Home » News » Viral Video Netizens Are Saying That The Bride Is Doing Gym In Her Wedding Clothes
News

Viral Video : పెళ్లి బట్టల్లో జిమ్ చేస్తున్న పెళ్లికూతురు.. వరుడికి ఇక మూడినట్టే అంటున్న నెటిజన్స్

Authored By
mallesh
The Telugu News | Published on: September 4, 2022, 2:00 pm
Advertisement

Viral Video : ఈ రోజుల్లో పెళ్లి అనేదానికి కొత్త అర్థం చెబుతున్నారు నేటితరం యువతీయువకులు. జీవితంలో పెళ్లి అనేది ఒక్కసారే వస్తుంది కాబట్టి మనకు నచ్చినట్టు చేసుకోవాలని ఉచిత సలహాలు ఇస్తున్నారు.పెద్దలు నచ్చినట్టు చేసుకుంటే అందులో మజా ఏముందని కూడా కొత్తగా ఫిలాసఫీలు చెబుతున్నారు. అందుకోసమే పెళ్లిలో వింత వింత చేష్టలు చేస్తున్నారు. మండపంలోనే ముద్దులు పెట్టుకోవడం, కౌగిలించుకోవడం, డ్యాన్సులు చేయడం వంటివి చేస్తున్నారు. ఇంతటితో అయిపోయిందా ఇంకా చాలా ఉన్నాయి.

Advertisement

Viral Video : పెళ్లి బట్టల్లో జిమ్ ఏంటమ్మా..

అయితే, పెళ్లిళ్లలో అబ్బాయిల కంటే అమ్మాయిల హవానే ఎక్కువగా ఉంటోంది. పాత కాలంలో పెళ్లి కూతురు సిగ్గు పడుతూ మండపంలోకి వచ్చేది.కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది.ఎక్కడ చూసిన పెళ్లి కూతుర్లే డాన్స్ చేసుకుంటూ మండపంలోకి అఫీషియల్‌గా ఎంట్రీ ఇస్తున్నారు.ఇక తెలంగాణలో ఇలా పెళ్లి కూతుర్లు డాన్స్ చేసే కల్చర్ బాగా పెరిగిపోయింది. తాజాగా ఓ పెళ్లి కూతురు జిమ్‌లో వర్కౌట్స్ చేస్తూ ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పద్ధతిగా పెళ్లి దుస్తుల్లో ఉన్న అమ్మాయి డంబెల్స్ చేతబట్టి వర్కౌట్స్ చేస్తున్న వీడియో సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Viral Video netizens are saying that the bride is doing gym in her wedding clothes

Advertisement

అది చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఏ అమ్మాయి పెళ్లికి తయారవ్వడం చూడలేదని కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలాఉంటే కొందరుమాత్రం అమ్మాయి జిమ్ చేయడం చూసి వింతైన కామెంట్స్ చేస్తున్నారు.పెళ్లికి ముందే వర్కౌట్స్ చేస్తుందంటే అయితే అబ్బాయికి మూడినట్టేనా..అని కొందరు అంటుండగా.. మరికొందరు అత్తమామలకు పగిలిపోవాల్సిందేనని మరికొందరు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా పెళ్లికూతురు జిమ్‌లో వర్కౌట్స్ చేయడం అందరినీ మెస్మరైజ్ చేసిందని తెలుస్తోంది.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి