Plants | ఇంటి ముందు ఈ మొక్కలు పెంచొద్దు..వాస్తు ప్రకారం మీ ఇంటికి నష్టం తెచ్చే మొక్కలు ఇవే! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Plants | ఇంటి ముందు ఈ మొక్కలు పెంచొద్దు..వాస్తు ప్రకారం మీ ఇంటికి నష్టం తెచ్చే మొక్కలు ఇవే!

 Authored By sandeep | The Telugu News | Updated on :13 September 2025,6:00 am

Plants | ఇంటి ముందు అందాన్ని పెంచేందుకు చాలామంది రకరకాల మొక్కలను నాటుతుంటారు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని మొక్కలు ఇంటికి సానుకూల శక్తిని తీసుకువస్తే, మరికొన్ని మొక్కలు నెగటివ్ ఎనర్జీకి దారి తీస్తాయని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా ఇంటి ప్రధాన ద్వారం వద్ద కొన్ని మొక్కలు ఉంటే ఇంట్లో సమస్యలు పెరిగే ప్రమాదం ఉంటుందంట.

#image_title

ఇప్పుడు వాస్తు నిపుణుల సూచనల ప్రకారం, ఇంటి ముందు పెట్టకూడని కొన్ని ముఖ్యమైన మొక్కల గురించి చూద్దాం:

1. రావి చెట్టు

ఇంటి ముందర రావి చెట్టును ఉంచడం వాస్తు ప్రకారం శుభం కాదని నిపుణులు చెబుతున్నారు. ఇది ఇంటిలో పురోగతికి అడ్డుగా నిలుస్తుందని విశ్వాసం. ముఖ్యంగా ఇంటి ప్రధాన ద్వారం వద్ద రావి చెట్టు ఉండకూడదని చెబుతున్నారు.

2. ముళ్ల మొక్కలు

చెట్లను అలంకారంగా పెట్టడమే కాదు, నెగటివ్ శక్తి కూడా పెరగకుండా చూసుకోవాలి. ముళ్లతో కూడిన మొక్కలు (కాక్టస్, రోజా వంటి వాటి ముళ్లు సహా) ఇంటి ముందే కాకుండా ప్రధాన ద్వారం వద్ద పెంచడం వల్ల ఇంట్లో కలహాలు, చికాకులు పెరుగుతాయని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు.

3. బోన్సాయ్ మొక్కలు

బోన్సాయ్ మొక్కలు చూడటానికి ఆకర్షణీయంగా కనిపించినా, ఇవి వాస్తు ప్రకారం మంచివి కావని అంటున్నారు. ముఖ్యంగా ఇంటి ముందు లేదా ప్రధాన ద్వారం వద్ద ఈ మొక్కలను ఉంచితే, ఉద్యోగ సంబంధమైన ఇబ్బందులు, ఆర్థిక నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉందని నమ్మకం.

4. ఎండిపోయిన మొక్కలు / తులసి

ఎండిపోయిన మొక్కలు, తులసి మొక్క సహా ఇతర మొక్కలు చనిపోయినట్టయితే వాటిని వెంటనే తొలగించాలని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. ఇవి ఇంటిలోకి నెగిటివ్ ఎనర్జీని తీసుకొస్తాయని చెబుతున్నారు.

5. చింతచెట్టు, పత్తి చెట్టు, జిల్లేడు

ఈ మొక్కలు కూడా ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఉంచడం శుభప్రదం కాదని అంటున్నారు. పత్తి చెట్టు కారణంగా అనవసరమైన ఖర్చులు, మరణదుఃఖాలు కూడా ఎదురయ్యే అవకాశం ఉందని కొందరు నమ్మకం. చింతచెట్టు, జిల్లేడు చెట్టు వంటివి ఇంటికి శుభ సూచకాలు కావని పేర్కొంటున్నారు.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది