
rgv-likes pawan kalyan
RGV : సెన్షేషనల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ అంటే పరిచయం ఏమాత్రం అవసరం లేదు. అంతగా ఆయన పాపులర్ అయ్యాడు. కేవలం సినిమాలతోనే కాదు వివాదాలతోను తన స్టైల్ మరొకరికి ఉండదు.. రాదు. ఎప్పుడు ఎవరిని తిడతాడో..ఎప్పుడు ఎవరిని పొగుడుతాడో.. ఎప్పుడు ఎలాంటి సినిమా తీస్తాడో ఎవరూ ఊహించలేరు. ఆర్జీవి అంటే సంచలన దర్శకుడు..కొత్త వాళ్ళకి లైఫ్ ఇస్తాడు. ఇది మాత్రం ప్రతీ ఒక్కరు చెప్పగలరు. ముక్కు మొహం తెలియని వాళ్ళని ఓవర్ నైట్ స్టార్ చేసే కెపాసిటి ఒక్క ఆర్జీవికి మాత్రమే ఉంది.
కాగా ఆర్జీవికి బాగా అలవాటైన..ఇష్టమైన హర్రర్ జోనర్‌లో తాజాగా ఒక సినిమా తీశాడు. ఆ సినిమానే ఆర్జీవి దెయ్యం. విచిత్రం ఏమిటంటే ఈ సినిమాలో యాంగ్రీ హీరో డా.రాజశేఖర్ హీరోగా నటించడం. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ రిలీజై జనాలని బాగానే ఆకట్టుకుంది. ఆర్జీవి మార్క్‌తో తెరకెక్కిన ఈ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు. ఇక ఈ ప్రమోషన్స్‌లో భాగంగా ఆర్జీవి .. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మీద ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ అందరి నోట వినిపిస్తూ వైరలవుతున్నాయి.
rgv-likes pawan kalyan
పవన్ కళ్యాణ్ అంటే ఆర్జీవికి వ్యక్తిగతంగా చాలా ఇష్టమని చెప్పుకొచ్చాడు. అయితే ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలేవీ చూడలేదని.. ఇటీవల రిలీజై బ్లాక్ బస్టర్ అయిన వకీల్ సాబ్ సినిమా కూడా చూడలేదని తెలిపాడు. అయితే వకీల్ సాబ్ ట్రైలర్ మాత్రం చూసినట్టు ..ఈ ట్రైలర్ నాకు బాగా నచ్చిందని చెప్పడమే కాదు ఇలాంటి సినిమాలు నేను పవన్ కళ్యాణ్‌తో తీయలేనని క్లారిటీ ఇచ్చాడు. కమర్షియల్ సినిమాలను పవన్ కళ్యాణ్‌తో తీయడం రాదన్న ఆర్జీవీ..జోనర్ సినిమాలను మాత్రమే తీయగలనని వెల్లడించాడు. అయితే చాలా కాలం తర్వాత ఆర్జీవి పవన్ కళ్యాణ్ గురించి పాజిటివ్‌గా స్పందించడం విశేషం.
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
This website uses cookies.