Home » Exclusive » Revath Reddy Comments On Cm Kcr
Exclusive

Revath Reddy : కేసీఆర్ కు దమ్ముంటే ఆ సిఎం ను అరెస్ట్ చెయ్యాలి, రేవంత్ కొత్త ఫిట్టింగ్…!

Authored By
venkat G
The Telugu News | Published on: February 14, 2022, 3:00 pm
Advertisement

Revath Reddy : అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ మహిళలను అవమానించారు అని ఆరోపించారు కాంగ్రెస్ ఎంపీ, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. ఎన్నికల అధికారులు ఆయన మీద క్రిమినల్ కేసులు పెడతారని ఆశించామని రేవంత్ పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలతో కలిసి నేడు ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి తీవ్ర వ్యాఖ్యలు చేసారు. ప్రధాని నిస్సిగ్గుగా బిశ్వ శర్మ ను సమర్దిస్తున్నారు అని మండిపడ్డారు.

Advertisement

అసోం సీఎం పై చర్యలు తీసుకోవడంలో అసోం పోలీస్, ఎన్నికల వ్యవస్థ లు విఫలం అయ్యాయి అని అన్నారు. బిశ్వ శర్మ వ్యాఖ్యల తో దేశంలోని మాతృ మూర్తులకు అవమానం జరిగింది అని ఘాటుగా స్పందించారు. అందుకే మేము ఇక్కడ కేసులు పెడుతున్నాం అన్నారు. వెంటనే క్రిమినల్ కేసులు పెట్టి నోటీస్ లు పంపాలి అని డిమాండ్ చేసారు.

revath reddy comments on cm kcr

Advertisement

బిశ్వ శర్మ ను అరెస్ట్ చేసి తీసుకురావాలి అని రేవంత్ కేసీఆర్ కు సవాల్ చేసారు. కేసీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఓ స్పెషల్ టీం ను ఏర్పాటు చేయాలి అని ఆయన డిమాండ్ చేసారు. న్యాయ నిపుణుల సలహా తీసుకుని అసోం సీఎం ను అరెస్ట్ చేయండి అని సూచించారు. చర్యలు తీసుకోక పోతే 16వ తేదీన పోలీస్ కమిషనర్, ఎస్పీ కార్యాలయాల ముందు నిరసన తెలుపుతాం అని హెచ్చరించారు.

venkat G

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి