Home » Andhra Pradesh » Vangaveeti Radha Krishna Will Marry This Andhra Pradesh Woman
andhra pradesh

Vangaveeti Radha Krishna : వంగవీటి రాధా పెళ్లి చేసుకోబోయే అమ్మాయి బ్యాక్ గ్రౌండ్ వింటే షాకే..!!

Authored By
Breaking News
The Telugu News | Published on: August 17, 2023, 7:00 pm
Advertisement

Vangaveeti Radha Krishna : వంగవీటి రాధ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ క్రమంలో త్వరలో నిశ్చితార్థం జరగనుంది. ప్రస్తుతం ఈ వార్త వంగవీటి అభిమానులలో ఆనందాన్ని కలిగిస్తుంది. 41 సంవత్సరాలు వయస్సు కలిగిన వంగవీటి రాధా చాలా కాలం తర్వాత పెళ్లికి రెడీ కావడం ఆయన కుటుంబ సభ్యులలో కూడా సంతోషం నెలకొంది. ఇంతకీ వంగవీటి రాదా పెళ్లి చేసుకోబోయే అమ్మాయి వివరాలు చూస్తే నరసాపురం పట్టణానికి చెందిన అమ్మాయిని వంగవీటి రాధా పెళ్లి చేసుకోబోతున్నారట.

Advertisement

వంగవీటి మిత్రుడి దగ్గర బంధువుల అమ్మాయితో వివాహం నిశ్చయమైనట్లు సమాచారం. నరసాపురానికి చెందిన జక్కం పుష్పవల్లితో రాధాకృష్ణకు వివాహం నిశ్చయమైందట. ఏలూరు మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ జక్కం ఆమని బాబ్జీల చిన్న కుమార్తెల జక్కం పుష్పవల్లి..తో ఈనెల 19వ తారీఖు నరసాపురంలో ఎంగేజ్మెంట్ ఉంటుందని సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేసినట్లు సమాచారం. విజయవాడలో వివాహం జరగనుందని వార్తలు వస్తున్నాయి.

Vangaveeti Radha Krishna will marry this Andhra Pradesh woman

Advertisement

2004లో ఎమ్మెల్యేగా గెలిచిన వంగవీటి రాధా 2009వ సంవత్సరంలో ప్రజారాజ్యం నుండి పోటీచేసి ఓడిపోయారు. ఆ తర్వాత వైసిపి పార్టీలో జాయిన్ అయిన వంగవీటి రాధా 2014లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చెందడం జరిగింది. ఆ తర్వాత 2019 ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయినా వంగవీటి రాధా పోటీ చేయలేదు ప్రచారానికి పరిమితమయ్యారు. ఏపీ రాజకీయాల్లో యాక్టివ్ గా ఉండే వంగవీటి రాధా ఈసారి కచ్చితంగా ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నట్లు సమాచారం. రాధా చేసుకోబోయే అమ్మాయి కుటుంబం పూర్తిగా రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబం కావటంతో.. ఇది ఒక రకంగా రాధాకి చాలా ప్లస్ అని అంటున్నారు.

Breaking News

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి