Allu Arjun : సుకుమార్ ని రెడ్డి చేసిన అల్లు అర్జున్.. హిట్టు కొట్టి ఏదేదో మాట్లాడుతున్న పుష్ప రాజ్..!
ప్రధానాంశాలు:
Allu Arjun : సుకుమార్ ని రెడ్డి చేసిన అల్లు అర్జున్.. హిట్టు కొట్టి ఏదేదో మాట్లాడుతున్న పుష్ప రాజ్..!
Allu Arjun : పుష్ప 2 హిట్ ఐన క్రమంలో అల్లు అర్జున్ కాస్త జోష్ ఎక్కువైనట్టు కనిపిస్తుంది. ఆ జోష్ లో తానేం మాట్లాడుతున్నాడో అన్నది కూడా మర్చిపోతున్నాడు. ముఖ్యంగా తనతో 20 ఏళ్లుగా పనిచేస్తూ వచ్చిన దర్శకుడి పేరుని సైతం అల్లు అర్జున్ మర్చిపోయాడు. ఇంతకీ అసలు విషయం ఏంటంటే పుష్ప 2 సినిమా ఢిల్లీ ప్రెస్ మీట్ లో అల్లు అర్జున్ స్పీచ్ లో దర్శకుడు సుకుమార్ పూర్తి పేరుని చెప్పే క్రమంలో బండ్రెడ్డి సుకుమార్ బదులుగ బండి సుకుమార్ రెడ్డి అని పలికాడు.అప్పటి నుంచి నేషనల్ మీడియా నుంచి మన లోకల్ మీడియా వరకు ఒక ఆట ఆడేసుకుంటున్నారు. సుకుమార్ ఇంటి పేరు బండ్రెడ్డి కానీ అల్లు అర్జున్ దాన్ని బండి అని పిలిచి సుకుమార్ చివరన రెడ్డి చేర్చాడు. అప్పుడు బండ్రెడ్డి సుకుమార్ కాస్త బండి సుకుమార్ రెడ్డి అయ్యాడు. సో అలా సుకుమార్ పేరుని అల్లు అర్జున్ తప్పు పలికాడు. అల్లు అర్జున్ అలా టంగ్ స్లిప్ అయ్యాడో లేదో ఇలా మీడియా మొత్తం దాన్ని వైరల్ చేస్తుంది.
Allu Arjun నాలుగు సినిమాలు 20 ఏళ్లకు పైగా..
ఆర్య నుంచి పుష్ప 2 వరకు అల్లు అర్జున్ తో నాలుగు సినిమాలు 20 ఏళ్లకు పైగా పరిచయం ఉన్న అల్లు అర్జున్ అతని ఇంటి పేరుని మర్చిపోవడం హాట్ టాపిక్ గా మారింది. అంతేకాదు బండ్రెడ్డి సుకుమార్ ని బండి సుకుమార్ రెడ్డి అని పిలవడం కూడా వైరల్ అయ్యింది. ఇంతకీ అసలు నిజంగానే సుకుమార్ రెడ్డి కమ్యునిటీ చెందిన వ్యక్తేనా ఇన్నాళ్లు ఆయన రెడ్డి ట్యాగ్ వాడలేదా అంటే.. అసలు సుకుమార్ రెడ్డి కాదు.. ఆయన గోదావరి జిల్లాల్లో పెద కాపు క్యాస్ట్ కి చెందిన వ్యక్తి.
ఐతే ఆ విషయం అల్లు అర్జున్ కి కూడా తెలుసు. కానీ బండ్రెడ్డి సుకుమార్ అని చెప్పబోయే బండి సుకుమార్ రెడ్డి అని పిలిచాడు. అలా చెప్పడం వల్ల తను మిస్ గైడ్ చేసినట్టు అనిపించింది. పుష్ప 2 లాంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాక అల్లు అర్జున్ తన స్పీచ్ లలో ఏదో ఒకటి తప్పు చెబుతున్నాడు. మరి కావాలని కాకపోయినా అల్లు అర్జున్ చేస్తున్న ఈ తప్పులకు యాంటీ ఫ్యాన్స్ కి మంచి స్టఫ్ అవుతుంది. Allu Arjun, Sukumar Reddy, Pushpa 2, Bandreddi Sukumar, Bandi Sukumar Reddy