Manchu Vishnu Satirical Comments On Telugu Film Industry Person Over Pension
Manchu Vishnu : టాలీవుడ్ స్టార్ మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు పిల్ల చేష్టలు పీక్స్ కు చేరాయి అంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్నాయి. ఇప్పటికే ఆయన పై రక రకాల విమర్శలు ఉన్నాయి. ఆయన ఒక మా అధ్యక్షుడు అయ్యుండి పెద్ద రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా లేదంటే ఏదో దేశ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాడు అంటూ విమర్శలు వస్తున్నాయి. ఈ సమయంలో టాలీవుడ్ లో నెలకొన్న టికెట్ల విషయం క్లారిటీ వచ్చిన తర్వాత మళ్లీ విషయాన్ని రాద్దాంతం చేసేలా ప్రవర్తించాడు. మంత్రి పేర్ని నాని తమ ఇంటికి వచ్చి తమకు టాలీవుడ్ పెద్దలతో సీఎం మీటింగ్ కి సంబంధించిన విషయాలను తెలియజేశాడు అంటూ సోషల్ మీడియా ద్వారా ఆయన చేసిన వ్యాఖ్యలు బూమరాంగ్ అయ్యాయి. మంత్రి స్వయంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరి తాను ఎందుకు మోహన్ బాబు ఇంటికి కేవలం వారు ఆహ్వానం మేరకు టీ తాగేందుకు వెళ్ళాను చెప్పుకొచ్చాడు.
ఆ సమయంలో అసలు టాలీవుడ్ ప్రముఖుల తో మీటింగ్ విషయమై ఎలాంటి చర్చ జరగలేదు. కేవలం ఒక పెళ్ళికి వెళ్ళిన సమయంలో తనను ఆహ్వానించడంతో వెళ్లాను తప్ప అక్కడికి ప్రత్యేకంగా తాను వెళ్ళలేదు. విష్ణు అలా ఎందుకు అన్నాడో నాకు అర్థం కాలేదు అంటూ పేర్ని నాని వ్యాఖ్యలు చేయడంతో మొత్తం వ్యవహారం అంతా రివర్స్ అయింది. మంచు విష్ణు ఇలా చేయడం ఏమాత్రం బాగా లేదంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తుంటే.. మరి కొందరు ఇవి పిల్ల చేష్టలు కాక మరేంటి అంటూ ప్రశ్నిస్తున్నారు. పేర్ని నాని కౌంటర్ తో మంచు విష్ణు ఇప్పటికే తన ట్వీట్ మార్చిన విషయం తెలిసిందే. అంతే కాకుండా మోహన్ బాబు కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. పేర్ని నాని తమ ఇంటికి వచ్చిన సమయంలో ఇండస్ట్రీకి సంబంధించిన ఎలాంటి విషయాలను చర్చించలేదు అన్నాడు.
social media trolls on manchu vishnu and mohan babu about perni nani issue
తండ్రి కొడుకులు ఇద్దరు కూడా వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మంచు విష్ణు చేసిన వ్యాఖ్యలు చాలా దుమారాన్ని రేపుతున్నాయి. మంచు ఫ్యామిలీ ఇప్పటికే సోషల్ మీడియా కు టార్గెట్ గా ఉంటూ ఉంటుంది. అలాంటిది ఇప్పుడు మళ్ళి ఈ వ్యవహారంతో పెద్ద ఎత్తున దుమారం రేపుతోంది. టాలీవుడ్ పెద్ద అనే హోదా కేవలం చిరంజీవికి మాత్రమే దక్కుతుంది అంటూ మెజారిటీ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలో మోహన్ బాబు మాత్రం తాను ఇండస్ట్రీ పెద్దను అని.. తనను మించిన వాడు ఎవరూ లేరు అంటూ తనకు తాను ప్రకటించడంతో పాటు తన చుట్టూ ఉన్న వారితో అనిపించే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇటీవల సీనియర్ నరేష్ మాట్లాడుతూ ఇండస్ట్రీ పెద్ద మోహన్ బాబు మాత్రమే అంటూ చేసిన వ్యాఖ్యలు మరోసారి దుమారాన్ని రేపాయి. ఇండస్ట్రీ పెద్దగా ఉండాలనుకుంటున్న మోహన్ బాబు ఎందుకు టికెట్ల రేట్ల విషయంలో ముందడుగు వేయలేదు అంటూ కొందరు ప్రశ్నిస్తుంటే.. మరికొందరు మాత్రం ఇండస్ట్రీకి మోహన్ బాబు మరియు మంచు విష్ణు చేసింది ఏమీ లేదు వారు లాభపడుతుంది తప్ప.. కనీసం మంచు విష్ణుకు మా అధ్యక్షుడిగా కొనసాగే అర్హత కూడా లేదు అంటూ మెగా అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
Biryani |బిర్యానీ అంటే నాన్ వెజ్ ప్రియులకి కన్నుల పండుగే. కానీ, తాజాగా హైదరాబాద్ ముషీరాబాద్‌లో ఓ రెస్టారెంట్లో చోటుచేసుకున్న…
Pawan Kalyan | అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫొటోను ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ…
UPI |భారతదేశంలో డిజిటల్ చెల్లింపులకు రూపురేఖలు మార్చిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (UPI) రికార్డులు తిరగరాసింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్…
Trisha | దుబాయ్ వేదికగా ఇటీవల నిర్వహించిన సైమా అవార్డుల వేడుకలో పాల్గొన్న సౌత్ క్వీన్ త్రిష మరోసారి ఫ్యాషన్, సినిమా…
Walking | ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతిరోజూ నడక తప్పనిసరి అని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా రోజుకు 10 వేల అడుగులు నడవడం…
Cholesterol | శరీరంలో LDL (చెడు కొలెస్ట్రాల్) స్థాయులు పెరగడం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తుంటారు. ఇది గుండె సంబంధిత వ్యాధులకు ప్రధాన…
I Phone 17 | టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ తన లేటెస్ట్ ఐఫోన్ మోడల్ ఐఫోన్ 17ను తాజాగా…
Dizziness causes symptoms | చాలా మందికి ఆకస్మాత్తుగా తలతిరిగిన అనుభవం వస్తుంది. లేచి నిలబడినప్పుడు, నడుస్తున్నప్పుడు లేదా తల తిప్పిన…
This website uses cookies.