Home » Entertainment » Upasana Gives Good News
Entertainment

Upasana | మెగా అభిమానుల‌కి ఉపాస‌న గుడ్ న్యూస్.. త్వ‌ర‌లో రెండో బేబి రాబోతుందంటూ కామెంట్

Authored By
Sam C
The Telugu News | Published on: September 14, 2025, 4:00 pm
Advertisement

Upasana | టాలీవుడ్‌లోని క్రేజీ జంట‌ల‌లో రామ్ చ‌ర‌ణ్‌-ఉపాస‌న జంట ఒక‌టి. 2012లో ఉపాసన కామినేనితో రామ్ చరణ్ కి వివాహం జరిగింది. ఏళ్ళు గడిచినా వీరు ఫ్యామిలీ ప్లానింగ్ చేయలేదు. ఎట్టకేలకు 2023లో ఉపాసన -చరణ్ తల్లిదండ్రులు అయ్యారు. ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. పేరు క్లిన్ కార. అయితే మెగా ఫ్యాన్స్ కి ఒక అసంతృప్తి ఉంది. రామ్ చరణ్ కి ఒక నటవారసుడు కావాలి. కాబట్టి అబ్బాయి కూడా ఉంటే బాగుండు అని భావిస్తున్నారు.

Advertisement

 

డ‌బుల్ న్యూస్..

Advertisement

వారి కోరిక తీరే అవకాశం త్వరలోనే ఉందని ఉపాసన గుడ్ న్యూస్ చెప్పింది. సెకండ్ చైల్డ్ ని వెంటనే ప్లాన్ చేస్తున్నట్లు ఆమె వెల్లడించారు. తాజా ఇంటర్వ్యూలో ఉపాసన మాట్లాడుతూ… నేను ఆలస్యంగా పిల్లలను కనాలి అనుకున్నాను. అందుకే పదేళ్ల తర్వాత తల్లిని అయ్యాను. ఈ విషయంలో విమర్శలు, ఒత్తిడి ఎదురైనా నేను పట్టించుకోలేదు. కానీ రెండో బిడ్డ విషయంలో అలా కాదు. సెకండ్ చైల్డ్ ని కనడానికి నేను సిద్ధంగా ఉన్నాను… అని వెల్లడించారు.

కుటుంబ పరంగానే కాకుండా, వ్యాపార రంగంలోనూ రామ్ చరణ్, ఉపాసన దంపతులు తమదైన ముద్ర వేసుకుంటున్నారు హైదరాబాద్ నగరంలో ఓ అత్యాధునిక లగ్జరీ మల్టీప్లెక్స్‌ను నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ మల్టీప్లెక్స్ నిర్వహణ బాధ్యతలను ఉపాసన చేపట్టనున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ కొత్త వ్యాపారానికి మెగాస్టార్ చిరంజీవి కూడా సంపూర్ణ మద్దతు తెలిపినట్లు తెలుస్తోంది.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి