Categories: News

Telugu TANA Sahitya Vedika : తానా ప్రపంచసాహిత్యవేదిక ఆధ్వర్యంలో సినీగీతాల ధ్రువతారలకు అక్షరాంజలి..!

Advertisement
Advertisement

Telugu TANA Sahitya Vedika  : డాలస్, టెక్సస్: తానా ప్రపంచసాహిత్యవేదిక ఆధ్వర్యంలో – ప్రతి నెలా ఆఖరి ఆదివారం నిర్వహిస్తున్న “నెల నెలా తెలుగు వెలుగు” సాహిత్య కార్యక్రమం – 70వ అంతర్జాతీయ అంతర్జాల దృశ్యసమావేశం శనివారం, ఆదివారం రెండురోజుల ప్రత్యేక కార్యక్రమంగా ఘనంగా జరిగింది.“సినీగీతాల ధ్రువతారలకు అక్షరాంజలి” అనే పేరున నిర్వహించిన కార్యక్రమంలో లబ్ధప్రతిష్టులైనపాతికమందికి పైగా సినీగీత రచయితలు సృష్టించిన సాహిత్యంపై చాలామంది ప్రముఖులు హాజరై విశ్లేషణ చేశారు. తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ- “ప్రపంచంలోనే మొట్టమొదటి ఆంగ్లశబ్దచిత్రం “ద జాజ్ సింగర్” అని, మొదటి భారతీయ హిందీ శబ్దచిత్రం “ఆలం ఆరా” అని, మొట్టమొదటి తెలుగు శబ్దచిత్రం “భక్త ప్రహ్లాద” అని పేర్కొంటూ ఆయా చిత్రాల విశేషాలు, వాటిలోని పాటల వివరాలను పంచుకున్నారు.

Advertisement

డా. తోటకూర ముఖ్యఅతిథిగా పాల్గొన్న వి.ఏ.కె రంగారావు గార్ని సభకు పరిచయం చేస్తూ … వివిధ తెలుగు, ఆంగ్ల పత్రికలలో సినిమాలపై ఎన్నో వ్యాసాలు రాసిన రచయిత, ప్రపంచంలోనే అత్యధిక
సంఖ్యలో 52 వేలకు పైగా ‘78 ఆర్ పి మ్’ రికార్డ్లు సేకరించిన వారు, ప్రపంచంలోని వివిధ భాషల్లో లక్షా పాతిక వేల వరకు ట్రాక్స్ కల్గిఉన్న వ్యక్తి, సినీ సంగీత, సాహిత్యాలపై విశేషమైన ప్రతిభ, లోతైన
అవగాహన కల్గిన విశ్లేషకుడు, రచయిత, కాలమిస్ట్, నాట్యకారుడు, రికార్డ్ కలక్టర్, జంతు ప్రేమికుడు, ఒక విజ్ఞాన భాండాగారం వి.ఏ.కె అంటూ అభివర్ణించారు. ముఖ్యఅతిథిగా ప్రముఖ రచయిత, సుప్రసిద్ధ సినీ సంగీత, సాహిత్య విశ్లేషకులు శ్రీ వేంకట ఆనంద కుమార కృష్ణ (వి.ఏ.కె) రంగారావు, చెన్నై నుండి హాజరై సినిమా పాటలు ముఖ్యంగా పాత పాటలు ఇప్పటికీ సజీవంగా ఉంటూ మనం ఎప్పుడు విన్నా మన మనసుకు ఆహ్లాదం కల్గిస్తున్నాయి అంటే అది కేవలం అంత గొప్ప సాహిత్యం సృష్టించిన గీతరచయితల గొప్పదనమే అన్నారు. తన మనసుకు బాగా నచ్చిన చిత్రాలు, పాటలపై సోదాహరణ ప్రసంగం చేసి అందరిని ఆకట్టుకున్నారు.  శనివారం విశిష్టఅతిథులుగా పాల్గొన్న – రోచిష్మాన్ (చెన్నై) – “తెలుగు సినిమా పాట విశేషం”పై ప్రసంగించగా; డా. శ్రీదేవి శ్రీకాంత్ (బోట్స్వానా, ఆఫ్రికా) – తొలి సినీగీత రచయిత చందాల కేశవదాసు; ఆవాల శారద (విజయవాడ) – పద్మభూషణ్ దేవులపల్లి కృష్ణశాస్త్రి; జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు (హైదరాబాద్) – దైతా గోపాలం; డా. వి. వి. రామారావు (హైదరాబాద్) – పింగళి నాగేంద్రరావు; పి.వి శేషారత్నం (విశాఖపట్నం) – వెంపటి సదాశివ బ్రహ్మం; డా. వోలేటి పా ర్వతీశం (హైదరాబాద్) – మల్లాది రామకృష్ణశాస్త్రి; మద్దుకూరి విజయ చంద్రహాస్ (డాలస్) – కొసరాజు  రాఘవయ్య చౌదరి

Advertisement

Telugu TANA Sahitya Vedika : తానా ప్రపంచసాహిత్యవేదిక ఆధ్వర్యంలో సినీగీతాల ధ్రువతారలకు అక్షరాంజలి

లెనిన్ బాబు వేముల (డాలస్) – శ్రీరంగం శ్రీనివాసరావు (శ్రీ శ్రీ); డా. ఇండ్ల రామసుబ్బారెడ్డి (విజయవాడ) – ఆచార్య ఆత్రేయ; డా. రెంటాల జయదేవ (హైదరాబాద్) – సముద్రాల (జూనియర్) రామానుజాచార్య; చెన్నూరి సీతారాంబాబు (హైదరాబాద్) – మైలవరపు గోపీకృష్ణ లు  సృష్టించిన సాహిత్యంపై విశ్లేషణాత్మక ప్రసంగాలు చేశారు. ఆదివారం విశిష్టఅతిథులుగా పాల్గొన్న ఎస్. వి రామారావు (హైదరాబాద్) – సముద్రాల (సీనియర్) వేంకట రాఘవాచార్యులు; మహాకవి దాశరథి గారి తనయుడు దాశరథి లక్ష్మణ్ (హైదరాబాద్) – దాశరథి కృష్ణమాచార్య; శారద ఆకునూరి (హ్యుస్టన్) – ఆరుద్ర; గజగౌరి (చెన్నై) – వీటూరి; రాజశ్రీగారి తనయుడు, రాజశ్రీ సుధాకర్ (చెన్నై) – రాజశ్రీ; ఎస్.పి వసంత (చెన్నై) – అనిసెట్టి సుబ్బారావు; తుర్లపాటి నాగభూషణ రావు (హైదరాబాద్) – ఆచార్య డా. సింగిరెడ్డి నారాయణరెడ్డి; జాలాదిగారి కుమార్తె, డా. జాలాది విజయ (విశాఖపట్నం) – డా. జాలాది రాజారావు; వేటూరి గారి తనయులు, వేటూరి రవిప్రకాష్ (హైదరాబాద్) – వేటూరి సుందర రామమూర్తి; కలగా కృష్ణమోహన్  (హైదరాబాద్) – ఇంద్రగంటి శ్రీకాంత శర్మ; వేదవ్యాస రంగభట్టర్ గారి సహోదరులు జె.కె భారవి (హైదరాబాద్) – వేదవ్యాస రంగభట్టర్; సిరివెన్నెల గారి సోదరులు చేంబోలు వెంకట్రామశాస్త్రి
(విశాఖపట్నం) – పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి; వెన్నెలకంటి గారి తనయుడు, శశాంక్ వెన్నెలకంటి (హైదరాబాద్) – వెన్నెలకంటి గార్ల సినీ సాహిత్యంపై ఎంతో లోతైన, ఆసక్తిదాయకమైన
చేసిన విశ్లేషణ అందరినీ అలరించింది. శనివారం, జూలై 27న జరిగిన పూర్తి కార్యక్రమాన్ని ఈ క్రింది లంకె ద్వారా వీక్షించవచ్చును.

ఆదివారం, జూలై 28న జరిగిన పూర్తి కార్యక్రమాన్ని ఈ క్రింది లంకె ద్వారా వీక్షించవచ్చును.

తానా ప్రపంచసాహిత్యవేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ సభలో పాల్గొన్న అందరికీ,  విజయవంతంగావడానికి సహకరించిన కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ సినీ సాహితీ చరిత్రలో
ఈ సాహిత్యసభ ఒక చరిత్ర అన్నారు.

Recent Posts

Mana Shankara Vara Prasad Garu Movie : బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తున్న ‘మన వరప్రసాద్ ‘.. అది మెగా రేంజ్ అంటే..!

Mana Shankara Vara Prasad Garu Movie : మెగాస్టార్ చిరంజీవి బాక్సాఫీస్ వద్ద తన అసలు సిసలు వేటను…

26 minutes ago

Bhartha Mahasayulaki Wignyapthi Movie : సంక్రాంతి టైములో ఎంత దారుణమైన కలెక్షన్ల ..? ఏంటి రవితేజ ఇది ?

Bhartha Mahasayulaki Wignyapthi Movie : మాస్ మహారాజ్ రవితేజ నటించిన తాజా చిత్రం “ భర్త మహాశయులకు విజ్ఞప్తి…

53 minutes ago

Ys Jagan Jr Ntr : 2029 ఎన్నికల్లో జగన్-ఎన్టీఆర్ లను కలిపేది అతడేనా..?

Ys Jagan Jr Ntr : ఏపీ రాజకీయాల్లో 2029 ఎన్నికల వ్యూహాలకు సంబంధించి అప్పుడే వార్తలు ఊపందుకున్నాయి. ముఖ్యంగా…

7 hours ago

Indian Army Jobs : భారత సైన్యంలో పెద్ద ఎత్తున జాబ్స్..అప్లై చేసుకోవడమే ఆలస్యం !!

Indian Army Jobs  :  భారత సైన్యంలో పౌర సిబ్బందిగా సేవలందించాలనుకునే నిరుద్యోగులకు 2026 నియామక ప్రక్రియ ఒక గొప్ప…

8 hours ago

Today Gold Rate 16 January 2026 : పండగ రోజు కూడా సామాన్యులకు షాక్ ఇచ్చిన బంగారం ధర

Today Gold Rate 16 January 2026 : బంగారం & వెండి ధరలు భారీగా పెరుగుతూ సామాన్య ప్రజలకు…

8 hours ago

Chiranjeevi : జనసేన నుండి రాజ్యసభ కు చిరంజీవి..? ఇది నిజమవుతుందా ?

Chiranjeevi  : ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి పేరు మళ్ళీ మారుమోగుతోంది. తమ్ముడు పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని జనసేన…

9 hours ago

Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్లపై కీలక అప్‌డేట్ ఇచ్చిన ప్రభుత్వం

తెలంగాణలో నిరుపేదల సొంతింటి కలను సాకారం చేసే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన 'ఇందిరమ్మ ఇళ్ల పథకం' శరవేగంగా దూసుకుపోతోంది.…

10 hours ago

Elinati Remedies Pisces : మీన రాశి వారికి ఏలినాటి శని రెండో దశ ప్రారంభం.. జాగ్రత్తగా ఉండాలని పండితుల హెచ్చరిక

Elinati Remedies Pisces : శని గ్రహం జ్యోతిష్యశాస్త్రంలో అత్యంత శక్తివంతమైన గ్రహాల్లో ఒకటి. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి…

11 hours ago