Home » Andhra Pradesh » Balakrishna Doing Non Sense In Ap Assembly
andhra pradesh

Balakrishna : బావ కళ్లల్లో ఆనందం కోసం బాలయ్య కష్టాలు

Authored By
Breaking News 2
The Telugu News | Published on: September 23, 2023, 4:00 pm
Advertisement

Balakrishna : ప్రస్తుతం ఏపీలో ఎక్కడ చూసినా కూడా చంద్రబాబు అరెస్ట్ గురించే చర్చ నడుస్తోంది. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కింద చంద్రబాబును అరెస్ట్ చేశారు. చంద్రబాబు అరెస్ట్ తో టీడీపీ నేతలు మొత్తం రోడ్డు మీదికి వచ్చి నిరసన తెలుపుతున్నారు. టీడీపీ అభిమానులు కూడా రోడ్ల మీదికి వచ్చి చంద్రబాబుకు మద్దతు తెలుపుతున్నారు. టీడీపీ అంటే అభిమానం ఉన్న వాళ్లు చంద్రబాబు అరెస్ట్ ను మాత్రం ఖచ్చితంగా ఖండిస్తున్నారు. అసలు ఎలాంటి ఆధారాలు లేకుండా చంద్రబాబును ఎందుకు అరెస్ట్ చేశారో అందరికీ తెలుసు అంటూ బాలకృష్ణ కూడా ఈ విషయంపై స్పందించారు. చంద్రబాబు అరెస్ట్ అయినప్పటి నుంచి బాలకృష్ణ చాలా కోపంతో ఉన్నారు. వైసీపీ నేతలను ఏకిపారేస్తున్నారు.

Advertisement

#image_title

అందులో భాగంగానే ఏపీ అసెంబ్లీలోనూ బాలకృష్ణ రచ్చ రచ్చ చేశారు. ఇప్పటి వరకు ఏపీ అసెంబ్లీలో ఆయన చేసిన రచ్చ ప్రస్తుతం ఏపీలోనే చర్చనీయాంశం అవుతోంది. పార్టీలో కీలక నేతగా వ్యవహరిస్తున్న బాలకృష్ణ చంద్రబాబు అరెస్ట్ తో బయటికి వచ్చి రచ్చ చేస్తున్నారు. ఏపీ అసెంబ్లీలో చంద్రబాబు అరెస్ట్ పై ఆయన అగ్గి మీద గుగ్గిలం అయ్యారు. చంద్రబాబును ఎలా అరెస్ట్ చేస్తారంటూ అసెంబ్లీలో ప్రశ్నించారు.

Advertisement

Balakrishna : అన్ని సమయాల్లో ఎందుకు బాలకృష్ణ స్పందించరు

చంద్రబాబు అరెస్ట్ అయితే బయటికి వచ్చ నానా యాగీ చేస్తున్న బాలకృష్ణ.. మిగితా విషయాల్లో ఎందుకు స్పందించరు అంటూ ప్రస్తుతం ఏపీ ప్రజలు అడుగుతున్నారు. గత నాలుగేళ్లలో ఏపీలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలామంది టీడీపీ నాయకులపై పలు కేసులు పెట్టి వైసీపీ ప్రభుత్వం జైలులో పెట్టింది. అప్పుడు ఎందుకు బాలకృష్ణ స్పందించలేదు. ఒక టీడీపీ నేతగా, ఎమ్మెల్యేగా ఎందుకు బాలకృష్ణ స్పందించలేదు అంటూ జనాలు ఏకిపారేస్తున్నారు. ఏది ఏమైనా ఇప్పుడు చంద్రబాబు అరెస్ట్ అయ్యారు కాబట్టి తన బావ కాబట్టి ఆయన కోసం ఇలా బయటికి వచ్చి బాలకృష్ణ రచ్చ రచ్చ చేస్తున్నారు. అసెంబ్లీలో తొడగొడుతున్నారు.. విజిల్ వేస్తున్నారు అంటూ ఏపీ ప్రజలు చెబుతున్నారు.

Breaking News 2

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి