Big Breaking Allu Arjun Arrest : పుష్ప 2 సినిమా రిలీజ్ టైం లో సంధ్య థియేటర్ తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందింది. ఈ నేపథ్యంలో ఎలాంటి ముందు చూపు లేకుండా వచ్చినందుకు అల్లు అర్జున్ ని టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు అల్లు అర్జున్ ని తీసుకెళ్తారని తెలుస్తుంది. ఇప్పటికే ఆ సంఘటన జరిగిన టైం లో సంధ్య థియేటర్ ఓనర్ ఇంకా సెక్యురిటీ ఇంచార్జ్ ని అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఈ కేసులో అల్లు అర్జున్ ని కూడా అరెస్ట్ చేశారు. ఐతే పుష్ప 2 పాన్ ఇండియా లెవెల్ లో భారీ కలెక్షన్స్ తో హంగామా చేస్తున్న టైం లో అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయడం అతని ఫ్యాన్స్ ని షాక్ అయ్యేలా చేసింది. ఐతే అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత లీగల్ ప్రొసీడింగ్ ఎలా ఉంటుంది. ఈ కేసు ఎక్కడిదాకా వెళ్తుంది. అసలు అల్లు అర్జున్ ని ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది అన్న విషయం పై ఇంకా డీటైల్స్ బయటకు రావాల్సి ఉంది.
ఐతే అల్లు అర్జున్ మాత్రం అరెస్ట్ ని ఊహించలేదు. పోలీసులు అరెస్ట్ చేసే ముందు కాఫీ కప్ తో కనిపించారు. సంధ్య థియేటర్ కు ఎలాంటి ముందు పర్మిషన్ లేకుండా అల్లు అర్జున్ రావడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తుంది. ఐతే పోలీసులు అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయడం వల్ల ఈ కేసు మరింత తీవ్రత సాధించే అవకాశం ఉంది.
పోలీసులు అల్లు అర్జున్ తన వెంట రావాలని చెబుతున్నారు. అల్లు అర్జున్ మీద మూడు సెక్షన్లలో కేసు పెట్టినట్టు తెలుస్తుంది. ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందారు. రేవతి భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు అల్లు అర్జున్ ని అరెస్ట్ చేశారు. ఐతే కోర్టులో అల్లు అర్జున్ కూడా రివర్స్ కేసు వేశాడు. అది హియరింగ్ కి రాకుండానే అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. Allu Arjun, Allu Arjun Arrest, Pushpa 2, Movie ,
Mahesh Rajamouli Movie : సూపర్ స్టర్ మహేష్ రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న సినిమా త్వరలో సెట్స్ మీదకు…
Health Tips: ఇప్పుడున్న సమాజంలో అనేక టెన్షన్స్, ఒత్తిడిలు,ఎక్కువైపోయాయి. మానసిక ప్రశాంతత కోల్పోతున్నారు. ఎందుకంటే బిజీ లైఫ్ లో డబ్బు…
IRCTC : దేశం యొక్క రవాణా వ్యవస్థకు వెన్నెముక అయిన భారతీయ రైల్వేలు దాని విస్తృతమైన నెట్వర్క్తో ప్రతిరోజూ మిలియన్ల…
Allu Arjun : తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో సినీ నటుడు అల్లు అర్జున్ శనివారం ఉదయం హైదరాబాద్…
పుష్ప 2 తో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అందుకున్న అల్లు అర్జున్ ని 12 గంటల పాటు అరెస్ట్…
Tirupati Laddu : లడ్డూ వివాదం నేపథ్యంలో ఆలయ వంటశాలను పరిశీలించేందుకు ఆరుగురు సభ్యుల ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)…
House : జీవన ప్రపంచం వేగంగా మారుతోంది. ఎక్కువ ఖర్చు లేకుండా మీ కలల ఇంటిని నిర్మించడం గురించి ఆలోచిస్తున్నారా?…
Allu Arjun Lawyer : డిసెంబర్ 4 న పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్లో జరిగిన…
This website uses cookies.