
Revanth Reddy : ఉద్యోగ కల్పనలో తెలంగాణ నెంబర్ 1 : రేవంత్ రెడ్డి
Revanth Reddy : రాష్ట్ర అభివృద్ధి కోసం తెలంగాణ Telangana రైజింగ్.. Hyderabad హైదరాబాద్ రైజింగ్.. అన్నప్పుడు మొదట్లో కొందరు సందేహాలు వ్యక్తం చేశారు. జరుగుతున్న పరిణామాలతో ఇప్పుడు అందరూ అంగీకరిస్తున్నారు. ప్రపంచమంతా ఒప్పుకుంటోంది. తెలంగాణ రైజింగ్.. హైదరాబాద్ రైజింగ్.. ఇక ఆగదు” అని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారు ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ మాదాపూర్‌లో హెచ్‌సీఎల్ టెక్స్ గ్లోబల్ డెలివరీ సెంటర్ (HCL Tech’s Global Delivery Center)ను ముఖ్యమంత్రి గారు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ.. “ప్రస్తుతం హైదరాబాద్, తెలంగాణ దేశంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంగా, రాష్ట్రంగా మారిందని చెప్పారు.
Revanth Reddy : ఉద్యోగ కల్పనలో తెలంగాణ నెంబర్ 1 : రేవంత్ రెడ్డి
హైదరాబాద్ Hyderabad పోటీ.. ముంబై, ఢిల్లీ, చెన్నై, బెంగుళూరు నగరాలతో కాదని, ప్రపంచ స్థాయి నగరాలతో తమ పోటీ అని అన్నప్పుడు అదో పెద్ద కలగా అభివర్ణించారు. కానీ ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తున్న తీరు నంబర్ 1 గా నిలిచినప్పుడు, రాష్ట్రాన్ని డేటా సెంటర్ల హబ్‌గా, గ్రీన్ ఎనర్జీ, లైఫ్ సైన్సెస్, బయోటెక్, స్కిల్ డెవలప్‌మెంట్, మాన్యుఫ్యాక్చరింగ్, అగ్రి ప్రాసెసింగ్ రంగాల్లో తెలంగాణను మార్గదర్శిగా మార్చినప్పుడు ఇప్పుడు అందరూ అంగీకరిస్తున్నారు. ఇక హైదరాబాద్ రైజింగ్, తెలంగాణ రైజింగ్ ఆగదు . బహుళజాతి కంపెనీలతో ప్రతి రోజూ అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోవడం లేదా పెద్ద పెద్ద సంస్థలు Hyderabad కు రావడం లేదా గతేడాది కుదుర్చుకున్న ఎంఓయూల మేరకు సరికొత్త సౌకర్యాలతో సిద్ధమైన కేఆర్‌సీ సెంటర్ (HCL Tech KRC Campus ) ను ప్రారంభించడం గర్వకారణంగా ఉంది.
కేవలం ఏడాది కాలంలోనే Telangana అంతర్జాతీయ, దేశీయ అత్యధిక పెట్టుబడులను ఆకర్షించి దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఆర్టిపీషియల్ ఇంటెలిజెన్స్‌ను ముందుగా అందిపుచ్చుకున్నాం. పైగా రాష్ట్రంలో తక్కువ ద్రవ్యోల్బణాన్ని కాపాడుకున్నాం. తెలంగాణను 1 ట్రిలియన్ డాలర్ల జీడీపీ కలిగిన రాష్ట్రంగా మార్చుతామని చెప్పినప్పుడు కొందరు సాధ్యం కాదన్నారు. కేవలం దావోస్ లో జరిపిన రెండు వ్యాపార పర్యటనల్లో 40 వేల కోట్ల రూపాయల విలువైన ఒప్పందాలు, 1.78 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించాం.
ప్రపంచంలోనే అత్యుత్తమ లైఫ్ సైన్సెస్ సంస్థల్లో ఒకటైన ఆమ్‌జెన్ (Amgen)ను హైదరాబాద్‌కు ఆహ్వానించాం. ప్రపంచంలోనే అత్తుత్తమ జీవ వైవిధ్య సదస్సుల్లో ఒకటైన బయో ఏషియా 2025 ( Bio Asia 2025)ను విజయవంతంగా నిర్వహించాం. ఇప్పుడు హెచ్‌సీఎల్ క్యాంపస్‌ను ప్రారంభిస్తున్నాం. 60 దేశాల్లో డిజిటల్, ఇంజనీరింగ్, క్లౌడ్, AI రంగాల్లో 2.2 లక్షల మంది ఉద్యోగులతో కార్యకలాపాలు నిర్వహిస్తున్న హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ దేశ గౌరవాన్ని పెంచింది. 2007 లో హైదరాబాద్‌లో తొలిసారి ప్రారంభమైనప్పటి నుంచి అభివృద్ధి సాధిస్తూ ప్రస్తుతం 3.2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 5 వేల మంది ఉద్యోగులతో ప్రపంచస్థాయి సరికొత్త సదుపాయాలతో హైదరాబాద్ హెచ్‌ఎసీఎల్ (HCL Tech) అద్భుతమైన విజయాలను సాధించబోతోంది” అని వివరించారు. ఈ కార్యక్రమంలో HCL సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ సి. విజయ్ కుమార్ గారు, సీవీపీ, డిజిటల్ బిజినెస్ గ్లోబల్ హెడ్ పవన్ వాడపల్లి గారు, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ గారితో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
Sreeleela : బాలీవుడ్‌లో ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా స్వయంకృషితో స్టార్‌గా ఎదిగిన కార్తీక్ ఆర్యన్, ఇప్పుడు తన సినిమాల…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం తమ భూములను త్యాగం చేసిన రైతులకు కూటమి ప్రభుత్వం భారీ…
Anil Ravipudi: టాలీవుడ్‌లో అపజయం ఎరుగని 'హిట్ మెషిన్'గా పేరుగాంచిన అనిల్ రావిపూడి, తన కెరీర్‌లో వరుసగా తొమ్మిది విజయాలను…
Vijay : తమిళనాడు Tamila Nadu Politics రాజకీయ యవనికపై 'తమిళగ వెట్రి కజగం' ( TVK ) పార్టీతో…
Hyundai EV Sector : ఎలక్ట్రిక్ వాహనాల (EV) ప్రపంచంలో ఛార్జింగ్ సమస్యలకు చరమగీతం పాడుతూ హ్యుందాయ్ మోటార్ గ్రూప్…
Indiramma Atmiya Bharosa Scheme : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు అండగా నిలవాలనే…
Hero Electric Splendor EV: భారతదేశంలో అత్యంత విశ్వసనీయమైన ద్విచక్ర వాహన బ్రాండ్(Two-wheeler brand)లలో ఒకటైన స్ప్లెండర్ ఇప్పుడు ఎలక్ట్రిక్…
Pawan Kalyan : ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ AP Deputy CM Pawan Kalyan లక్ష్యంగా సీపీఐ జాతీయ…
This website uses cookies.