బ్లాక్ ఫంగ‌స్ వ‌చ్చిన వారికి ఆయుష్ మంత్రిత్వ శాఖ సూచిస్తున్న 3 ఆయుర్వేద మందులు

0
Advertisement

క‌రోనా బారిన ప‌డి కోలుకున్న వారిలో చాలా మందికి బ్లాక్ ఫంగ‌స్ అనే వ్యాధి వ‌స్తోంది. ప్ర‌స్తుతం దేశంలో అనేక రాష్ట్రాల్లో బ్లాక్ ఫంగ‌స్ బాధితుల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. ఈ విష‌యం అంద‌రినీ ఆందోళ‌న‌కు గురి చేస్తోంది. ఈ క్ర‌మంలోనే బ్లాక్ ఫంగ‌స్ బాధితుల‌కు ప్ర‌భుత్వాలు ప్ర‌త్యేక చికిత్స‌ను అందిస్తున్నాయి. అయితే కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ బ్లాక్ ఫంగ‌స్ వ‌చ్చిన వారికి ప‌లు ఆయుర్వేద ఔష‌ధాల‌ను తీసుకోవాల‌ని సూచిస్తోంది. దీంతో బ్లాక్ ఫంగ‌స్ త‌గ్గుముఖం ప‌డుతుంది. వీటిని రోజూ భోజ‌నం చేసిన త‌రువాత తీసుకోవాల‌ని ఆయుష్ మంత్రిత్వ శాఖ సూచించింది.

take these 3 ayurvedic medicine for black fungus

బ్లాక్ ఫంగ‌స్ ఉన్న‌వారు కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ సూచించిన మేర 3 ర‌కాల ఔష‌ధాల‌ను వాడాల్సి ఉంటుంది. అవి…

1. సంశ‌మ‌న‌వ‌టి (500ఎంజీ) – ఉద‌యం, రాత్రి భోజ‌నం త‌రువాత ఒక్కో ట్యాబ్లెట్ చొప్పున తీసుకోవాలి.
2. నిశామ‌ల‌కివ‌టి (500ఎంజీ) – ఉద‌యం, రాత్రి భోజనం అనంత‌రం ఒక్కో ట్యాబ్లెట్ ను తీసుకోవాలి.
3. సుదర్శ‌న‌ఘ‌న‌వ‌టి (500ఎంజీ) – ఉద‌యం భోజ‌నం త‌రువాత 1, రాత్రి భోజ‌నం త‌రువాత 2 ట్యాబ్లెట్ల‌ను తీసుకోవాలి.

ఈ ట్యాబ్లెట్ల‌ను బ్లాక్ ఫంగ‌స్ ఉన్న‌వారు వాడితే త్వ‌ర‌గా ఆ వ్యాధి నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. ఇక ఈ వ్యాధి ఉన్న‌వారు రోజూ గోరు వెచ్చ‌ని నీటిని తాగాలి. ఆహారం వేడిగా ఉండ‌గానే భోజ‌నం చేయాలి. తేలిగ్గా జీర్ణం అయ్యే ఆహారాల‌ను తీసుకోవాలి.

దానిమ్మ‌, ద్రాక్ష‌, బ‌త్తాయి, బొప్పాయి, జామ‌, ఖ‌ర్జూర పండ్ల‌ను తినాలి. ఇంట్లోనూ, బ‌య‌ట‌కు వెళ్లిన‌ప్పుడు మాస్కుల‌ను ధ‌రించాలి. ఇంట్లోకి గాలి, వెలుతురు స‌రిగ్గా వ‌చ్చేలా చూసుకోవాలి. రోజుకు 2 సార్లు ఆవిరి ప‌ట్టాలి. ర‌క్తంలో చ‌క్కెర స్థాయిల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు చెక్ చేయించుకోవాలి. నియంత్ర‌ణ‌లో లేక‌పోతే వైద్యుల సూచ‌న మేర‌కు మందుల‌ను వాడుకోవాలి.

బ్లాక్ ఫంగ‌స్ ఉన్న‌వారు చ‌ల్లని ప‌దార్థాలు, శీత‌ల పానీయాలు, ఫ్రిజ్‌లో నిల్వ ఉంచిన ఆహారాల‌ను తిన‌రాదు. బేక‌రీ ఫుడ్‌ను తీసుకోరాదు. చ‌ల్ల‌ని గాలి (ఏసీ, కూల‌ర్‌)లో ఉండ‌రాదు. పెరుగు తిన‌కూడ‌దు.

Advertisement