supreme court praises ap cm ys jagan
YS Jagan : ప్రస్తుతం ఏపీలో ఏం జరుగుతోంది. ఎన్నికలు త్వరలో రానున్న నేపథ్యంలో ఏపీ రాజకీయాలు రాత్రికి రాత్రే మారుతున్నాయి. రాజకీయాలన్నీ హీటెక్కాయి. ఏపీలో ప్రస్తుతం పాలన వైసీపీ కేంద్రంగానే నడుస్తోంది. ఏపీ సీఎం వైఎస్ జగన్ ఏపీని అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నారు. అందుకే ఇతర రాష్ట్రాలు కూడా ఏపీ ప్రభుత్వాన్ని పొగుడుతున్నాయి. ఏపీలో అమలు అవుతున్న సంక్షేమ పథకాలను తమ రాష్ట్రాల్లో అమలు చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.
మరోవైపు సంఘ విద్రోహ శక్తులు కూడా రెచ్చిపోతున్నాయి. కోర్టుల్లో తగిన తీర్పులు వస్తేనే వీళ్లకు ఉచ్చు బిగిస్తున్నారు. కోర్టుల్లో ఉన్న లొసుగులను వాడుకుంటున్నారు. కానీ.. ఇప్పుడు ఏపీ సీఎం వైఎస్ జగన్ ను శెభాష్ అంటున్నాయి కోర్టులు. ఎందుకంటే.. ఏపీలో ప్రస్తుతం ఒక వ్యక్తి మద్యం స్మగ్లింగ్ ను పెద్ద ఎత్తున్న చేస్తున్నారట. అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఆ వ్యక్తిని పట్టుకున్నారు పోలీసులు. వాళ్లపై వైసీపీ ప్రభుత్వం కూడా సీరియస్ గా ఉంది. చట్టపరమైన కేసులు పెడుతూ ముందుకు వెళ్తోంది. దీంతో ఈ మద్యం స్మగ్లర్ హైకోర్టు కాదు.. ఏకంగా సుప్రీంకోర్టు దాకా వెళ్లాడు. కానీ.. ఏపీ ప్రభుత్వానికే అనుకూలంగా తీర్పు ఇచ్చింది సుప్రీం కోర్టు.
supreme court praises ap cm ys jagan
అయితే.. నిర్బంధన కరెక్టే అని.. అటువంటి వాళ్లను నిర్బంధించడం కరెక్టే అని సుప్రీం కోర్టు కూడా ఏపీ ప్రభుత్వాన్ని శెభాష్ అని మెచ్చుకుంది. మద్యం స్మగ్లర్లపై, అక్రమ రవాణాపై దృష్టి పెట్టిన ప్రభుత్వం చర్యలకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే ఆ వ్యక్తిని అరెస్ట్ చేసింది ఏపీ ప్రభుత్వం. అతడు కోర్టుల్లోకి వెళ్లినా.. నన్ను మించింది ఇంకేముంది అనుకున్నాడు. డబ్బు ఉంటే ఏదైనా సాధించవచ్చు అనుకునే వాళ్లు ఈ ఘటన చెంపపెట్టు. కోర్టుల్లో న్యాయం చాలా సార్లు గెలుస్తుంది. కోర్టులు కూడా న్యాయం చేస్తున్నాయి కాబట్టే సమాజం ఇలా ఉంది. ఏది ఏమైనా.. సీఎం జగన్ వ్యూహం, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై కోర్టు కూడా ప్రశంసలు కురిపించింది. ఇక నిన్ను ఎవరూ ఆపేది లేదు అని ప్రభుత్వానికి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చింది. తప్పు చేసిన వాడిని ముక్కు పిండి మరీ కూర్చోబెట్టాలి. అప్పుడు మళ్లీ తప్పు చేయాలని అనుకునేవాడు భయపడతాడు.
Urea Shortage : మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యూరియా కొరతపై సంచలన వ్యాఖ్యలు…
Allu Business Park faces GHMC Notice : ప్రముఖ సినీ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్కు…
Malla Reddy Key Comments on CBN : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్యే మల్లారెడ్డి మరోసారి హాట్ టాపిక్గా మారారు.…
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) హైదరాబాద్లో జరిగిన కాళోజీ జయంతి, చాకలి ఐలమ్మ వర్థంతి కార్యక్రమంలో ముఖ్య…
Nepal Crisis Deepens : నేపాల్లో జెన్-జెడ్ యువత ఆందోళనలు దేశ రాజకీయాలను కుదిపేశాయి. సోషల్ మీడియా నిషేధం, అవినీతి…
Apple Event | ఐఫోన్ అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న క్షణం ఆసన్నమైంది. ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ తన…
Group 1 | గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలో జరిగిన అవకతవకలపై పలు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో, తెలంగాణ హైకోర్టు…
Rains | తెలుగు రాష్ట్రాల ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక హెచ్చరికను జారీ చేసింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్న…
This website uses cookies.