will pooja hegde ignored by makers
Acharya – Pooja Hegde: ఇక పూజా హెగ్డేను మన మేకర్స్ పక్కన పెడతారా..ఆచార్యకు మళ్ళీ దెబ్బ పడిందిగా..? అంటూ ప్రస్తుతం సోషల్ మీడియా లో కామెంట్స్ వస్తున్నాయి. దీనికి కారణం తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆచార్య సినిమా ఫలితమే. ఎంతటి స్టార్ హీరోయిన్ అయినా కూడా వరుసగా రెండు ఫ్లాపులొస్తే మాత్రం ఆమె వంక దర్శక, నిర్మాతలు చూసేందుకు ఆసక్తి చూపించరు. ఈ విషయం ఇప్పటికే రకుల్ ప్రీత్ సింగ్ లాంటి వారి విషయంలో చాలాసార్లు నిరూపణ అయింది. ఇప్పుడు అదే మళ్ళీ పూజా విషయంలో జరగనుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.
పూజా హెగ్డే కెరీర్‌లో ఫ్లాపులే ఎక్కువగా ఉన్నాయనే విషయం ఆమె అభిమానులైనా ఒప్పుకోవాల్సిందే. కెరీర్ ప్రారంభంలో పూజాకు ఎక్కువగా ఫ్లాపులే వచ్చాయి. అయినా మన మేకర్స్ అవకాశాలివ్వడంతో నిలదొక్కుకొని ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా మోస్ట్ వాంటెడ్ బ్యూటీగా చలామణి అవుతోంది. ఇటు టాలీవుడ్, కోలీవుడ్‌తో పాటుగా అటు బాలీవుడ్‌లోనూ పూజా హీరోయిన్‌గా సత్తా చాటుతోంది. అయితే, వాస్తవంగా ఆమె ఖాతాలో ఉన్న భారీ హిట్స్ అంటే రెండు సినిమాలే. అవి మహర్షి, అల వైకుంఠరములో మాత్రమే. అరవింద సమేత, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ హిట్ టాక్ తెచ్చుకున్న భారీ హిట్ మాత్రం కాదనే చెప్పాలి.
will pooja hegde ignored by makers
ఇక పాన్ ఇండియన్ హీరోయిన్‌గా సత్తా చాటాలనుకున్న పూజాకు షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. అదే మేకర్స్‌ను ఇప్పుడు భయపెడుతుంది. ప్రభాస్‌తో చేసిన రాధే శ్యామ్ సినిమా భారీ డిజాస్టర్..ఆ తర్వాత బీస్ట్ అదే టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు ఆచార్య సినిమాతో పూజా హెగ్డే ఖాతాలో హ్యాట్రిక్ డిజాస్టర్స్ పడ్డాయి. ఆచార్య సినిమాలో ముందు పూజా హెగ్డే రోల్ లేదు. చరణ్ పాత్ర నిడివి ఎప్పుడైతే పెరిగిందో..అప్పుడు ఆయన సరసన హీరోయిన్ కావాల్సి వచ్చింది. దాంతో చరణ్ ఏరి కోరి పూజాను దింపాడు. ఇప్పుడు పూజా ఆచార్యకు ఉన్న మైనస్‌లలో మేయిన్ మైనస్ అని చెప్పుకుంటున్నారు. మరి ఇప్పుడు పూజా గురించి నిర్మాతల మైండ్ సెట్‌లో మార్పులేమైనా వస్తాయా చూడాలి.
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…
This website uses cookies.