Jio to BSNL : దేశంలోని టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దాదాపు 7 ఏళ్ల తర్వాత అంబానీని ఎదిరించే విధంగా బీఎస్ఎన్ఎల్ తయారవుతుంది. ఇప్పుడు బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలు ప్రారంభించడంతో దేశంలోని ప్రముఖ ప్రైవేటు టెలికాం ఆపరేటర్లు అయిన రిలయన్స్ జియో, భారతీ ఎయిర్ టెల్ వంటి సంస్థల పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా మారింది. ఇటీవల రేట్లు కూడా పెరగగా, చాలా మంది వినియోగదారులు బీఎస్ఎన్ఎల్ వైపు అడుగులు వేశారు. ఈ పరిస్థితిని అర్ధం చేసుకున్న జియో టారిఫ్ రేట్లని మళ్లీ తగ్గించింది. అయితే ప్రస్తుత టెలికాం రంగంలో జియో, బీఎస్ఎన్ఎల్ మధ్య గట్టిపోటీ నడుస్తుంది.
ఇప్పుడు జియో, బీఎస్ఎన్ఎల్‌లలో నెలవారీ లేదా 28 రోజుల వ్యాలిడిటీతో ప్లాన్ వస్తుండగా, అందులో జియో నుంచి రూ. 348, బీఎస్ఎన్ఎల్ నుంచి రూ. 108, రూ. 107 ప్లాన్లు ఉన్నాయి.రిలయన్స్ జియో రూ. 349 ప్రీ పెయిడ్ ప్లాన్ చూస్తే ఆ ప్లాన్‌లో 28 రోజుల వ్యాలిడిటీ వస్తుంది. ప్రతి రోజూ 2 జీబీ 5జీ డేటా, అపరిమిత వాయిస్ కాల్‌లను అందిస్తుంది. ఇక ఈ ప్లాన్ తీసుకోవడం ద్వారా జియో సినిమా యాప్ నకు ఉచిత సబ్ స్క్రిప్షన్ కూడా మనం పొందవచ్చు. ఇక వీటితో పాటు యాడ్ ఆన్ ప్లాన్ లని కూడా అందిస్తుంది. ఇవి అన్ లిమిటెడ్ ప్లాన్లు. రూ. 151, రూ. 101, రూ. 51 ట్యారిఫ్ తో ఈ ప్లాన్లు ఉన్నాయి. రూ. 151 రీచార్జ్ తో 9జీబీ, రూ. 101 రీచార్జ్ తో 6జీబీ, రూ. 51 రీచార్జ్ తో 3జీబీ 4జీ డేటా లభిస్తుంది.
బీఎస్ఎన్ఎల్ నుంచి చూస్తే.. మొదటి సారి రీచార్జ్ చేస్తున్న వినియోగదారులు రూ. 108 ప్లాన్ (మొదటి రీఛార్జ్ కూపన్)పొందవచ్చు. వీరికి 28 రోజుల వ్యాలిడిటీతో అపరిమిత వాయిస్ కాల్స్, ప్రతి రోజూ 1జీబీ 4జీ డేటా లభిస్తుంది.ఇదే ప్లాన్ రిపీట్ చేస్తే.. ఈ ప్లాన్ 35 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది. దీనిలో 200 నిమిషాల వాయిస్ కాల్స్, 3 జీబీ 4జీ డేటా లభిస్తుంది.బీఎస్‌ఎన్‌ఎల్ రూ. 797 ప్లాన్. ఈ రీఛార్జీ ప్లాన్ ద్వారా ఎక్కువ లాభాలు పొందవచ్చు. ముఖ్యంగా ఈ ప్యాక్ తో రీఛార్జీ చేసుకుంటే 300 రోజులపాటు వ్యాలిడిటీ వస్తుంది. తరచూ రీఛార్జీలు చేసుకునే వినియోగదారులకు ఇది అద్భుతమైన అవకాశం. ఎందుకంటే ఇది వినియోగదారులకు ఏడాదిపాటు నిరంతరాయ లాభాలను గడిస్తుంది.
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
This website uses cookies.