ఉప్పెన.. మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ – కృతిశెట్టి నటించిన డెబ్యూ సినిమా. సుకుమార్ అసోసియేట్ బుచ్చిబాబు సానా ఈ సినిమాతో దర్శకుడిగా టాలీవుడ్ కి పరిచయం అవుతున్నాడు. సుకుమార్ రైటింగ్స్ – మైత్రీ మూవీ మేకర్స్ కలిసి నిర్మించిన ఈ సినిమాతో టాలీవుడ్ కి హీరోగా గ్రాండ్ గా ఎంట్రీ ఇస్తున్న వైష్ణవ్ తేజ్ తో పాటు మెగా ఫ్యామిలీ మొత్తం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇక మెగా ఫ్యాన్స్ అయితే ఎప్పుడెప్పుడు ఈ సినిమాని థియేటర్స్ లో చూస్తామా అని ఉత్సాహంగా ఉన్నారు. కాగా ఉప్పెన అన్నీ కార్యక్రమాలని కంప్లీట్ చేసుకొని రిలీజ్ కి రెడీగా ఉంది.
ఈ సినిమాకి రాక్ స్టార్ దేవీశ్రీప్రసాద్ సంగీతం అందిచిన సాంగ్స్ ఇప్పటికే ట్రెండింగ్ లో రికార్డ్స్ సాధిస్తున్నాయి. వాస్తవంగా వారం రోజుల్లో భారీ ఎత్తున ఉప్పెన సినిమాని థియేటర్స్ లోకి తీసుకురావాలని మేకర్స్ రెడీ అవుతుండగా థియేటర్స్ మూత పడ్డాయి. అప్పటి నుంచి ఈ సినిమా రిలీజ్ కాలేదు. మధ్యలో చాలా సార్లు ఓటీటీలో రిలీజ్ చేయబోతున్నట్టు వార్తలు వచ్చాయి. కాని మేకర్స్ మాత్రం మెగా ఫ్యామిలీ హీరో డెబ్యూ సినిమా కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోను ఈ సినిమాని థియేటర్స్ లోనే రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారు.
” ఈ ఒక్కరాత్రి 80 సంవత్సరాలు గుర్తుండిపోయేలా బతికేద్దాం వాసు” అన్న డైలాగ్స్ సినిమా ఎలా ఉంటుందో చెప్పేసింది…!
ఈ క్రమంలో తాజా సమచారం ప్రకారం ఈ సినిమా ఫిబ్రవరి 5 న రిలీజ్ చేసేందుకు డేట్ ఫిక్స్ చేశారట మేకర్స్. ఈ విషయన్ని త్వరలో టీజర్ రిలీజ్ చేసినప్పుడు అఫీషియల్ గా ప్రకటించబోతున్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. కాగా తాజాగా ఈ సంక్రాంతి పండుగని పురస్కరించుకుని ఈ సినిమానుంచి టీజర్ ని రిలీజ్ చేశారు చిత్ర బృందం. ఈ టీజర్ తోనే మెగా మేనల్లుడు అదరగొట్టాడని మెగా ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు అభిమానులు. ముఖ్యంగా ఈ టీజర్ లో ” వీడు ముసలోడ్ అవ్వకూడదు “… ” ఈ ఒక్కరాత్రి 80 సంవత్సరాలు గుర్తుండిపోయేలా బతికేద్దాం వాసు ” అన్న డైలాగ్స్ సినిమా ఎలా ఉంటుందో చెప్పేసింది.
Tea : మనలో చాలా మందికి ఉదయం లేచిన వెంటనే టీ తాగే అలవాటు ఉంటుంది. అలాగే కేవలం టీ మాత్రమే…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం మరియు సంయోగం కారణంగా కొన్ని రాశుల వారి జీవితాలపై ప్రభావం…
NIRDPR Notification 2024 : నేషన ఇన్ స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి రంగంలో…
Utthana Ekadashi : హిందూమతంలో కార్తీక మాసానికి విశేషమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఇక ఈ నెల మొత్తం కూడా ఏకాదశి…
Telangana Cabinet : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావొస్తుంది. అయితే ఇంత వరకూ ఖాళీగా ఉన్న ఆరు…
Telangana : తెలంగాణలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సమాచార సేకరణకు ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే…
Seaplane Trial Run : విమానాశ్రయ మౌలిక సదుపాయాలను ఆధునీకరించడం, విమానయాన సంబంధిత పరిశ్రమలను ప్రోత్సహించడం మరియు ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యాలను…
Tollywood Actors : టాలీవుడ్ స్టార్ హీరోలు ఒకే ఫ్రేములో కనిపించడం చాలా అరుదు. ప్రత్యేక సందర్భాలలో వారు కలిసి…
This website uses cookies.