Home » Entertainment » Samantha Naga Chaitanya Divorce News Viral
Entertainment

Samantha- Naga Chaitanya | సమంత- నాగచైతన్య విడాకులపై ఎట్ట‌కేల‌కి స్పందించిన‌ నాగ సుశీల

Authored By
Sam C
The Telugu News | Published on: August 25, 2025, 2:00 pm
Advertisement

Samantha- Naga Chaitanya | టాలీవుడ్‌లో ఓ కాలంలో ఐకానిక్ జోడీగా వెలిగిన నాగచైతన్య – సమంత ప్రేమించి పెళ్లి చేసుకొని, నాలుగేళ్లలోనే విడిపోయిన విషయం తెలిసిందే. వీరి విడాకులు అభిమానుల్లో తీవ్ర నిరాశ కలిగించాయి
వీరిద్దరూ విడిపోయిన తర్వాత అనేక రూమర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్ కారణమన్నవారు, చైతన్య పెట్టిన రెస్ట్రిక్షన్స్ వల్లే అని మరికొందరు అనడంతో వివాదం ముదిరింది.

Advertisement

#image_title

వారి వ్య‌క్తిగ‌త నిర్ణ‌యం..

Advertisement

కానీ ఈ విషయంపై సమంతా, చైతన్య ఇప్పటికీ అధికారికంగా స్పందించలేదు. ప్రతి ఒక్కరు తమ తమ కెరీర్‌ మీద దృష్టి పెట్టారు.ఇక ఇటీవల నాగచైతన్య – శోభిత ధూళిపాళ వివాహం తర్వాత ఈ వ్యవహారం మరోసారి హాట్ టాపిక్ అయింది. చైతూ తప్పే ఎక్కువ అని కొందరు భావించగా, మరికొందరు సమంత వైపు వాదన వినిపించారు. అయినప్పటికీ, వీరిద్దరి విడాకుల వెనక అసలు కారణం ఏమిటన్నది మాత్రం ఇప్పటికీ ప్రశ్నగానే మిగిలిపోయింది.

ఇలాంటి సమయంలో నాగచైతన్య మేనత్త నాగ సుశీల తాజా వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..”సమంత, చైతన్య పెళ్లి చేసుకోవాలనగా మేము ఎప్పుడూ వ్యతిరేకించలేదు. అలాగే, వారు విడిపోవాలనుకున్నప్పుడు కూడా మేము అడ్డుకోలేదు. ఇది వారి వ్యక్తిగత నిర్ణయం. మేము ఎవరినీ బ్లేమ్ చేయలేదు, వాళ్ల అభిప్రాయాన్నే గౌరవించాం” అని చెప్పుకొచ్చారు.ఈ కామెంట్లు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. నాగ సుశీల చేసిన వ్యాఖ్యలు చూస్తే, వారి కుటుంబం ఈ విడాకులను స్వీకరించిన తీరును అర్థం చేసుకోవచ్చు.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి