KCR – Chandrababu : ప్రస్తుతం తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను పరామర్శించడానికి తెలంగాణ, ఏపీకి చెందిన పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు యశోద ఆసుపత్రికి క్యూ కడుతున్నారు. ఇప్పటికే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ మంత్రులు, కాంగ్రెస్ నాయకులు, మెగాస్టార్ చిరంజీవి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కేసీఆర్ ను పరామర్శించారు. తాజాగా కేసీఆర్ ను టీడీపీ అధినేత చంద్రబాబు పరామర్శించారు. కేసీఆర్ ను పరామర్శించి ఆయన బాగోగులు తెలుసుకున్నారు. ఆయనకు జరిగిన ప్రమాదంపై చంద్రబాబు ఆరా తీశారు. కేసీఆర్ బెడ్ పక్కన కూర్చొని కాసేపు ఇద్దరూ సరదాగా మాట్లాడుకున్నారు. తన ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు చంద్రబాబు.
నిజానికి చంద్రబాబు, కేసీఆర్ దోస్తులే. కేసీఆర్ రాజకీయ ప్రస్థానం టీడీపీతోనే స్టార్ట్ అయింది. చంద్రబాబు, కేసీఆర్ ఇద్దరూ కలిసి చాలా ఏళ్లు టీడీపీలో కలిసి పని చేశారు. అప్పటి నుంచి వీళ్ల మధ్య సాన్నిహిత్యం ఉంది. అయితే.. ఆ తర్వాత ఇద్దరూ రాజకీయాల్లో శత్రువులు అయ్యారు. రాజకీయాల్లో శత్రువులు అయినప్పటికీ.. ఇద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్ షిప్ మాత్రం అలాగే ఉంది. అందుకే.. కేసీఆర్ కాలుకు సర్జరీ జరిగిందని తెలియగానే చంద్రబాబు పరిగెత్తుకుంటూ యశోద ఆసుపత్రికి వచ్చి ఆయన్ను పరామర్శించారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.
చంద్రబాబు కేటీఆర్ తోనూ కాసేపు చర్చించారు. కేసీఆర్ ను జాగ్రత్తగా చూసుకోవాలని కేటీఆర్ కు సూచించారు. అనంతరం బయటికి వచ్చిన చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. అయితే.. చంద్రబాబు.. యశోద ఆసుపత్రికి వచ్చారని తెలిసి ఆయన అభిమానులు ఆసుపత్రికి భారీ సంఖ్యలో వచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు.. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని, ధైర్యంగా ఉండాలని ఆయనకు చెప్పానని అన్నారు.
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
This website uses cookies.