
Donald Trump PM Modi : ట్రంప్‌తో మోదీ కీలక భేటిలో ఆసక్తికర చర్చలు.. కీలక అంశాలు ఇవే..!
Donald Trump PM Modi : అగ్రరాజ్యం అమెరికాకి ట్రంప్ Donald Trump మరోసారి అధ్యక్షుడు అయిన తర్వాత భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. PM Modi ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భేటీ అయ్యారు. ప్రధానితో పాటు విదేశాంగశాఖ మంత్రి జై శంకర్, భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. వైట్‌హౌస్‌లో జరిగిన ఈ సమావేశంలో టారిఫ్‌లు, వలసలు, భారత్-అమెరికా వ్యూహాత్మక అంశాలపై ఇరువురూ ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది.
Donald Trump PM Modi : ట్రంప్‌తో మోదీ కీలక భేటిలో ఆసక్తికర చర్చలు.. కీలక అంశాలు ఇవే..!
సుంకాలు, వలసలు, ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం తదితర కీలక అంశాలపై ప్రధానంగా చర్చించినట్టు తెలుస్తుంది. భవిష్యత్తులో భారత్-అమెరికాలు అనేక పెద్ద వాణిజ్య ఒప్పందాలను ప్రకటించబోతున్నాయని వెల్లడించారు. భారత్ కు అధునాతన ఎఫ్-31 యుద్ధ విమానాలను విక్రయించేందుకు అమెరికా సిద్ధంగా ఉన్నట్లు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. అమెరికాలో ఉత్పత్తి అయ్యే చమురు, గ్యాస్‌ను భారత్ మరింతగా కొనుగోలు చేస్తుంది.. ఈ ఏడాది నుంచి భారత్‌కు మిలిటరీ ఉత్పత్తుల విక్రయాలను కూడా పెంచుతామని ట్రంప్ అన్నారు.
ఇక భారత్, అమెరికా కలిసి వేగంగా అభివృద్ధి చెందుతాయని ప్రధాని మోదీ అన్నారు. అదే సమయంలో మీ రాక నాకు గౌరవం అని డొనాల్డ్ ట్రంప్ ప్రధాని మోదీతో అన్నారు.ఇక ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన ముగిసింది. దీంతో ఆయన అమెరికా నుంచి భారత్ కు తిరుగు ప్రయాణం అయ్యారు. ఈ నెల 12, 13 తేదీల్లో ప్రధాని మోదీ అమెరికాలో పర్యటించారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, తులసీ గబ్బార్ఢ్, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ , వివేక్ రామస్వామి తదితరులతో ప్రధాని మోదీ సమావేశం అయ్యారు.
Prabhas vs Dhurandhar : తెలుగు సినిమా సత్తాని ప్రపంచానికి చాటిన సినిమా బాహుబలి 2. ముఖ్యంగా అమెరికా బాక్సాఫీస్…
Students : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పాఠశాల విద్యార్థుల ఆరోగ్యం మరియు వారి విద్యా భవిష్యత్తుపై కూటమి ప్రభుత్వం ఒక కీలకమైన…
Viral video : భారత క్రికెట్ స్టార్, ఆర్సీబీ కీలక బ్యాటర్ విరాట్ కోహ్లీ పేరు మరోసారి సోషల్ మీడియాలో…
IPL 2026 : ఐపీఎల్ 2026 సందడి నేటి నుంచే ప్రారంభమవుతున్న నేపథ్యంలో క్రికెట్ అభిమానులకు పోలీస్ ఉన్నతాధికారి వీసీ…
LPG Gas : దేశవ్యాప్తంగా వంట గ్యాస్ సరఫరాపై ఆందోళన క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా కమర్షియల్ గ్యాస్ కొరత కారణంగా…
IPL 2026 : నేటి నుంచి ఐపీఎల్ ప్రారంభం కానుంది. ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ఈ…
Ration Card : కేంద్ర ప్రభుత్వం మూడు నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి లబ్ధిదారులకు అందించాలనే నిర్ణయంతో రాష్ట్రాలకు మార్గదర్శకాలు…
EPFO : దేశంలో ప్రైవేట్ రంగంలో పనిచేసే ప్రతి ఉద్యోగికి పీఎఫ్ (ప్రావిడెంట్ ఫండ్) ఖాతా ఒక ముఖ్యమైన భద్రతా…
Gold Silver Rates March 28 : బంగారం కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ అప్‌డేట్ మీకోసమే.…
Karthika Deepam 2 March 28th 2026 Episode : స్టార్ మాలో ప్రసారం అవుతున్న 'కార్తీక దీపం 2'…
Watermelon vs Cucumber : వేసవి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ఎండలు మండిపోవడంతో శరీరం త్వరగా డీహైడ్రేషన్‌కు గురవుతోంది. ఇలాంటి…
Liver Detox Juice : నేటి వేగవంతమైన జీవనశైలిలో మన ఆరోగ్యంపై దృష్టి తగ్గిపోవడం వల్ల అనేక సమస్యలు తలెత్తుతున్నాయి.…
This website uses cookies.