Cross Voting : ప్రస్తుతం అధికారంలో వైసీపీ ఉండగా, ఈ సారి ఆ పార్టీని రాకుండా చూడాలని టీడీపీ, జనసేన, బీజేపీ కంకణం కట్టుకున్నాయి. వైసీపీని అధికారంలోకి రాకుండా చేయడమే లక్ష్యంగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీలు పొత్తులో భాగంగా సీట్ల పంపకాలు కూడా పూర్తి చేసుకున్నాయి. ఇప్పుడు నామినేషన్ల ప్రక్రియ మొదలు కావడంతో ఆ బిజీలో ఉన్నారు. ఎప్పటి మాదిరే ఈసారి కూడా చంద్రబాబు స్వయంగా నామినేషన్ వేయడం లేదు. చంద్రబాబు తరపున ఆయన అర్ధాంగి నారా భువనేశ్వరి నామినేషన్ దాఖలు చేశారు. కుప్పంలో రిటర్నింగ్ అధికారులకు భువనేశ్వరి నామినేషన్ పత్రాలను అందించారు.
చంద్రబాబు నామినేషన్ కార్యక్రమానికి పెద్ద ఎత్తున టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు తరలి వచ్చాయి.అయితే ఇప్పుడు ఈ మూడు పార్టీలకి క్రాస్ ఓటింగ్ భయం పట్టుకుంది. దానికి కారణం ఈ మూడు పార్టీలు కూడా ఉమ్మడిగా చాలాచోట్ల ప్రచారాన్ని నిర్వహించకపోవడమే కారణం. శాసనసభ కు పోటీ చేస్తున్న అభ్యర్థులు కేవలం తాము పోటీ చేసే స్థానం విషయం గురించే ప్రజలకు వివరిస్తూ, తమ పార్టీ గుర్తుని ప్రజల్లోకి తీసుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు తప్ప పొత్తులో భాగంగా ఎంపీ స్థానాల్లో వేరే పార్టీ అభ్యర్థి పోటీలో ఉన్నా, ఆ గుర్తు గురించి ఎమ్మెల్యే అభ్యర్ధుల గురించి ప్రచారం నిర్వహించకపోవడంపై ఇప్పుడు గందరగోళం నెలకొంది.
రెండు గుర్తులని ప్రచారం చేస్తే ఓటర్లు కన్ఫ్యూజ్ అవుతారనే ఉద్దేశంతో ఎమ్మెల్యే అభ్యర్థులు ఎంపీ అభ్యర్థులు గుర్తు గురించి ప్రచారం చేయడం లేదని తెలుస్తుంది. అయితే ఈ కూటమి పార్టీల్లో కొత్త ఆందోళనకు తెరతీసింది. ఇంకా ఇదే పరిస్థితి కొనసాగితే పోలింగ్ సమయంలో క్రాస్ ఓటింగ్ జరుగుతుందని, దీని కారణంగా మూడు పార్టీలు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని విశ్లేషకులు అంటున్నారు. ఎన్నికల ఫలితాల్లో శాసనసభ నియోజకవర్గాల్లో ఒక పార్టీ అభ్యర్థి గెలిచి, పార్లమెంట్ కు పోటీ చేసిన కూటమి అభ్యర్థి ఓడిపోతే, క్రాస్ ఓటింగ్ జరిగిందనే విషయం మాత్రం స్పష్టంగా అర్ధమవుతుంది.
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
Cough And Cold : సీజన్ మారుతున్న టైమ్ లో హఠాత్తుగా జలుబు చేయడం సర్వసాధారణమైన విషయం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ…
This website uses cookies.