెంట్ తో చేస్తున్నారు. అలాంటివి మీరు మానేయొచ్చుకదా అని ప్రశ్నించారు. ఫ్యామిలీ షో అని చెబితే పెద్దలతో పాటు పిల్లలు కూడా చూస్తారు రష్మిని ఇరకాటంలో పెట్టారు. అలాగైతే వర్క్ లేని ఆర్టిస్టుల కోసం పబ్లిక్ ఫండింగ్ మొదలు పెట్టండి. అప్పుడు ఇలాంటి షోలు మానేసి.. మంచి షోలు మాత్రమే చేస్తాం అంటూ రష్మీ బదులిచ్చింది.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.