
Revanth Reddy : సినిమా వాళ్లకి రేవంత్ మాస్ వార్నింగ్.. ఆయన చెప్పినట్టు సెలబ్స్ వింటారా.. లేదా..!
Revanth Reddy : డ్రగ్స్ విషయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. డ్రగ్స్ అనేది తెలంగాణలో లేకుండా చేయాలని ఆయన కంకణం కట్టుకున్నారు. తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చాలి.. అంటూ అధికారంలోకి వచ్చినప్పటి నుంచే డ్రగ్స్ నివారణకు కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు పదే పదే సూచనలిస్తూ వస్తున్నారు. అయితే ఇటీవల జరిగిన కార్యక్రమంలో డ్రగ్స్ సైబర్ క్రైమ్ నివారణకు సినిమా ఇండస్ట్రీ తోడ్పడాలంటూ సూచించారు. సమాజాన్ని పీడిస్తున్న సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు.కేవలం సినిమా టికెట్ల ధర పెంపు కోసమో.. లేదా షూటింగుల అనుమతుల కోసం సినీ ప్రముఖులు ప్రభుత్వం దగ్గరకు రావద్దు .. సమాజాన్ని పీడిస్తున్న సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి.. అంటూ సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.
ఇటీవల తెలంగాణ ప్రభుత్వం కోసం మెగాస్టార్ చిరంజీవి మాదకద్రవ్యాల వ్యతిరేక ప్రచారంలో పాల్గొన్న సంగతి తెలిసిందే. చిరంజీవి తన సందేశంతో కూడిన వీడియోను రూపొందించి ప్రభుత్వానికి అందించారు. ఆ వీడియో సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకట్టుకుంది. డ్రగ్స్ కు బానిసై జీవితాలు నాశనం చేసుకోవద్దని చిరంజీవి ఆ వీడియోలో పిలుపునిచ్చారు. అందుకు సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ… చిరంజీవికి కృతజ్ఞతలు తెలిపారు. చిరంజీవి వంటి అగ్ర నటుడు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి డ్రగ్స్ వ్యతిరేక ప్రచారంలో పాల్గొనడం హర్షణీయం అని తెలిపారు. అయితే, మిగతా సినీ తారలు చిరంజీవి తరహాలో డ్రగ్స్ వ్యతిరేకం ప్రచారంలో పాల్గొనడంలేదని రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు.
Revanth Reddy : సినిమా వాళ్లకి రేవంత్ మాస్ వార్నింగ్.. ఆయన చెప్పినట్టు సెలబ్స్ వింటారా.. లేదా..!
డ్రగ్స్ వాడకాన్ని వ్యతిరేకిస్తూ, చిరంజీవి స్ఫూర్తిగా అందరూ ఉద్యమంలో పాలుపంచుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యల వీడియోను తెలంగాణ పోలీస్ విభాగం ట్వీట్ చేయగా, దీనిపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. “థాంక్యూ రేవంత్ రెడ్డి గారూ… ప్రజలకు ఎంతో ముఖ్యమైన సమాచారాన్ని ముందుకు తీసుకెళ్లడం అనేది నా బాధ్యతగా భావిస్తున్నాను అని స్పందించారు. అయితే రేవంత్ రెడ్డి ఇచ్చిన స్ట్రాంగ్ కౌంటర్ విషయం గురించి ఇప్పడు సినిమా పరిశ్రమలో చర్చ నడుస్తుంది. రేవంత్ వ్యాఖ్యలని సినిమా పరిశ్రమ పరిగణలోకి తీసుకొని ముందుకు సాగుతుందా లేదా అనేది చూడాలి.
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
This website uses cookies.