కరోనా బారిన పడి కోలుకున్న వారిలో చాలా మందికి బ్లాక్ ఫంగస్ అనే వ్యాధి వస్తోంది. ప్రస్తుతం దేశంలో అనేక రాష్ట్రాల్లో బ్లాక్ ఫంగస్ బాధితుల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. ఈ విషయం అందరినీ ఆందోళనకు గురి చేస్తోంది. ఈ క్రమంలోనే బ్లాక్ ఫంగస్ బాధితులకు ప్రభుత్వాలు ప్రత్యేక చికిత్సను అందిస్తున్నాయి. అయితే కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ బ్లాక్ ఫంగస్ వచ్చిన వారికి పలు ఆయుర్వేద ఔషధాలను తీసుకోవాలని సూచిస్తోంది. దీంతో బ్లాక్ ఫంగస్ తగ్గుముఖం పడుతుంది. వీటిని రోజూ భోజనం చేసిన తరువాత తీసుకోవాలని ఆయుష్ మంత్రిత్వ శాఖ సూచించింది.
బ్లాక్ ఫంగస్ ఉన్నవారు కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ సూచించిన మేర 3 రకాల ఔషధాలను వాడాల్సి ఉంటుంది. అవి…
1. సంశమనవటి (500ఎంజీ) – ఉదయం, రాత్రి భోజనం తరువాత ఒక్కో ట్యాబ్లెట్ చొప్పున తీసుకోవాలి.
2. నిశామలకివటి (500ఎంజీ) – ఉదయం, రాత్రి భోజనం అనంతరం ఒక్కో ట్యాబ్లెట్ ను తీసుకోవాలి.
3. సుదర్శనఘనవటి (500ఎంజీ) – ఉదయం భోజనం తరువాత 1, రాత్రి భోజనం తరువాత 2 ట్యాబ్లెట్లను తీసుకోవాలి.
ఈ ట్యాబ్లెట్లను బ్లాక్ ఫంగస్ ఉన్నవారు వాడితే త్వరగా ఆ వ్యాధి నుంచి బయట పడవచ్చు. ఇక ఈ వ్యాధి ఉన్నవారు రోజూ గోరు వెచ్చని నీటిని తాగాలి. ఆహారం వేడిగా ఉండగానే భోజనం చేయాలి. తేలిగ్గా జీర్ణం అయ్యే ఆహారాలను తీసుకోవాలి.
దానిమ్మ, ద్రాక్ష, బత్తాయి, బొప్పాయి, జామ, ఖర్జూర పండ్లను తినాలి. ఇంట్లోనూ, బయటకు వెళ్లినప్పుడు మాస్కులను ధరించాలి. ఇంట్లోకి గాలి, వెలుతురు సరిగ్గా వచ్చేలా చూసుకోవాలి. రోజుకు 2 సార్లు ఆవిరి పట్టాలి. రక్తంలో చక్కెర స్థాయిలను ఎప్పటికప్పుడు చెక్ చేయించుకోవాలి. నియంత్రణలో లేకపోతే వైద్యుల సూచన మేరకు మందులను వాడుకోవాలి.
బ్లాక్ ఫంగస్ ఉన్నవారు చల్లని పదార్థాలు, శీతల పానీయాలు, ఫ్రిజ్‌లో నిల్వ ఉంచిన ఆహారాలను తినరాదు. బేకరీ ఫుడ్‌ను తీసుకోరాదు. చల్లని గాలి (ఏసీ, కూలర్)లో ఉండరాదు. పెరుగు తినకూడదు.
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…
Airtel : ఎయిర్‌టెల్‌లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
Paritala Sunitha : వై.సి.పి. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిద్రలో కూడా పరిటాల రవినే కలవరిస్తున్నారని అనంతపురం…
Kadiyam Srihari : పార్టీ ఫిరాయింపుల అంశం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవలి ఎన్నికల అనంతరం…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలలో మమేకమయ్యే విషయంలో అన్ని హద్దులనూ చెరిపివేస్తున్నారు. గతంలో ఎన్నడూ…
Anitha : హోంమంత్రి అనితా వంగలపూడి తాజాగా జగన్ అరెస్ట్ అంశంపై స్పష్టతనిచ్చారు, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కీలక వ్యాఖ్యలు…
Old Women : సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలో ఓ వృద్ధురాలి స్థితి ఇప్పుడు అందరికీ కన్నీళ్లు తెప్పిస్తోంది.…
This website uses cookies.