
Good News : ఏపీకి సూపర్ గుడ్‌న్యూస్ చెప్పిన కేంద్ర ప్రభుత్వం..!
Good News : ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరినప్పటి నుండి అక్కడి ప్రజలకి అన్ని గుడ్ న్యూస్‌లు అందుతున్నాయి. తాజాగా కేంద్రం మరో కొత్త శుభవార్త చెప్పింది. సాధారణంగా రైల్వే గేటు పడితే సుమారు అరగంట ఆగాల్సిందే. అత్యవసరంగా వెళ్లే వాహనాలైనా గేటు తీసేవరకూ నిరీక్షించాల్సిందే. ఎంత దూరం నుంచి వచ్చినా, పక్క ప్రాంతం నుంచి వచ్చినా వాహనాలకు బ్రేక్ వేయాల్సిందే. కొన్ని ప్రాంతాలలో రైల్వేగేటు వద్ద దశాబ్దాల కాలం నుంచి తిష్ఠవేసిన సమస్య ఇది. ఇక్కడ అండర్ పాస్ బ్రిడ్జి గానీ, ఫ్లైఓవర్ గానీ నిర్మించాలని పరిసర ప్రాంతాల ప్రజలు కోరుతున్నారు. ఈ క్రమంలో ప్రధాన సమస్యకు పరిష్కారం చూపించేందుకు సిద్దమైంది. ఈ మేరకు క్షేత్రస్దాయిలో అధికారులు రంగంలోకి దిగారు.
Good News : ఏపీకి సూపర్ గుడ్‌న్యూస్ చెప్పిన కేంద్ర ప్రభుత్వం..!
దేశవ్యాప్తంగా రైల్వేశాఖ చేపడుతున్న సంస్కరణల్లో భాగంగా ఇలాంటి రైల్వే గేట్లను తొలగించి వాటి స్ధానంలో వంతెనలు నిర్మించాలని నిర్ణయించారు. ఈ మేరకు బడ్జెట్ కేటాయింపులు కూడా చేశారు.2027 నాటికి దేశవ్యాప్తంగా రైల్వే గేట్లను పూర్తిగా తొలగించాలని భావిస్తున్న కేంద్రం వాటి స్ధానంలో రైల్వే ఓవర్ బ్రిడ్జిలు, అండర్ బ్రిడ్జులను నిర్మించాలని యోచిస్తుంది.. ఇందుకోసం ఏపీలోనూ భారీ సంఖ్యలో ఉన్న రైల్వే గేట్లపై సర్వే నిర్వహిస్తోంది. ఇందులో రాష్ట్రంలో మొత్తం 390 రైల్వే గేట్లు ఉన్నట్లు తేల్చారు. 100గేట్లను ఇప్పటికే సర్వే చేసేసిన అధికారులు మరికొన్ని రోజుల్లో మిగిలిన గేట్లను కూడా పరిశీలించి వాటిపై ఓ నిర్ణయానికి వస్తారట.
ప్రత్యేకంగా నిధులు కేటాయించి రైల్వే గేట్ల స్ధానంలో వంతెనలు నిర్మించనున్నారు. దీని వల్ల దశాబ్దాలుగా జనం ఎదుర్కొంటున్న ట్రాఫిక్ సమస్యలు తీరడంతో పాటు ప్రజలకు భారీగా సమయం కూడా ఆదా అయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం అవుతుంది.ఇదిలా ఉంటే ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మీదుగా కొత్త రైల్వే లైన్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. తెలంగాణలోని ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం నుంచి అమరావతి మీదుగా నంబూరు వరకు 57 కి.మీ. మేర కొత్త రైలు మార్గం దిశగా అడుగులు పడుతున్నాయి. ఈ మేరకు ఈ నూతన రైల్వేలైను పనులకు సంబందించి తొలి అడుగు పడింది
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
This website uses cookies.