Eluru : ఏలూరు రాజకీయాలు ఎప్పుడూ విభిన్నంగానే ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ ప్రతిసారి వైఎస్ కుటుంబ సన్నిహితులతో పాటు అటు చంద్రబాబు సన్నిహితుల మధ్యనే పోరు ఉంటుంది. వాస్తవానికి ఇది చాలా పెద్ద నియోజకవర్గం. పేరుకే కార్పొరేషన్ కానీ.. పెద్దగా డెవలప్ మెంట్ జరిగింది ఏమీ లేదు. అయినా సరే ఇక్కడి సామాజిక బలాలే గెలుపును శాసిస్తున్నాయి. ఈ సారి వైసీపీ నుంచి మాజీ మంత్రి సీనియర్ నేత ఆళ్ల నాని బరిలో ఉన్నారు. అటు టీడీపీ కూటమి అభ్యర్థిగా బడేటి బుజ్జి తమ్ముడు రాధాకృష్ణ బరిలో నిలబడ్డారు. వీరిద్దరూ గట్టిగానే ఈ సారి ప్రచారం చేశారు.
ఇక్కడి నుంచి 2004, 2009లో వైఎస్ రాజశేఖర్ అండతో కాంగ్రెస్ నుంచి ఆళ్ల నాని ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే 2014 ఎన్నికల్లో మాత్రం బడేటి బుజ్జి 20వేల ఓట్లతో గెలిచారు. మళ్లీ 2019లో ఆళ్ల నాని 4వేల ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఈ సారి 2లక్షల 35వేల ఓట్లు ఉండగా.. 70.17 శాతం ఓటింగ్ నమోదైంది. ఈసారి పోలింగ్ కాస్త తగ్గింది. కానీ ఎవరు గెలుస్తారనే ప్రచారం మాత్రం విస్తృతంగా జరుగుతోంది. నియోజకవర్గంలో ఉన్న చాలాపెండింగ్ సమస్యలు ఆళ్ల నానికి వ్యతిరేకంగా మారాయి. అంతే కాకుండా పార్టీ సీనియర్లు ఆయనపై చాలా అసంతృప్తితో ఉన్నారు. వారంతా ఎన్నికల్లో సహకరించలేదు. కానీ జగన్ చరిష్మా తనను గెలిపిస్తుందని ఆయన నమ్ముతున్నారు. అంతే కాకుండా చివరి సమయంలో టీడీపీ కూటమి నుంచి కొంత మంది కీలక లోకల్ లీడర్లు రావడం తనకు కలిసి వచ్చిందని ఆయన భావిస్తున్నారు. కానీ అటు టీడీపీ కూటమి అభ్యర్థి రాధాకృష్ణ మాత్రం తనదే గెలుపు అంటున్నారు.
ఎందుకంటే వైసీపీ నుంచి కీలక లీడర్లు టీడీపీలోకి వెళ్లి ఆయనకు మద్దతు తెలిపారు. జనసేన నేతలు కూడా అండగా కలిసి వచ్చారు. అందరినీ కలుపుకుని పోవడంలో రాధాకృష్ణ సక్సెస్ అయ్యారు. అంతే కాకుండా కేడర్ రాధాకృష్ణకు బలమైన అండగా ఉన్నారు. వారంతా కలిసి రాధాకృష్ణ గెలుపును డిసైడ్ చేస్తున్నారని అంటున్నారు. మరి ఏలూరులో సీనియర్ నేత గెలుస్తాడా లేదంటే జూనియర్ గెలుస్తాడా అనేది చూడాలి.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.