Home » Andhra Pradesh » Ys Jagan Getting Problems With Adinarayana Reddy
andhra pradesh

YCP – TDP : వైసీపీలో దొరికిన అతిపెద్ద టీడీపీ కోవర్ట్..!!

Authored By
Breaking News 2
The Telugu News | Published on: April 27, 2023, 9:00 am
Advertisement

YCP – TDP : ఆదినారాయణరెడ్డి తెలుసు కదా. టీడీపీ హయాంలో ఆయన మంత్రి. కడప జిల్లాకి చెందిన సీనియర్ రాజకీయ నేత. ఆదినారాయణ రెడ్డి ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు. అయితే.. టీడీపీ నుంచి బీజేపీలో చేరి.. అక్కడ కోవర్టుగా మారి చంద్రబాబు స్కెచ్ ప్రకారం ఆయన చెప్పినట్టుగా ఆదినారాయణ రెడ్డి నడుచుకుంటున్నారు అనేది ఆరోపణ. ఇంకో సంవత్సరంలో ఏపీలో ఎన్నికలు రాబోతున్నాయి. ఈనేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికలు వచ్చే సమయానికి.. బీజేపీతో టీడీపీకి పొత్తు కుదరకపోతే మళ్లీ ఆయన టీడీపీలో చేరుతారనే ప్రచారం సాగుతోంది.

Advertisement

ys jagan getting problems with adinarayana reddy

ఈనేపథ్యంలో సీఎం జగన్ మీద కూడా ఆదినారాయణ రెడ్డి ప్రస్తుతం ఫోకస్ పెట్టారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఆయన జగన్ కు ఫిట్టింగ్ పెడుతున్నారు. జగన్ మోహన్ రెడ్డి నిజానికి ముఖ్యమంత్రి మాత్రమే కావాలనుకోలేదు.. ఆయన ప్రధాని కావాలని అనుకుంటున్నారు అంటూ ఫిట్టింగ్ పెట్టారు ఆదినారాయణ రెడ్డి. అది కేవలం బీజేపీకి, ప్రధాని మోదీకి జగన్ పై వ్యతిరేకత రావాలి.. అన్న ఉద్దేశంతో ఆదినారాయణ రెడ్డి మాట్లాడినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ప్రధాని మోదీతో.. సీఎం జగన్ కు సత్సంబంధాలు ఉన్నాయి. కేంద్రంతో సత్సంబంధాలు పెట్టుకోవడానికి ఓవైపు జగన్ ప్రయత్నిస్తుంటే..

Advertisement

YCP – TDP : మోదీతో జగన్ కు సత్సంబంధాలు ఉన్న విషయం తెలిసిందే

మరోవైపు ఆదినారాయణరెడ్డి ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ షిప్ ను గండి కొట్టడానికి ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతం వైఎస్ వివేకా హత్య కేసులో ఆదినారాయణ రెడ్డి పాత్ర గురించి అందరూ చర్చిస్తున్నారు. అప్పట్లో టీడీపీ మంత్రిగా ఆదినారాయణ రెడ్డి ఉన్న సమయంలో ఆయన స్కెచ్ తోనే, ముందే తెలిసే వివేకా హత్య జరిగిందని అంటున్నారు. వైసీపీ కూడా ఆదినారాయణ రెడ్డిని వైఎస్ వివేకా హత్య కేసుపై అనుమానిస్తోంది. సీబీఐ దర్యాప్తు ఏకపక్షంగా వెళ్తుందనేది కూడా వైసీపీ వాదన. ఇదే సమయంలో ఆదినారాయణ రెడ్డి.. జగన్ మీద నిందలు వేస్తూ అటూ కేంద్రంతో జగన్ ను బెడిసికొట్టేలా, ఇటు వైఎస్ వివేకా హత్య కేసులో ఇరికించేలా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.

Breaking News 2

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి