Home » Entertainment » Sai Durga Tej Open Up Relation
Entertainment

Sai Durga Tej | మీడియా వ‌ల్లే నా రిలేష‌న్ బ్రేక‌ప్ అయింది.. సాయి దుర్గ తేజ్ స్ట‌న్నింగ్ కామెంట్స్

Authored By
Sam C
The Telugu News | Updated on: September 14, 2025 7:57 am
Advertisement

Sai Durga Tej |టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో ఒక‌రిగా గుర్తింపు తెచ్చుకున్నారు సాయి దుర్గ తేజ్.త‌న తోటి హీరోలంతా ఒక్కరొక్కరుగా పెళ్లి పీటలు ఎక్కుతున్నా మ‌నోడు సైలెంట్‌గానే ఉంటున్నాడు.. తాజాగా తన ప్రేమ, పెళ్లిపై స్పందించారు.కాన్పిడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII)లో భాగంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ‘అభయమ్ మసూమ్ సమ్మిట్ 2025’ కార్యక్రమంలోపాల్గొన్న‌ సాయి దుర్గ తేజ్ పెళ్లి ఎప్పుడు చేస్తుకుంటారనే ప్రశ్నకు బదులిచ్చారు.

Advertisement

#image_title

వారి వ‌ల్లే బ్రేక‌ప్..

Advertisement

నేను తప్పకుండా వివాహం చేసుకుంటాను. అయితే ఆ విషయాన్ని తనే స్వయంగా ప్రకటిస్తానని అన్నారు. అప్పటి వరకూ మీడియా అత్యుత్సాహం ప్రదర్శించవద్దని రిక్వెస్ట్ చేశారు. మీడియా కారణంగానే రెండేళ్ల క్రితం తనకు బ్రేకప్ అయిందని చెప్పారు. 2023లో నాకు బ్యాడ్ బ్రేకప్ అయింది. ఆ బ్రేకప్ మీడియా వల్ల అయింది. మీడియా వాళ్లు నాపై ప్రేమతో ఈ అమ్మాయితో పెళ్లి, ఆ అమ్మాయితో పెళ్లి.. ఆ సినిమా హిట్టైంది కాబట్టి వెంటనే పెళ్లి అంటూ గ్యాప్ ఇవ్వకుండా, నన్ను ఊపిరి పీల్చుకోనివ్వకుండా మీడియా చాలా వార్తలు రాసేసింది.

దాని వల్ల నాకు బ్రేకప్ అయింది. ఆ అమ్మాయి నా కాలేజ్ గర్ల్ ఫ్రెండ్. తను ఈ మీడియా కథనాలను భరించలేకపోయింది. ఆమె చాలా ఆందోళనకు గురైంది. మీడియా వాళ్లు నా పెళ్లి బాధ్యత తీసుకోవాలని కోరుకుంటున్నా. దయచేసి మీడియా సైలెంట్ గా ఉంటే నా మ్యారేజ్ గురించి నేనే అనౌన్స్ చేస్తాఅని సాయి దుర్గ తేజ్ తెలిపారు.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి