YS Jagan : విశాఖపట్నం ప్రజల్లో ఆశలు చిరురించేలా చేస్తున్న వైఎస్ జగన్‌ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

YS Jagan : విశాఖపట్నం ప్రజల్లో ఆశలు చిరురించేలా చేస్తున్న వైఎస్ జగన్‌

 Authored By prabhas | The Telugu News | Updated on :23 June 2022,10:00 pm

YS Jagan : ఒకప్పుడు విశాఖపట్నం అంటే కేవలం సముద్రం మాత్రమే గుర్తుకు వచ్చేది. ఎంతో అద్బుతమైన విశాఖ ను గత ప్రభుత్వాల చేతకాని తనం వల్ల అభివృద్ది కాకుండా చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న సమయంలో మొత్తం అభివృద్దిని హైదరాబాద్‌ లో చేయడం జరిగింది. రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత చంద్రబాబు నాయుడు అమరావతి పేరుతో వైజాగ్ ను పట్టించుకోలేదు. కాని ఎప్పుడైతే జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నాడో అప్పటి నుండి వైజాగ్ దశ తిరిగి పోయింది. ప్రతి విషయంలో కూడా వైజాగ్ ను నెం.1 ఉంచేందుకు సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు.

రాష్ట్రం కు రాజధానిగా కూడా వైజాగ్‌ ను చేసిన ఘనత కేవలం జగన్ మోహన్ రెడ్డికే దక్కింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు వైజాగ్‌ అంటే ప్రతి ఒక్కరికి సముద్రం మాత్రమే కాకుండా ఏపీ యొక్క రాజధాని అంటూ గుర్తుకు వస్తుంది. ఇక నుండి ఇన్ఫోసిస్ యొక్క అతి పెద్ద కార్యాలయం కూడా వైజాగ్‌ లోనే ఉందనే విషయం గుర్తుకు వస్తుంది. రాష్ట్రం కే అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ గా భావిస్తున్న ఇన్ఫోసిస్ వల్ల రాష్ట్రంలో ఐటీ అభివృద్ది అద్బుతంగా జరగబోతుంది. ఇప్పటికే వైజాగ్‌ లో ఐటీ కారిడార్‌ ను ఏర్పాటు చేసి సాఫ్ట్‌ వేర్‌ హబ్ సెంటర్ గా వైజాగ్ ను మార్చేందుకు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది అంటూ ఆ పార్టీకి చెందిన నాయకులు మరియు వైజాగ్‌ కు చెందిన ప్రముఖులు చాలా సంతోషంగా వ్యాఖ్యలు చేయడం జరుగుతుంది.

YS Jagan ysrcp government doing development in Vishakhapatnam

YS Jagan ysrcp government doing development in Vishakhapatnam

గతంలో వైజాగ్ ను పట్టించుకోకుండా వదిలేసిన టీడీపీ నాయకులు ఇప్పుడు తమకు వైజాగ్‌ పై చాలా ప్రేమ ఉంది.. మేము అధికారంలోకి వస్తే మిమ్ముల అభివృద్ది చేస్తాం అంటూ చెబుతూ వస్తున్నారు. కాని వారు ఇన్నాళ్లు చేసింది ఏంటీ అంటూ వైకాపా నాయకులు ప్రశ్నిస్తున్నారు. తెలుగు దేశం పార్టీకి అసలు వైజాగ్‌ యొక్క అభివృద్ది విషయంలో చిత్తశుద్ది లేదు. అందుకే వైజాగ్ లో రాజధాని ఏర్పాటుకు మోకాళు అడ్డుతున్నారు. అక్కడ ఎలాంటి అభివృద్దిని టీడీపీ కోరుకోవడం లేదు. అభివృద్ది పనులకు అడ్డు తగులుతూ వైజాగ్‌ అభివృద్దికి ఆటంకం కలిగించడం వారి పనైంది అంటూ వైకాపా నాయకులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. సీఎం జగన్ వల్ల వైజాగ్‌ ప్రజల్లో తాము కూడా హైదరాబాద్‌ స్థాయికి అభివృద్ది చెందుతామని ఆశలు చిగురిస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది