#image_title
Plants | ఇంటి ముందు అందాన్ని పెంచేందుకు చాలామంది రకరకాల మొక్కలను నాటుతుంటారు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని మొక్కలు ఇంటికి సానుకూల శక్తిని తీసుకువస్తే, మరికొన్ని మొక్కలు నెగటివ్ ఎనర్జీకి దారి తీస్తాయని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా ఇంటి ప్రధాన ద్వారం వద్ద కొన్ని మొక్కలు ఉంటే ఇంట్లో సమస్యలు పెరిగే ప్రమాదం ఉంటుందంట.
#image_title
ఇప్పుడు వాస్తు నిపుణుల సూచనల ప్రకారం, ఇంటి ముందు పెట్టకూడని కొన్ని ముఖ్యమైన మొక్కల గురించి చూద్దాం:
1. రావి చెట్టు
ఇంటి ముందర రావి చెట్టును ఉంచడం వాస్తు ప్రకారం శుభం కాదని నిపుణులు చెబుతున్నారు. ఇది ఇంటిలో పురోగతికి అడ్డుగా నిలుస్తుందని విశ్వాసం. ముఖ్యంగా ఇంటి ప్రధాన ద్వారం వద్ద రావి చెట్టు ఉండకూడదని చెబుతున్నారు.
2. ముళ్ల మొక్కలు
చెట్లను అలంకారంగా పెట్టడమే కాదు, నెగటివ్ శక్తి కూడా పెరగకుండా చూసుకోవాలి. ముళ్లతో కూడిన మొక్కలు (కాక్టస్, రోజా వంటి వాటి ముళ్లు సహా) ఇంటి ముందే కాకుండా ప్రధాన ద్వారం వద్ద పెంచడం వల్ల ఇంట్లో కలహాలు, చికాకులు పెరుగుతాయని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు.
3. బోన్సాయ్ మొక్కలు
బోన్సాయ్ మొక్కలు చూడటానికి ఆకర్షణీయంగా కనిపించినా, ఇవి వాస్తు ప్రకారం మంచివి కావని అంటున్నారు. ముఖ్యంగా ఇంటి ముందు లేదా ప్రధాన ద్వారం వద్ద ఈ మొక్కలను ఉంచితే, ఉద్యోగ సంబంధమైన ఇబ్బందులు, ఆర్థిక నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉందని నమ్మకం.
4. ఎండిపోయిన మొక్కలు / తులసి
ఎండిపోయిన మొక్కలు, తులసి మొక్క సహా ఇతర మొక్కలు చనిపోయినట్టయితే వాటిని వెంటనే తొలగించాలని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. ఇవి ఇంటిలోకి నెగిటివ్ ఎనర్జీని తీసుకొస్తాయని చెబుతున్నారు.
5. చింతచెట్టు, పత్తి చెట్టు, జిల్లేడు
ఈ మొక్కలు కూడా ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఉంచడం శుభప్రదం కాదని అంటున్నారు. పత్తి చెట్టు కారణంగా అనవసరమైన ఖర్చులు, మరణదుఃఖాలు కూడా ఎదురయ్యే అవకాశం ఉందని కొందరు నమ్మకం. చింతచెట్టు, జిల్లేడు చెట్టు వంటివి ఇంటికి శుభ సూచకాలు కావని పేర్కొంటున్నారు.
Health Tips | వేగంగా బరువు తగ్గాలనుకునే వారు రోజులో ఎన్నో మార్గాలను ప్రయత్నిస్తుంటారు. వాటిలో టీ (చాయ్) ద్వారా బరువు…
Diwali | హర్షాతిరేకాలతో, వెలుగుల మధ్య జరుపుకునే హిందూ ధర్మంలోని మహా పర్వదినం దీపావళి మళ్లీ ముంచుకొస్తోంది. పిల్లలు, పెద్దలు అనే…
Whats App | ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) వినియోగదారులకు శుభవార్త చెప్పింది. భాషల మధ్య బేధాన్ని తొలగించేందుకు…
Special Song | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన చిత్రం ‘OG (They Call Him…
Revanth Reddy | తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోంది. హైకోర్టు తాజా తీర్పు…
Pawan Kalyan | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ‘ఓజీ (They Call Him OG)’…
Akhanda 2 | గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటిస్తున్న భారీ చిత్రం ‘అఖండ 2’ ప్రస్తుతం షూటింగ్…
Airport | శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం ఉదయం ఒక ఇండిగో విమానానికి Indigo పెను ప్రమాదం తప్పింది.…
This website uses cookies.