kota srinivasa rao comments on tollywood heros
Kota Srinivasa rao : కోట శ్రీనివాస రావు..టాలీవుడ్‌లో ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించిన గొప్ప నటులు. ఆయన చేయని పాత్రలంటూ ఏవీ లేవనే చెప్పాలి. తెలుగు సినిమాలలో ఒక దశ్శాబ్ధం పైగా ఆయన కోసమే మంచి పాత్రలు పుట్టాయి. కోటా ఉన్నన్ని రోజులు మన దర్శక, నిర్మాతలు వేరే భాషా నటుల మీద అంతగా ఆధారపడలేదనే చెప్పాలి. యంగ్ హీరోల నుంచి సీనియర్ స్టార్ హీరోల వరకు దాదాపు అందరితోను నటించారు. సినిమాల మీద అపారమైన ప్రేమ, అభిమానం ఉన్న నటులు. పాత్రల స్వభావాల మీద కూడా గట్టి పట్టున్న నటులు కోట శ్రీనివాస రావు.
kota-srinivasa-rao-sensational-comments-on-tollywood-heros
ఆయన ఎప్పుడు మాట్లాడాల్సి వచ్చిన మనసులో ఉన్న విషయాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పేస్తారు. ఎవరు ఏమనుకున్నా డోంట్ కేర్. నేను చెప్పేది తప్పుకాదు కదా అనేది ఆయన అభిప్రాయం. ఇటీవల కూడా ఓ ఇంటర్వ్యూలో ప్రస్తుతం ఉన్న కొందరు యంగ్ హీరోల మీద సంచలన వ్యాఖ్యలు చేసి హాట్ టాపిక్ అయ్యారు. మన హీరోలు జ్ఞానం పెంచుకోవాలి. విజ్ఞాన్ని కూడా పెంచుకోవాలి. కానీ విజ్ఞానం ఎంత పెరుగుతున్నప్పటికీ జ్ఞానం మాత్రం పెంచుకోవడం లేదు. మైక్ పట్టుకొని మాట్లాడుతున్నవారు.. మన తెలుగు భాషలో మాట్లాడడం లేదు. అంతేకాదు తోటి వారికి గౌరవ మర్యాదలు ఇవ్వడం తగ్గించేశారు.. అని టాలీవుడ్ హీరోల మీద సంచలన వ్యాఖ్యలు చేశారు.
kota srinivasa rao comments on tollywood heros
ఒకప్పుడు నటుడవ్వాలంటే శిక్షణ తప్పకుండా తీసుకునేవారు. లేదా విరివిగా నాటకరంగంలో వివిధ పాత్రలు పోషించి అనుభవం సంపాదించేవారు. అలాంటి వారికి సినిమాలలో వేశాలు రావడం న్యాయం. కానీ ఇప్పుడు వేసుకునే బట్టల్లో మార్పు వచ్చినంత వేగంగా జ్ఞానంలో రావడం లేదు. కసితో ఎవరు నటించడం లేదు. డబ్బుంటే చాలు ప్రతీ ఒక్కడు హీరో అయిపోతున్నారని చెప్పుకొచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ లాంటి వాళ్ళు మాత్రం చాలా బాగా నటిస్తున్నారు అని తెలిపారు. ఇక ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్టార్ డం సంపాదించుకున్న నాని లాంటి హీరోలు స్వయంకృషితో ఎదగడం తప్పకుండా ప్రశంసించాల్సిన విషయం అని చెప్పారు. ఇదే సందర్భంగా ఆయనకి ఎంతో ఇష్టమైన దర్శకులు ఈవీవీ సత్యనారయణ అని వెల్లడించారు.
ఇది కూడా చదవండి ==> కార్తీకదీపంలో డాక్టర్ బాబుకు అలా చాన్స్ వచ్చిందా?.. అసలు విషయం బయటపెట్టిన డైరెక్టర్..!
ఇది కూడా చదవండి ==> కోవై సరళ ఇన్నేళ్లయినా పెళ్లి ఎందుకు చేసుకోలేదో తెలుసా..?
ఇది కూడా చదవండి ==> మీ మొహాలకు అదొకటి తక్కువ.. వర్ష ఇమాన్యుయేల్ పరువుదీసిన జబర్దస్త్ నరేష్
ఇది కూడా చదవండి ==> కత్తి మహేష్ అందుకే చనిపోయాడా.. ఆక్సిజన్, వెంటిలేటర్ తొలగింపుపై అనుమానాలు..!
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్‌ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…
Periods | మన దేశంలో ఇప్పటికీ పీరియడ్స్‌కు సంబంధించిన అనేక అపోహలు ఉన్నాయి. పీరియడ్స్ సమయంలో తల స్నానం చేయరాదు,…
Weight | బరువు తగ్గాలనుకునే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అయితే చాలామంది సరైన మార్గాన్ని ఎంచుకోకపోవడం వల్ల బరువు…
Liver Cancer | మన శరీరంలో అత్యంత కీలకమైన అవయవాల్లో కాలేయం (Liver) ఒకటి. ఇది శరీరాన్ని డిటాక్స్ చేస్తూ,…
Navaratri | నవరాత్రులు అనగానే దేశవ్యాప్తంగా భక్తి, శ్రద్ధతో దుర్గాదేవిని పూజించే మహోత్సవ కాలం. తొమ్మిది రోజులపాటు దుర్గాదేవి తొమ్మిది…
Xiaomi 17 Pro Max vs iPhone 17 Pr o max| టెక్ వరల్డ్‌లో మరో ఆసక్తికర పోటీ…
Bonus | తెలంగాణ సింగరేణి బొగ్గు గనుల కార్మికులకు మరోసారి తీపి వార్త అందింది. ఇటీవలే దసరా పండుగ సందర్భంగా…
This website uses cookies.