Nara Lokesh : తెలుగు దేశం పార్టీ నాయకులు కొన్ని సార్లు లోకేష్ పై ప్రశంసలు చేసే క్రమంలో ఆయన్ను ఇండైరెక్ట్ గా తిట్టడం లేదా ఎద్దేవ చేయడం చేస్తున్నారు. పాపం తెలుగు దేశం నాయకులకు ఆ విషయం అర్థం అవుతుందో లేదో అంటూ మీడియా వారికి కూడా అర్థం కావడం లేదు. లోకేష్ పై మరీ అతిగా ప్రశంసలు కురిపించి ఆయన దృష్టిలో పడాలని కొందరు చేసే ప్రయత్నం నవ్వు తెప్పిస్తూ ఉంటే.. మరి కొందరు మాత్రం ఇదెక్కడి విడ్డూరం అన్నట్లుగా ముక్కున వేలేసుకుంటున్నారు. పెద్ద ఎత్తున నారా లోకేష్ గురించి టీడీపీ నాయకులు తాజాగా చేస్తున్న లైగర్ వ్యాఖ్యల గురించి చర్చ జరుగుతోంది.
నారా లోకేష్ ను కొందరు తెలుగు తమ్ముళ్లు లైగర్ అంటూ పిలుచుకుంటున్నారు. సాదారణంగా లైగర్ అంటే టైగర్ మరియు లయన్ ల క్రాస్ బ్రీడ్ ను లైగర్ అంటారు. ఆ విషయం తెలుగు తమ్ముళ్లకు తెలుసో తెలియదో కాని లోకేష్ ను లైగర్ అనేస్తున్నారు. విజయ్ దేవరకొండ హీరోగా లైగర్ సినిమాలో నటిస్తున్నాడు. హీరో నే లైగర్ అంటున్నారు.. కనుక మా వాడు కూడా లైగర్ అంటూ తెలుగు తమ్ముళ్లు ప్రచారం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కొందరు మాత్రం సోషల్ మీడియాలో ఈ విషయమై క్లారిటీ ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తెలుగు తమ్ముళ్లు అవివేకం మరియు అజ్ఞానంతో లోకేష్ ను లైగర్ అంటూ సంభోదిస్తున్నారు.
సినిమా లో విజయ్ దేవరకొండ ను ఎందుకు లైగర్ అనేదానికి ఒక కారణం ఉంది. అసలు హీరో తనను తాను టైగర్ అని చెప్పుకుంటూ ఉంటాడు. కాని సినిమా లో హీరో విజయ్ దేవరకొండకు నత్తి వల్ల ‘ట’ అక్షరం ల మాదిరిగా వస్తుంది. అందుకే టైగర్ కాస్త లైగర్ అయ్యింది. మరి లోకేష్ విషయంలో లైగర్ అంటూ ఎందుకు అంటున్నారు అనే విషయాన్ని తెలుగు తమ్ముళ్లు చెప్పాల్సిన అవసరం ఉంది అంటూ ఈ సందర్బంగా లోకేష్ భజన చేస్తున్న తెలుగు తమ్ముళ్లను మీడియా వారు మరియు వైకాపా నాయకులు ప్రశ్నిస్తున్నారు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.