Home » Andhra Pradesh » Bandla Ganesh Counter To Tdp Chandrababu
andhra pradesh

Bandla Ganesh : బండ్ల గణేష్ కి అంత కోపం తెప్పించిన సీన్ ఇదే.. అందుకే చంద్రబాబుని పిచ్చ తిట్లు తిడుతున్నాడు !

Authored By
Breaking News 2
The Telugu News | Updated on: June 5, 2023 9:00 pm
Advertisement

Bandla Ganesh  : ప్రస్తుతం ఏపీ అంతా ఒకటే ట్రెండింగ్ టాపిక్. అదే టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి బీజేపీ నేతలను కలవడం. అది కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాను వెనువెంటనే కలవడంతో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. అసలు.. 2019 ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత చంద్రబాబును బీజేపీ నేతలు ఖాతరు చేయలేదు. దానికి కారణం.. ఎన్నికలకు ముందు రెండు పార్టీల మధ్య జరిగిన లొల్లి. బీజేపీతో అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు తెగదెంపులు చేసుకున్న విషయం తెలిసిందే.

Advertisement

మళ్లీ అప్పటి నుంచి ఇప్పటి వరకు బీజేపీ నేతలు చంద్రబాబును దగ్గరకు తీయలేదు. కానీ.. ఏపీలో ఇంకో సంవత్సరంలో ఎన్నికలు ఉన్నాయనగా.. ఇప్పుడు తాజాగా చంద్రబాబుకు బీజేపీ హైకమాండ్ అపాయింట్ మెట్ ఇవ్వడం సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. అంతే కాదు.. బీజేపీ, టీడీపీ పొత్తులు కూడా ఇప్పుడు తెరమీదికి వచ్చాయి. కానీ.. టీడీపీ కార్యకర్తలకు, అభిమానులకు ఈ పొత్తు నచ్చడం లేదు. తాజాగా.. టాలీవుడ్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ బీజేపీ, టీడీపీ పొత్తుపై ఓ ట్వీట్ వదిలారు. అది మామూలు ట్వీట్ కాదు. స్ట్రాంగ్ ట్వీట్ అనే చెప్పుకోవాలి.

bandla ganesh counter to tdp chandrababu

Advertisement

Bandla Ganesh : ఇంతకంటే ఇంకేం కావాలి.. దరిద్రం అంటూ ట్వీట్

కర్మ కర్మ.. కాకపోతే ఇంకేంటి ఆయన ఏం అంటే అది అనాలి. సీపీఎం అంటే సీపీఎం అనాలా.. బీజేపీ అంటే బీజేపీ అనాలా.. కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ అనాలా? జనసేన అంటే జనసేన అనాలి. ఆయన కన్వీనెంట్ గా ఏ పేరు చెబితే దాన్నే అందరూ ఫాలో అవ్వాలి. అంతే కానీ.. ఎవ్వరికీ ఆత్మాభిమానం, మంచి, చెడు, మానవత్వం ఉండదా? ఆయన పొగిడితేనే జాతిని పొగిడినట్టా.. లేకపోతే జాతికి ద్రోహం చేసినట్టా.. ఇంతకంటే దరిద్రం ఇంకేవాలి అంటూ బండ్ల గణేష్ స్ట్రాంగ్ ట్వీట్ వేశారు. ఇందులో చంద్రబాబు ప్రస్తావన తీసుకురాలేదు బండ్ల గణేష్. కానీ.. టీడీపీ, బీజేపీ పొత్తు మీద వేరే వాళ్ల కామెంట్లకు బండ్ల గణేష్ ఈ ట్వీట్ చేశారు కాబట్టి ఆయన ట్వీట్ ఖచ్చితంగా టీడీపీ, బీజేపీ పొత్తు మీద అనే భావించాల్సి వస్తోంది.

Breaking News 2

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి