Akula Venkateswara Rao
TDP : ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన వీడియో అచ్చెన్నాయుడుది. సోషల్ మీడియాలో నిన్నటి నుంచి తెగ వైరల్ అవుతోంది అది. ఆ వీడియోలో అచ్చెన్నాయుడు… టీడీపీ పార్టీనా బొక్కా… మన పార్టీ అయితే కాదు కదా.. ఈనెల 17 తర్వాత పార్టీ ఉండదు… బొక్కా ఉండదు.. లోకేశ్ మంచిగా ఉంటే ఇన్ని సమస్యలు ఎందుకు వస్తాయి… అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఆ వీడియోలో మాట్లాడిన వ్యక్తి… ఆ వ్యక్తి తన బాధలను అచ్చెన్నాయుడుతో చెబుతూ… సీక్రెట్ గా వీడియో తీసి… ఆ వీడియోను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడంతో… ప్రస్తుతం ఆ వీడియో ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశం అయింది.
tdp leader akula venkateswara rao speaks about chandrababu and lokesh
ఆ వీడియో తీసిన వ్యక్తి… అచ్చెన్నాయుడు వీడియోలో మాట్లాడిన వ్యక్తి ఎవరో కాదు… టీడీపీ సీనియర్ నేత ఆకుల వెంకటేశ్వర రావు. ఆయనది హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్. తనకు జూబ్లీహిల్స్ లో ఉన్న 400 గజాల లాండ్ విషయంలో చంద్రబాబు సాయం చేయాలని కోరితే చేయలేదని… లోకేశ్ బాబు అయితే తనను సూసైడ్ చేసుకోవాలని బెదిరించాడని వాపోయారు. అందుకే తిరుపతి ఉపఎన్నికల ప్రచారంలో ఉన్న చంద్రబాబుకు తన గోడు వినిపించడం కోసం అక్కడికి వెళ్లానని… అక్కడ షర్ట్ విప్పి చంద్రబాబు మీద వేయబోయి…. తన నిరసనను వ్యక్తం చేశానన్నారు.
అచ్చెన్నాయుడు నారా లోకేశ్ పై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను బయటపెట్టినందుకు నన్ను చంపేస్తామని టీడీపీ నేతలు బెదిరిస్తున్నారు. నాకు ప్రాణ హాని ఉంది. నా స్థలాన్ని నాకు కాకుండా చేశారు. 6 కోట్ల విలువైన ప్రాపర్టీని చంద్రబాబు, లోకేశ్ అండ చూసుకొని కేఎల్ నారాయణ అనే వ్యక్తి కబ్జా చేశాడు. నన్ను కావాలని వీళ్లంతా కలిసి ఇబ్బందులకు గురి చేస్తున్నారు. 30 ఏళ్లు టీడీపీకి గొడ్డు కష్టం చేశాను. ఇంత నీచునికా నేను పనిచేసింది. వాడు.. లోకేశ్ గాడు… నన్ను సూసైడ్ చేసుకోమంటాడా? అంటూ ఆకుల వెంకటేశ్వరరావు ఫిర్యాదు చేశారు. తనకు ప్రాణ హాని ఉందని వెంకటేశ్వరరావు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.