
Varalakshmi Comments On Raadhika Sarathkumar
Raadhika Sarathkumar : రాధికా శరత్ కుమార్..ఈ పేరు తెలుగుతో పాటు తమిళ ప్రేక్షకులకి చాలా సుపరిచితం. ఈవిడ ఒకప్పుడు స్టార్ హీరోలతో కలిసి నటించింది. ప్రస్తుతం సీరియల్స్‌లో నటిస్తుంది. అయితే రాధిక, చిరంజీవి కలిసి ఎన్నో సినిమాల్లో జంటగా నటించారు. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఇక పరిశ్రమలో రాధిక, చిరంజీవిలు ఇప్పటికీ మంచి స్నేహితులు. ఈ క్రమంలో ఇటీవల ఓ చానల్‌తో ముచ్చటించిన రాధిక ఈ సందర్భంగా చిరంజీవి గురించి చెప్పుకొచ్చింది. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. చిరంజీవి సెల్ఫ్‌మేడ్ మ్యాన్ అంటూ కొనియాడారు. ప్రస్తుతం పరిశ్రమలో ఉన్న హీరోలందరూ తనకు ఇష్టమని, జూనియర్ ఎన్టీఆర్‌కు తాను అభిమానని తెలిపారు. తారక్ ఎనర్జీ లెవల్స్ ఫెంటాస్టిక్ అంటూ అతడిపై ప్రశంసలు కురిపించారు.
అలాగే మహేశ్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్‌లను చిన్నప్పటి నుంచి చూస్తున్నానని, ఇప్పుడు వారు స్టార్ హీరోలుగా ఎదగడం చూస్తుంటే చాలా గర్వంగా ఉందని ఆమె పేర్కొన్నారు. రీసెంట్ గా రాధిక తన 60 పుట్టినరోజు వేడుకలను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంది. కోలీవుడ్ టాలీవుడ్ స్టార్స్ అందరిని పిలిచి ఓ రేంజ్ లో పార్టీ ఇచ్చి ఘనంగా సెలబ్రేట్ చేసుకుంది . దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రాధిక బర్త్ డే సందర్భంగా అభిమానులతో పాటు పలువురు ప్రముఖులు కూడా ఆమెకు బర్త్ డే శుభాకాంక్షలు తెలియజేశారు.
Varalakshmi Comments On Raadhika Sarathkumar
లేడి విలన్‌గా మంచి పేరు ప్రఖ్యాతలు పొందిన వరలక్ష్మి శరత్ కుమార్… సవతి తల్లి పుట్టిన రోజుకి ర్ విష్ చేస్తూ..” అమ్మ అనకుండా ఆంటీ “అని పోస్ట్ పెట్టింది. ” 60వ జన్మదిన శుభాకాంక్షలు ఆంటీ.. లవ్ యు.. మీరు మా అందరికీ ఆదర్శం.. మీ వయసు ఎంత పెరిగిన ఇంకా యంగ్ గానే ఉన్నారు. గ్లామర్ కి నటనకి నెంబర్ అడ్డు కాదని.. మీ నుంచి నేర్చుకుంటున్న.. హావ్ ఏ గుడ్ ట్రిప్.. ఆంటీ ..సి యు సూన్.. లవ్ యు” అంటూ పోస్ట్ పెట్టింది. అయితే ఈ పోస్ట్‌పై కొందరు తప్పుడు కామెంట్స్ చేస్తున్నారు. సవతి తల్లి అయిన తల్లే కదా, అమ్మా అనకుండా ఆంటీ అని ఎలా అంటావు అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్‌పై భిన్న స్పందనలు వినిపిస్తున్నాయి.
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
This website uses cookies.