young woman wants software husband tweet viral
Software Husband : ఈరోజుల్లో సాఫ్ట్‌వేర్ జాబ్ కు ఉన్న క్రేజ్ ఏ జాబ్ కు ఉండదు. అవును.. సాఫ్ట్ వేర్ అంటేనే క్రేజ్. సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తున్నారంటే చాలు.. వాళ్లకు సంబంధాలు క్యూ కడతాయి. అమ్మాయిల తల్లిదండ్రులు కానీ.. అమ్మాయిలు కానీ సాఫ్ట్ వేర్ అంటే ఏమాత్రం ఆలోచించకుండా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. తాజాగా ఓ యువతి కూడా ఇదే విషయంపై ట్వీట్ చేసింది. నా పెళ్లిపై నేను నిర్ణయం తీసుకోలేకపోతున్నాను అంటూ ట్వీట్ చేసింది.
నా పెళ్లి విషయంపై మ్యాట్రిమోనీ సైట్ లో 14 మంది యువకులతో ఇప్పటికే విడివిడిగా మాట్లాడాను. కానీ.. ఎవరిని పెళ్లి చేసుకోవాలో అర్థం కావడం లేదు. వాళ్లలో అందరికీ ప్యాకేజీలు బాగానే ఉన్నాయి. ఒకరికి 14 లక్షలు ఉంటే.. కొందరికి 45 లక్షల వరకు ప్యాకేజీ ఉంది అంటూ చెప్పుకొచ్చింది ఆ యువతి. ఆ యువతి వయసు 29 ఏళ్లు. తను బీకాం చదివి ఇంటి వద్దే ఉంటుంది. తనను పెళ్లి చేసుకోవడం కోసం టెకీలు కూడా పోటీ పడుతున్నారట.నాకు ఎవరిని పెళ్లి చేసుకోవాలో అర్థం కావడం లేదు. చాలామంది అబ్బాయిలు అయితే నాకు పెళ్లి ప్రపోజల్స్ పంపించారు. పెద్ద పెద్ద కంపెనీల్లో పని చేస్తున్నారు. మీరే చెప్పండి.. ఎవరిని పెళ్లి చేసుకోవాలో అంటూ ఆ యువతి ట్వీట్ చేసింది. ఆ ట్వీట్ ను చూసి నెటిజన్లు ఆశ్చర్యపోయారు. తనకు దీటైన సమాధానాలు చెప్పారు. కొందరైతే నీ వయసు 29 ఏళ్లు అంటున్నావు.
young woman wants software husband tweet viral
ఇంకా ఇంట్లో ఖాళీగా కూర్చొంటున్నావా? జాబ్ చేసుకోవచ్చు కదా. మంచి ప్యాకేజీ ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకొని జాబ్ చేయకుండా ఎంజాయ్ చేస్తావా? అసలు ఇది ఫేక్ పోస్టు అంటూ ఎవరికి నచ్చిన పోస్టులు వాళ్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం శాలరీలు చూసి పెళ్లి చేసుకోకు. నిన్ను అర్థం చేసుకునే వాడిని చూసి పెళ్లి చేసుకో.. అంటూ సూచిస్తున్నారు. ఆ యువతి పెళ్లి చూపుల ట్వీట్ మాత్రం సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది.
Uric Acid : యూరిక్ యాసిడ్ అనేది అనేక ఆహారాలు, పానీయాలలో కనిపించే ప్యూరిన్లు అనే పదార్థాల విచ్ఛిన్నం నుండి…
Indian Army : ప్రస్తుతం భారత్- పాకిస్తాన్ మధ్య యుద్ధం ఓ రేంజ్‌లో నడుస్తుంది. నువ్వా, నేనా అంటూ రెండు…
Sachin Yadavrao Vananje : జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో పాకిస్తాన్ తో జరుగుతున్న యుద్ధం భారత సైనికుడు సచిన్ యాదవ్‌రావు…
Vijayashanti : పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారతదేశం పాక్‌పై చర్యలు తీసుకోవడం ప్రారంభించింది. ఉగ్రవాదుల పునాది అయిన పాక్‌లోని స్థావరాలను…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రైతుల అభ్యున్నతిని దృష్టిలో పెట్టుకొని "అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్"…
IPL 2025 : భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య ప్రస్తుతం దాడులు ప్రతి దాడుల నేపథ్యంలో ఐపీఎల్ 2025 వారం…
G7 Countries : పాక్ వైఖరి పట్ల ప్రపంచ దేశాలు కన్నెర్ర చేస్తున్నాయి. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్ అంతర్జాతీయ…
Anasuya : యాంకర్‌గా అదరగొట్టిన అనసూయ ఇప్పుడు నటిగాను సత్తా చాటుతుంది. సోషల్ మీడియా లో నిత్యం హాట్ ఫోజులతో…
This website uses cookies.