Cross Voting : ఈ సారి కూట‌మికి బిగ్ ఛాలెంజ్‌.. గుర్తుల విష‌యంలో గంద‌ర‌గోళం త‌ప్ప‌దా?

 Authored By ramu | The Telugu News | Updated on :19 April 2024,9:00 pm

Cross Voting : ప్ర‌స్తుతం అధికారంలో వైసీపీ ఉండ‌గా, ఈ సారి ఆ పార్టీని రాకుండా చూడాల‌ని టీడీపీ, జ‌న‌సేన, బీజేపీ కంక‌ణం క‌ట్టుకున్నాయి. వైసీపీని అధికారంలోకి రాకుండా చేయడమే లక్ష్యంగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ప్ర‌స్తుతం టీడీపీ, వైసీపీ, జ‌న‌సేన పార్టీలు పొత్తులో భాగంగా సీట్ల పంప‌కాలు కూడా పూర్తి చేసుకున్నాయి. ఇప్పుడు నామినేష‌న్ల ప్రక్రియ మొద‌లు కావ‌డంతో ఆ బిజీలో ఉన్నారు. ఎప్పటి మాదిరే ఈసారి కూడా చంద్రబాబు స్వయంగా నామినేషన్ వేయడం లేదు. చంద్రబాబు తరపున ఆయన అర్ధాంగి నారా భువనేశ్వరి నామినేషన్ దాఖలు చేశారు. కుప్పంలో రిటర్నింగ్ అధికారులకు భువనేశ్వరి నామినేషన్ పత్రాలను అందించారు.

Cross Voting : కూటమి పార్టీల్లో క్రాస్ ఓటింగ్ భయం

చంద్రబాబు నామినేషన్ కార్యక్రమానికి పెద్ద ఎత్తున టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు తరలి వచ్చాయి.అయితే ఇప్పుడు ఈ మూడు పార్టీల‌కి క్రాస్ ఓటింగ్ భ‌యం ప‌ట్టుకుంది. దానికి కార‌ణం ఈ మూడు పార్టీలు కూడా ఉమ్మడిగా చాలాచోట్ల ప్రచారాన్ని నిర్వహించకపోవడమే కారణం. శాసనసభ కు పోటీ చేస్తున్న అభ్యర్థులు కేవలం తాము పోటీ చేసే స్థానం విషయం గురించే ప్రజలకు వివరిస్తూ, తమ పార్టీ గుర్తుని ప్రజల్లోకి తీసుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు త‌ప్ప పొత్తులో భాగంగా ఎంపీ స్థానాల్లో వేరే పార్టీ అభ్యర్థి పోటీలో ఉన్నా, ఆ గుర్తు గురించి ఎమ్మెల్యే అభ్య‌ర్ధుల గురించి ప్ర‌చారం నిర్వ‌హించ‌క‌పోవ‌డంపై ఇప్పుడు గంద‌ర‌గోళం నెల‌కొంది.

Cross Voting : ఈ సారి కూట‌మికి బిగ్ ఛాలెంజ్‌.. గుర్తుల విష‌యంలో గంద‌ర‌గోళం త‌ప్ప‌దా?

Cross Voting : ఈ సారి కూట‌మికి బిగ్ ఛాలెంజ్‌.. గుర్తుల విష‌యంలో గంద‌ర‌గోళం త‌ప్ప‌దా?

రెండు గుర్తుల‌ని ప్ర‌చారం చేస్తే ఓటర్లు కన్ఫ్యూజ్ అవుతారనే ఉద్దేశంతో ఎమ్మెల్యే అభ్యర్థులు ఎంపీ అభ్యర్థులు గుర్తు గురించి ప్రచారం చేయ‌డం లేద‌ని తెలుస్తుంది. అయితే ఈ కూటమి పార్టీల్లో కొత్త ఆందోళనకు తెరతీసింది. ఇంకా ఇదే పరిస్థితి కొనసాగితే పోలింగ్ సమయంలో క్రాస్ ఓటింగ్ జరుగుతుందని, దీని కారణంగా మూడు పార్టీలు తీవ్రంగా నష్టపోవాల్సి వ‌స్తుంద‌ని విశ్లేష‌కులు అంటున్నారు. ఎన్నికల ఫలితాల్లో శాసనసభ నియోజకవర్గాల్లో ఒక పార్టీ అభ్యర్థి గెలిచి, పార్లమెంట్ కు పోటీ చేసిన కూటమి అభ్యర్థి ఓడిపోతే, క్రాస్ ఓటింగ్ జరిగిందనే విషయం మాత్రం స్ప‌ష్టంగా అర్ధ‌మ‌వుతుంది.

Also read

Tags :

ramu

Tandu Ramalingaiah ( Ramu ) is experienced in Media field. He worked in various Telugu media houses for about 15 years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Chief Editor of thetelugunews.com website. Contact Details : thetelugunews1@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి