
Rohit Sharma : గెలిచాక పిచ్‌పై మట్టి తిన్న రోహిత్ శర్మ.. అందుకు కారణం ఏంటో రివీల్ చేశాడు
Rohit Sharma : టీ20 ప్రపంచకప్ 2024 విజయంతో రోహిత్ శర్మ చాలా ఆనందంలో ఉన్నారు. తన కెప్టెన్సీలో టీమిండియాకి కప్ రావడంతో ఉబ్బితబ్బిబవుతున్నాడు. గతేడాది మిస్సయిన వన్డే వరల్డ్ కప్ ఇప్పుడు టీ20 వరల్డ్ కప్ రూపంలో అందడంతో చాలా ఎమోషనల్ అయ్యాడు. కపిల్ దేవ్, ధోనీ తర్వాత ఇండియాకు వరల్డ్ కప్ అందించిన మూడో కెప్టెన్ రోహిత్ శర్మ కావడం విశేషం. అయితే కప్ గెలిచిన రోజు తాను అసలు నిద్ర పోలేదని చెప్పాడు. “అదంతా కలగానే ఉంది. ఆ సమయంలో కలిగిన ఫీలింగ్ అదే. ఎన్నో ఏళ్లుగా దీని గురించి కల కన్నాము. ఓ జట్టుగా చాలా కష్టపడ్డాం. మొత్తానికి దానిని సాధించాం. కష్టపడి సాధించిన తర్వాత కలిగే ఆ ఫీలింగ్ చాలా బాగుంటుంది. ఆ రాత్రి అసలు పడుకోనేలేదు. అయినా నాకేమీ అనిపించడం లేదు. ఇంటికెళ్లిన తర్వాత అదే పని చేస్తాను” అని రోహిత్ అన్నాడు.
17 ఏళ్ల తర్వాత టీ20 వరల్డ్ కప్, 13 ఏళ్ల తర్వాత ఓ క్రికెట్ వరల్డ్ కప్, 11 ఏళ్ల తర్వాత ఓ ఐసీసీ ట్రోఫీని టీమిండియాకు అందించిన రోహిత్ తన భావోద్వేగాలను అదుపు చేసుకోలేకపోయాడు. అయితే గెలిచిన వెంటనే రోహిత్ పిచ్ వద్దకు వెళ్లి మట్టి తిన్నాడు. దానిపై ఓ వీడియోలో వివరణ ఇచ్చాడు. మంచి విజయాన్ని అందించిన పిచ్‌ను తనలో భాగం చేసుకోవాలనే ఉద్దేశంతోనే మట్టిని తిన్నానని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. ఆ పిచ్‌పై గెలిచాం కాబట్టి అది మాకు ఎంతో ప్రత్యేకం. ఈ విజయంతో పాటు మైదానాన్ని, పిచ్‌ను జీవితాంతం గుర్తుంచుకుంటా. పిచ్‌ను నాలో భాగం చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఆ మట్టిని నా నోట్లో వేసుకున్నాను. ఈ గెలుపు క్షణాలు చాలా ప్రత్యేకమైనవి అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.
Rohit Sharma : గెలిచాక పిచ్‌పై మట్టి తిన్న రోహిత్ శర్మ.. అందుకు కారణం ఏంటో రివీల్ చేశాడు
టీ20 వరల్డ్ కప్ గెలవడం ఇప్పటికీ తనకు కలగానే ఉందని, అసలు అలా జరగలేదేమో అనిపిస్తోందని రోహిత్ ఈ వీడియోలో అనడం విశేషం. “గెలిచిన తర్వాత క్షణాలను నేను మాటల్లో వర్ణించలేను. ఏదీ ముందుగా అనుకొని చేసింది కాదు. అప్పటికప్పుడు అలా చేస్తూ వెళ్లిందే. ఈ ఫీలింగ్ చాలా అద్భుతం..ఓ జట్టుగా చాలా కష్టపడ్డాం. మొత్తానికి దానిని సాధించాం. కష్టపడి సాధించిన తర్వాత కలిగే ఆ ఫీలింగ్ చాలా బాగుంటుంది. ఆ రాత్రి అసలు పడుకోనేలేదు. అయినా నాకేమీ అనిపించడం లేదు. ఇంటికెళ్లిన తర్వాత అదే పని చేస్తాను” అని రోహిత్ అన్నాడు. ఇక ఇటీవల రోహిత్ శర్మ టీ20లకి రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
This website uses cookies.