Vemireddy Prabhakar Reddy : ఏపీ ఎన్నికల సమీపిస్తున్న వేళ నెల్లూరు జిల్లాలో ఇప్పటికే ఎన్నో రకాల ఇబ్బందులు పడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇంకా ఇబ్బందులు పడే పరిస్థితులు చుట్టు కనిపిస్తున్నాయి. అయితే అవి జరగకుండా ఆపడం కోసం వై.యస్ జగన్ చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారు. అయితే దీనినే పాజిబుల్ డామేజ్ కంట్రోల్ అని అంటారు.ఆ డామేజ్ కంట్రోల్ అనేది ఎంత బాగా చేయగలిగితే డామేజ్ అంత తగ్గుతుంది అన్నమాట. అయితే నెల్లూరు జిల్లాలో టీడీపీ కూసాలు సైతం కదిలిచ్చేసిన వైసీపీ పార్టీకి ఈరోజు డామేజ్ కంట్రోల్ పరిస్థితి వచ్చింది. ఎందుకంటే మేకపాటి , కోటంరెడ్డి , ఆనం ఫ్యామిలీ ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది నెల్లూరు జిల్లాలో వైసీపీని కంప్లీట్ గా వీడి వెళ్లిపోయే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే వీరిలో కొంతమంది టీడీపీకి వెళ్లిపోయారు. అయితే నెల్లూరు జిల్లాలో ఇలాంటి పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి తెచ్చుకోకుండా ఉంటే బాగుండేది కానీ ఆ పరిస్థితి వచ్చేసింది. ఇక ఇప్పుడు వేమినేని ప్రభాకర్ రెడ్డిని భార్య వేమినేని ప్రశాంతి రెడ్డి ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పంపించకూడదు. తమ పార్టీలోనే ఎలాగైనా అంటిపెట్టుకోవాలి అని ఒక స్ట్రాంగ్ బేస్ తో జగన్మోహన్ రెడ్డి ముందుకు వెళ్తున్నారు. అయితే వేమినేని ప్రభాకర్ రెడ్డి అనే వ్యక్తి కి వైసీపీ పార్టీ యొక్క ప్రాథమిక సభ్యత్వం అలాగే రాజ్యసభ ఎంపీ. దానితో పాటు ఆయన భార్య కు కూడా ఒక పదవి ఉంది.
అయినప్పటికీ కూడా వేమినేని ప్రభాకర్ రెడ్డి అనే వ్యక్తి వైసీపీ పార్టీకి రాజీనామా చేసి టిడిపిలోకి వెళ్లడం జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి వీరికి చేసినంత తన సన్నిహితులకు కూడా చేయలేదని చెప్పాలి. అయితే ప్రస్తుతం జగన్ మోహన్ రెడ్డి తిరిగి వాళ్ళని వెనక్కి తెచ్చుకోవడానికి వారికి ఇస్తున్న ఆఫర్ ఏంటి అనే మాట బాగా వినిపిస్తుంది. అయితే నిజానికి వైసీపీకి సంబంధించిన మీడియా ఎప్పుడు చూసినా వేమినేని ప్రభాకర్ రెడ్డిని ఆయన భార్య ప్రశాంతి రెడ్డి వీళ్ళకి భజన చేస్తూ ఉండేది. అలాంటిది ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో వీరికి ఏ ఆఫర్ ఇస్తే వాళ్ళు వెనక్కి తగ్గుతారు అనేది ఇప్పుడు ఒక డిస్కషన్ గా మారింది.అయితే ఇదివరకే నెల్లూరు ఎంపీ గా ప్రభాకర్ రెడ్డికి ఆఫర్ చేశారు జగన్. అయితే ఇప్పుడు అది కాకుండా ఇంకెక్కడైనా నెల్లూరు జిల్లాలో లేదా ఇంకా ఎక్కడైనా ప్రకాశం జిల్లాలో కావచ్చు ఇంకొక ఎంపీ సీటు మీ వైఫ్ కూడా ఇస్తాము అని జగన్ ఆఫర్ చేయబోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. అది ఎంత వరకు నిజమో ఇంకా ఎవరికీ తెలియదు. అలా జరగకకపోవచ్చు. కానీ నెల్లూరు జిల్లాలో గ్రిప్ కోల్పోవడం అనేది వై.యస్ జగన్ అసలు యాక్సెప్ట్ చేయలేకపోతున్నటువంటి అంశం. రాబోతున్న ఎన్నికల కోసం ఇప్పటివరకు ఎక్కడైతే గ్రిప్ సెట్ చేశారో అలాంటి ప్రాంతంలో ఇప్పుడు గ్రిప్ కోల్పోవడం అనే అంశం అసలు జగన్ కి మింగుడు పడనటువంటి అంశం. అందుకే ఇప్పుడు ప్రశాంతి కి కూడా ఎంపీ టికెట్ ఇస్తాను అని జాగన్ మాట ఇస్తే పరిస్థితి బాగుంటుంది. ఇలా చేస్తే అది వర్క్ అవుట్ అవుతుందేమో అని ఒక చిన్న హోప్ జగన్మోహన్ రెడ్డికి ఉన్నట్లు ఉంది. అయితే దానిని అవతల వాళ్ళు ఎంతవరకు తీసుకుంటారో అనేది కూడా వేసి చూడాలి.
అయితే ఈ విషయం పై జగన్ ఇంకా ఆలోచిస్తున్నారని సమాచారం. అదేవిధంగా ప్రభాకర్ రెడ్డి అయితే ఇంకా టీడీపీలో జాయిన్ అవ్వలేదు. ఒకవేళ టీడీపీలో జాయిన్ అయి ఉంటే జగన్ కూడా సరే అని గివ్ అప్ చేసేవారేమో కానీ వాళ్లు ఇంకా జాయిన్ అవ్వలేదు. ఇక సొమనేని చంద్రశేఖర్ రెడ్డి గారు రీసెంట్ గా వెళ్లారు. టీడీపీ నేతలు అందరూ నెల్లూరు జిల్లా వారు అందరూ కావాల్సినవి మాట్లాడుతున్నారు.అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రభాకర్ రెడ్డికిచ్చే మరొక హామీ ఏంటంటే…ప్రభాకర్ రెడ్డి ఎక్కడైతే ఎంపీగా పోటీ చేస్తారో ఆయనకు సంబంధించి ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్ కి 5 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉంటాయి. ఇక ఈ ఐదు అసెంబ్లీ సెగ్మెంట్స్ నలుగురిని కూడా మీరు చెప్పిన వాళ్ళనే పెడతాను. అలాగే ఐదవ ప్లేసులో మీ భార్య ప్రశాంతి రెడ్డికి ప్లేస్ ఇస్తాను అని కూడా జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక ఈ ఆఫర్ కి గనుక వేమినేని ప్రభాకర్ రెడ్డి ఒప్పుకుంటే కచ్చితంగా మళ్లీ వైసీపీ పార్టీ కి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.