Home » Health » These Three Fruits That Help Manage High Uric Acid
Health

Uric Acid Diet | ఫాస్ట్ ఫుడ్ మోజు, యూరిక్ యాసిడ్ పెరుగుదల ..ఈ మూడు పండ్లు తింటే మ్యాజిక్‌లా తగ్గుతుంది

Authored By
Sam C
The Telugu News | Published on: November 5, 2025, 8:00 am
Advertisement

Uric Acid Diet | నేటి బిజీ జీవితంలో ఫాస్ట్ ఫుడ్ లేకుండా చాలామందికి రోజు నిండదు. ఆఫీసు భోజనం, రోడ్డు పక్కన స్ట్రీట్ ఫుడ్, స్నేహితులతో కేఫ్‌లలో స్నాక్స్ – ఇలా వేడివేడిగా తినే పరాఠాలు, సమోసాలు రుచి పెంచినా… ఆరోగ్యాన్ని మాత్రం నాశనం చేస్తున్నాయి. వైద్యుల ప్రకారం ఈ అలవాటు వల్ల శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయి పెరగడం సాధారణమైపోయింది.

Advertisement

#image_title

యూరిక్ యాసిడ్ పెరిగితే ఏమవుతుంది?

Advertisement

ప్రారంభంలోనే ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం పెరుగుతుంది. యూరిక్ యాసిడ్ పెరిగినప్పుడు పాదాల అరికాళ్లలో, మోకాళ్లలో, మోచేతులలో నొప్పి మొదలవుతుంది.

ఎక్కువసేపు కూర్చుంటే పాదాలు ఉబ్బిపోతాయి.

Advertisement

దీర్ఘకాలంలో ఆర్థరైటిస్‌కు దారి తీస్తుంది.

గుండె, మూత్రపిండాల పనితీరుపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది.

ఏమి తినకూడదు?

యూరిక్ యాసిడ్ లక్షణాలు కనిపించిన వెంటనే ఆహారంలో జాగ్రత్త అవసరం. వైద్యుల సూచనల ప్రకారం —
పాలకూర, టమోటాలు
పప్పులు, మాంసం, చేప నూనె
కాఫీ, కేకులు వంటి ఆహారాలను నివారించాలి.

Advertisement

అయితే ఈ మూడు పండ్లు తప్పక తినాలి!

ప్రకృతిలోనే యూరిక్ యాసిడ్‌ను తగ్గించే కొన్ని సహజమైన పండ్లు ఉన్నాయి. వీటిని క్రమం తప్పకుండా తింటే ఫలితం స్పష్టంగా కనిపిస్తుంది.

1. చెర్రీస్

చెర్రీస్‌లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని వాపు, నొప్పులను తగ్గిస్తాయి. ముఖ్యంగా యూరిక్ యాసిడ్‌ను సహజంగా తగ్గించి సంధుల నొప్పులను ఉపశమనం కలిగిస్తాయి.

Advertisement

2. నిమ్మకాయ

విటమిన్ C యూరిక్ యాసిడ్‌కు పెద్ద శత్రువు. శరీరంలో విటమిన్ C స్థాయి పెరిగితే యూరిక్ యాసిడ్ స్థాయి మ్యాజిక్‌లా తగ్గిపోతుంది. కాబట్టి రోజూ నిమ్మరసం, నారింజ వంటి సిట్రస్ పండ్లు తీసుకోవడం మంచిది.

3. యాపిల్

యాపిల్స్‌లో విటమిన్ A సమృద్ధిగా ఉంటుంది. ఇది యూరిక్ యాసిడ్‌ను నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. రోజూ ఒక ఆపిల్ తినడం ద్వారా రక్తంలోని యూరిక్ యాసిడ్ స్థాయి సహజంగా తగ్గిపోతుంది.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి