TDP చంద్రబాబు నాయుడు తెలుగు రాజకీయాల్లో 40 ఏళ్ల రాజకీయ అనుభవమున్న నేత. అలాంటి చంద్రబాబు ఈసారి మాత్రం ఎటువంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. తన పార్టీ గుర్తుపై గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలు అధికార పార్టీకి వత్తాసు పలికినా ఎటువంటి చర్యలు తీసుకోలేకపోతున్నారు. కనీసం వారిపై అనర్హత వేటు వేయాలన్న పిటీషన్ ను కూడా చంద్రబాబు పార్టీ అధినేతగా స్పీకర్ కు ఇవ్వలేకపోయారు. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ TDP దారుణ ఓటమిని చవిచూసింది. 23 మంది ఎమ్మెల్యేలు మాత్రమే విజయం సాధించారు. తెలుగుదేశం పార్టీ TDPచరిత్రలోనే ఇది అత్యంత దారుణమైన ఓటమి. ఈ ఓటమిని జీర్ణించుకుని నిలదొక్కుకుందామనుకునే లోపే నలుగురు ఎమ్మెల్యేలు పార్టీకి దూరమయ్యారు. వారు పార్టీకి రాజీనామా చేయకుండానే వైసీపీ ప్రభుత్వానికి మద్దతు పలికారు. తెలుగుదేశం పార్టీ TDP పై విమర్శలు చేస్తున్నారు.
వదిలేయడంపై కేడర్ గుస్సా.. TDP
టీడీపీ TDP ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, కరణం బలరాం, మద్దాలి గిరి, వాసుపల్లి గణేష్ కుమార్ లు పార్టీని వీడారు. నలుగురు వైఎస్ జగన్ ను కలసి కండువా కప్పుకోకపోయినా, ఆ పార్టీకి మద్దతుదారులుగా మారారు. ఈ నలుగురిపై చర్యలు తీసుకోవాలని ఇప్పటి వరకూ చంద్రబాబు స్పీకర్ కు అనర్హత పిటీషన్ ఇవ్వలేదు. వారిని చూసీ చూడనట్లు వదిలేశారు. ఇది పార్టీ క్యాడర్ లో ఇబ్బందిగా ఉంది. వచ్చే ఎన్నికల్లో ఎటూ ఈ నలుగురు టీడీపీ నుంచి పోటీ చేయరు. చీరాల, గన్నవరం, గంటూరు పశ్చిమ, విశాఖ సౌత్ నియోజకవర్గాల నుంచి టీడీపీ TDP తరుపున కొత్త వారిని పోటీకి దింపాల్సిందే. అటువంటి పరిస్థితుల్లో వీరి పట్ల చంద్రబాబు మెతక వైఖరిని ఎందుకు అవలంబిస్తున్నారన్న ప్రశ్న తలెత్తుతోంది. అయితే స్పీకర్ కు అనర్హత పిటీషన్ ఇచ్చినా పెద్దగా ఫలితం ఉండదని చంద్రబాబు యోచిస్తున్నారు. అయినప్పటికీ ఒక పార్టీ అధినేతగా పార్టీ నియమావళిని థిక్కరించిన వారిపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత చంద్రబాబుపై ఉంది. కానీ చంద్రబాబు మాత్రం ఆ పని చేయలేకపోతున్నారు.
బహిష్కరించినా .. చాలని .. TDP
వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు విషయంలో వైసీపీ అనర్హత పిటీషన్ స్పీకర్ కు ఇచ్చిన విషయాన్ని కేడర్ ఈ సందర్భంగా గుర్తు చేస్తోంది. వైసీపీ కూడా ఎంపీ రఘురామకృష్ణంరాజును బహిష్కరించలేదు. కానీ చంద్రబాబు ఈ నలుగురిని పార్టీ నుంచి బహిష్కరిస్తే, వైఎస్.జగన్ ను ఇరకాటంలోకి నెట్టే వీలుందని వీరంతా చెబుతున్నారు. అయితే చంద్రబాబు దానిని కూడా వినిగించుకోలేకపోతున్నారన్న టాక్ పార్టీలోనే విన్పిస్తుంది. అదే ఎందుకన్న చర్చ కేడర్ లో గట్టిగానే సాగుతోంది. ఈ నలుగురు పార్టీకి చేయందించడంతో, ఆ ప్రాంతాల్లో కేడర్ తీవ్ర ఇబ్బందులు పడుతోంది. వీరిపై కనీసం బహిష్కార ముద్ర కూడా వేయలేకపోయారని వైసీపీ నేతలు ప్రచారం చేస్తుండడంతో, కనీసం చంద్రబాబు ఆపనైనా చేయాలని వీరంతా కోరుతున్నారు. అయితే చంద్రబాబు మాత్రం ఈ విషయంపై కనీసంగా కూడా స్పందించకపోవడం చర్చనీయాంశంగా మారింది.
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
Cough And Cold : సీజన్ మారుతున్న టైమ్ లో హఠాత్తుగా జలుబు చేయడం సర్వసాధారణమైన విషయం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ…
This website uses cookies.