Smart Tv : ప్రస్తుతం స్మార్ట్ పరికరాల వైపునకే అందిరి చూపు మళ్లుతోంది. టీవీల విషయంలో కూడా ఇదే ట్రెండ్ కొనసాగుతోంది. అయితే, స్మార్ట్ ఫోన్ల మాదిరిగా స్మార్ట్ టీవీలను వెంట వెంటనే మార్చలేము కదా.. అందుకే, స్మార్ట్ టీవీల ఎంపికలో కొంత ఎక్కువగా ఆలోచిస్తుంటాం. స్మార్ట్ ఫోన్ల లాగే, ఈ స్మార్ట్ టీవీలు కూడా ఆపరేటింగ్ సిస్టమ్స్ పైన నడుస్తాయి. అత్యంత ప్రజాదరణ పొందిన బ్రాండ్లు చాలా ఫీచర్స్ అందుబాటులోకి తెచ్చాయి.
అయితే బ్లౌపంక్ట్ (blaupunkt) సంస్థ భారత్‌లో మరో రెండు స్మార్ట్ టీవీలను లాంచ్ చేసింది. కాగా సైబర్ సౌండ్ సిరీస్‌లో 40 ఇంచెస్ హెచ్ డీ, 43 ఇంచెస్ ఫుల్ హెచ్ డీ దస్మార్ట్ టీవీలను అందుబాటులోకి తీసుకువచ్చింది. బ్లౌపంక్ట్ సైబర్ సౌండ్ 40 ఇంచెస్ స్మార్ట్ టీవీ ధర రూ.15,999 గా నిర్ణహించారు. 43 ఇంచెస్ స్మార్ట టీవీ ధర రూ.19,999 గా నిర్ణయించారు. అయితే శనివారం (మార్చ్ 12) నుంచి ఈ మాడల్స్ ఈ కామర్స్ ప్లాట్ఫామ్ ఫ్లప్‌కార్ట్ లో ఈ టీవీలు అమ్మకానికి అందుబాటులో ఉన్నాయి.
అయితే ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సందర్భంగా ఎస్బీఐ క్రెడిట్ కార్డులతో కొంటే రూ. 1000 అదనపు డిస్కౌంట్ కూడా పొందవచ్చు. దీంతో బ్లౌపంక్ట్ సైబర్ సౌండ్ టీవీ 40 ఇంచెస్ మోడల్‌ను రూ.14,999కే కొనుగోలు చేయవచ్చు. అలాగే 43 ఇంచెస్ మోడల్ టీవీ రూ. 18,999 కే పొందవచ్చు.బ్లౌపంక్ట్ సైబర్‌సౌండ్ స్మార్ట్ టీవీ 40 ఇంచెస్ మోడల్ హెచ్‌డీ రెడీ (1336×768 పిక్సెల్స్) రెజల్యూషన్ డిస్‌ప్లే, 400 పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తోంది. అంచులు (బెజిల్స్) చాలా సన్నగా ఉంటాయి. 43 ఇంచుల మోడల్ ఫుల్ హెచ్‌డీ (1920×1080 పిక్సెల్స్) రెజల్యూషన్ డిస్‌ప్లే కలిగి ఉండగా.. పీక్ బ్రైట్‌నెస్ 500 నిట్స్‌గా ఉంటుంది. బెజిల్ లెస్ డిజైన్ ఉంటుంది. క్వాడ్‌కోర్ ప్రాసెసర్‌పై నడిచే ఈ స్మార్ట్ టీవీల్లో 1జీబీ ర్యామ్, 8జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది.
అయితే ఈ రెండు టీవీలు ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద నడుస్తాయి. అమెజాన్ ప్రైమ్, సోనీ లివ్, యూట్యూబ్ లాంటి యాప్స్ ప్రీ ఇన్‌స్టాల్ అయి ఉంటాయి. గూగుల్ ప్లే ద్వారా సపోర్ట్ చేసే యాప్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కాగా ఈ టీవీలు నెట్‌ఫ్లిక్స్‌కు సపోర్ట్ చేయవు.
గూగుల్ అసిస్టెంట్ సపోర్టుతో రిమోట్ ద్వారానే వాయిస్ కమాండ్ ఇచ్చే ఫీచర్ కూడా ఉంటుంది. ఇక బ్లౌపంక్ట్ టీవీల్లో ఈ రెండు మోడల్స్ డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్, యాపిల్ ఎయిర్ ప్లే కనెక్టివిటీ ఆప్షన్లతో వస్తున్నాయి. అలాగే మూడు హెచ్‌డీఎంఐ పోర్టులు, రెండు యూఎస్‌బీ పోర్టులు, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి. ఇన్‌బుల్ట్ క్రోమ్ కాస్ట్ ఫీచర్ కూడా ఉంటుంది.
Devi Sri Prasad : పుష్ప2 మ్యూజిక్ విషయంలో దేవి శ్రీ ప్రసాద్‌కి నిర్మాతలకి గొడవలు జరిగినట్టు అనేక వార్తలు…
Groom Chase : అచ్చం సినిమాలో జరిగిన చేజ్ సీన్ విధంగా బయట ఓ సంఘటన జరిగింది. విలన్ పారిపోతుంటే…
Allu Arjun Pushpa 2 Kissik Song : ఇప్పుడు దేశ వ్యాప్తంగా ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తిగా పుష్న2…
Kangana Ranaut : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహా వికాస్ అఘాడి ఘోర పరాజయం తర్వాత, బాలీవుడ్ నటి, బిజెపి…
Bigg Boss Telugu 8 : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం మరి కొద్ది రోజులలో…
Ind Vs Aus : సొంత గడ్డపై దారుణమైన ఓటమిని తమ ఖాతాలో వేసుకున్న భారత India జట్టు ఇప్పుడు…
Health Benefits : పారిజాత మొక్క శాస్త్రీయంగా Nyctanthes arbor-tristis అని పిలుస్తారు. ఇది సువాసనగల, రాత్రిపూట పుష్పించే చెట్టు.…
Banana - Apple : అరటిపండు ఎంతో మధురంగా ఉంటుంది. అంతేకాదు ఈ పండులో ఖనిజాలు విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి.…
This website uses cookies.