YS Jagan : ఒకప్పుడు విశాఖపట్నం అంటే కేవలం సముద్రం మాత్రమే గుర్తుకు వచ్చేది. ఎంతో అద్బుతమైన విశాఖ ను గత ప్రభుత్వాల చేతకాని తనం వల్ల అభివృద్ది కాకుండా చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న సమయంలో మొత్తం అభివృద్దిని హైదరాబాద్ లో చేయడం జరిగింది. రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత చంద్రబాబు నాయుడు అమరావతి పేరుతో వైజాగ్ ను పట్టించుకోలేదు. కాని ఎప్పుడైతే జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నాడో అప్పటి నుండి వైజాగ్ దశ తిరిగి పోయింది. ప్రతి విషయంలో కూడా వైజాగ్ ను నెం.1 ఉంచేందుకు సీఎం జగన్ మోహన్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు.
రాష్ట్రం కు రాజధానిగా కూడా వైజాగ్ ను చేసిన ఘనత కేవలం జగన్ మోహన్ రెడ్డికే దక్కింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు వైజాగ్ అంటే ప్రతి ఒక్కరికి సముద్రం మాత్రమే కాకుండా ఏపీ యొక్క రాజధాని అంటూ గుర్తుకు వస్తుంది. ఇక నుండి ఇన్ఫోసిస్ యొక్క అతి పెద్ద కార్యాలయం కూడా వైజాగ్ లోనే ఉందనే విషయం గుర్తుకు వస్తుంది. రాష్ట్రం కే అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ గా భావిస్తున్న ఇన్ఫోసిస్ వల్ల రాష్ట్రంలో ఐటీ అభివృద్ది అద్బుతంగా జరగబోతుంది. ఇప్పటికే వైజాగ్ లో ఐటీ కారిడార్ ను ఏర్పాటు చేసి సాఫ్ట్ వేర్ హబ్ సెంటర్ గా వైజాగ్ ను మార్చేందుకు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది అంటూ ఆ పార్టీకి చెందిన నాయకులు మరియు వైజాగ్ కు చెందిన ప్రముఖులు చాలా సంతోషంగా వ్యాఖ్యలు చేయడం జరుగుతుంది.
గతంలో వైజాగ్ ను పట్టించుకోకుండా వదిలేసిన టీడీపీ నాయకులు ఇప్పుడు తమకు వైజాగ్ పై చాలా ప్రేమ ఉంది.. మేము అధికారంలోకి వస్తే మిమ్ముల అభివృద్ది చేస్తాం అంటూ చెబుతూ వస్తున్నారు. కాని వారు ఇన్నాళ్లు చేసింది ఏంటీ అంటూ వైకాపా నాయకులు ప్రశ్నిస్తున్నారు. తెలుగు దేశం పార్టీకి అసలు వైజాగ్ యొక్క అభివృద్ది విషయంలో చిత్తశుద్ది లేదు. అందుకే వైజాగ్ లో రాజధాని ఏర్పాటుకు మోకాళు అడ్డుతున్నారు. అక్కడ ఎలాంటి అభివృద్దిని టీడీపీ కోరుకోవడం లేదు. అభివృద్ది పనులకు అడ్డు తగులుతూ వైజాగ్ అభివృద్దికి ఆటంకం కలిగించడం వారి పనైంది అంటూ వైకాపా నాయకులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. సీఎం జగన్ వల్ల వైజాగ్ ప్రజల్లో తాము కూడా హైదరాబాద్ స్థాయికి అభివృద్ది చెందుతామని ఆశలు చిగురిస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.