
Rashmika Mandanna is she troubled by bollywood makers
Rashmika Mandanna : రష్మిక మందన్న కి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా మంచి క్రేజ్ ఉంది. పూజా హెగ్డే తర్వాత అంత క్రేజ్ ఉన్న హీరోయిన్ ప్రస్తుతం రష్మిక మందన్ననే. గత ఏడాది సూపర్ స్టార్ మహేష్ బాబు తో సరిలేరు నీకెవ్వరూ.. యంగ్ హీరో నితిన్ తో భీష్మ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ అందుకొని టాప్ ప్లేస్ లోకి వచ్చేసింది. ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి జంటగా పుష్ప అన్న పాన్ ఇండియూన్ సినిమా చేస్తోంది. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. అంతేకాదు ఈ సినిమా ఆగస్టు 13 న భారీ స్థాయిలో అన్ని భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయబోతున్నారు.
Rashmika Mandanna is she troubled by bollywood makers
ఈ క్రమంలోనే రష్మిక మందన్న రెండు హిందీ సినిమాలలో నటించే అవకాశం దక్కింది. వాస్తవంగా పుష్ప సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ అనుకున్న రష్మిక మందన్న లక్కీగా అంతకన్నా ముందే రెండు ప్రాజెక్ట్స్ లో నటించే అవకాశం రావడం విశేషం. అందులో ఒక సినిమా ఏకంగా బిగ్ బి అమితాబ్ బచ్చన్ తో కలిసి నటించే ప్రాజెక్ట్ కావడం విశేషం. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ కి కూతురుగా రష్మిక మందన్న నటిస్తోందట. కథ మొత్తం తండ్రీ కూతురు మధ్య సాగుతుందని మంచి ఎమోషనల్ డ్రామా అని అంటున్నారు. అంతేకాదు ఈ సినిమాతో రష్మిక కి భారీ హిట్ దక్కడం ఖాయమని చెప్పుకుంటున్నారు.
ఇప్పటికే అమితాబ్ తో నటించిన తాప్సీ అక్కడ స్టార్ హీరోయిన్ గా వెలుగుతోంది. ఇక సిద్దార్థ్ మల్హోత్రా హీరోగా నటిస్తున్న సినిమాలో కూడా రష్మిక నటిస్తోంది. శాంతను బాగ్చి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా ‘మిషన్ మజ్ను’ అన్న టైటిల్ తో తెరకెక్కుతోంది. స్టార్ ప్రొడ్యూసర్ రోని స్క్రూవాలా నిర్మాతగా నిజజీవిత సంఘటనల ఆధారంగా రూపొందుతున్న మిషన్ మజ్ను సినిమా గురించి అందరూ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారట. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళనుండగా .. ఈ సినిమాల కోసం రష్మిక హిందీ భాష నేర్చుకుంటుందని సమాచారం. భాష మీద పట్టుంటే సీన్స్ ని అర్థం చేసుకోవడం సులభం అవుతుందని మేకర్స్ రష్మిక కి సలాహా ఇచ్చారట. ఇప్పుడు రష్మిక హిందీ భాష నేర్చుకుంటూ కుస్తీ పడుతోందట.
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
This website uses cookies.