Home » Entertainment » War 2 Second Day Collections
Entertainment

War 2 | నెగెటివ్ టాక్‌తోను రెండో రోజు ఎక్కువ క‌లెక్ష‌న్స్ వ‌సూలు చేసిన ఎన్టీఆర్ వార్ 2

Authored By
Sam C
The Telugu News | Published on: August 16, 2025, 1:00 pm
Advertisement

War 2 | మాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ , గ్రీక్ గాడ్ హృతిక్ నటించిన లేటెస్ట్ సినిమా ‘వార్ 2 ఓపెనింగ్ డే కలెక్షన్స్ అఫీషియల్‌గా అనౌన్స్ చేయలేదు ప్రొడక్షన్ హౌస్ యష్ రాజ్ ఫిలిమ్స్. వరల్డ్ వైడ్ 85 కోట్లు కలెక్ట్ చేసినట్లు ట్రేడ్ వర్గాల రిపోర్ట్. ‘వార్ 2’కు ఇండియాలో రిలీజ్ రోజు రూ. 51.5 కోట్లు వచ్చాయి. హిందీ వెర్షన్ రూ. 29 కోట్లు, తెలుగు వెర్షన్ రూ. 22 కోట్లు కలెక్ట్ చేయడం వల్ల ఆ మాత్రం వచ్చాయి. రెండో రోజు రూ. 56.50 కోట్లు కలెక్ట్ చేసినట్లు అంచ‌నా. అంటే… ఆగస్టు 14 కంటే ఆగస్టు 15న ఐదు కోట్లు ఎక్కువ.

Advertisement

#image_title

వంద కోట్ల క్ల‌బ్‌లో..

Advertisement

‘వార్ 2’కు వచ్చిన రివ్యూలు, సోషల్ మీడియాలో జరిగిన నెగిటివిటీ చూస్తే రెండో రోజు కలెక్షన్స్ డ్రాప్ అయ్యే ఛాన్స్ ఎక్కువ అని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. కాని అంచనాలు తల్లకిందులు చేస్తూ మొదటి రోజు కంటే రెండో రోజు కాస్త ఎక్కువ వసూళ్లు రాబట్టింది. దాంతో ఇండియాలో ఈ సినిమా వంద కోట్ల నెట్ కలెక్షన్ మార్క్ దాటింది.

ఎన్టీఆర్ రీసెంట్ పాన్ ఇండియా సినిమాలతో కంపేర్ చేస్తే ఓవర్సీస్ మార్కెట్టులో ‘వార్ 2’కు దారుణమైన కలెక్షన్ వచ్చింది అనే చెప్పాలి. ఓపెనింగ్ డే విదేశాల్లో ఈ మూవీకి జస్ట్ 18 కోట్ల రూపాయలు మాత్రమే వచ్చాయి. హృతిక్ రోషన్ స్టార్ పవర్ ఈ మూవీకి అసలు ఏమాత్రం యాడ్ కాక‌పోవ‌డం అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో యష్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ నుంచి వచ్చిన ఈ సినిమా వీకెండ్ వరకు ఎంత కలెక్ట్ చేస్తుందనేది చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి