దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల తర్వాత సీఎం కేసీఆర్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. త్వరలోనే సీఎం కేసీఆర్ పార్టీలో కొన్ని మార్పులు చేయనున్నారట. టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షడి విషయంలోనూ మార్పులు ఉంటాయని వార్తలు వచ్చాయి. కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేసి.. తాను జాతీయ రాజకీయాల్లోకి వెళ్తారంటూ వార్తలు కూడా వచ్చాయి. కానీ.. వేటిపై సరైన క్లారిటీ లేదు కానీ.. తాజాగా వస్తున్న మరో వార్త ఏంటంటే.. తన మంత్రివర్గాన్ని కేసీఆర్ విస్తరించనున్నారట.
మంత్రివర్గ విస్తరణ అనగానే.. కొందరు టీఆర్ఎస్ నేతలకు వణుకు ప్రారంభమైంది. ఎందుకంటే.. తమ పదవి ఉంటుందా? ఊడుతుందా? అనే భయం. 2023 ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ.. సీఎం కేసీఆర్ పార్టీలో పలు మార్పులు చేస్తున్నారు. 2018 లో అధికారంలోకి వచ్చాక.. మంత్రివర్గంలోకి కొందరిని మాత్రమే తీసుకున్నారు కేసీఆర్. అందుకే మంత్రివర్గ విస్తరణ చేసి.. కేబినేట్ లో మార్పులు చేర్పులు చేయాలని కేసీఆర్ భావిస్తున్నారట.
ఇప్పుడు మంత్రివర్గంలో ఉన్న కొందరిని తప్పించి.. వేరే వాళ్లకు అవకాశం ఇవ్వాలని సీఎం కేసీఆర్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారట. ఈసారి సామాజిక వర్గాలు, పార్టీలో సీనియార్టీ.. అన్నీ చూసి మంత్రి పదవి ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. దానికోసం ఇప్పటికే కేసీఆర్ కసరత్తులు కూడా ప్రారంభించారట.
అయితే.. ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో ఎవరికి పదవి గండం ఉందో మాత్రం తెలియడం లేదు. ఎవరి పదవి ఊస్ట్ అవుతుందో అని మంత్రులంతా కొంచెం టెన్షన్ తోనే ఉన్నారట. మంత్రివర్గ విస్తరణలో తన కూతురు కవితకు మంత్రి పదవి ఇవ్వాలని కేసీఆర్ ఆశపడుతున్నారు. అందుకే కవితను ఎమ్మెల్సీను కూడా చేశారు. అయితే.. కవితకు మంత్రి పదవి ఇస్తే.. ప్రతిపక్షాల నుంచి వ్యతిరేకత ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని కూడా కేసీఆర్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.
మొత్తం మీద త్వరలోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని.. కాకపోతే నాగార్జునసాగర్ ఉపఎన్నిక తర్వాత ఉంటుందా? లేక.. ముందే ఉంటుందా? అనేది మాత్రం ప్రస్తుతానిక సస్పెన్స్ గా మారింది.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.