Good News : ఏపీకి సూప‌ర్ గుడ్‌న్యూస్ చెప్పిన కేంద్ర ప్ర‌భుత్వం..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Good News : ఏపీకి సూప‌ర్ గుడ్‌న్యూస్ చెప్పిన కేంద్ర ప్ర‌భుత్వం..!

 Authored By ramu | The Telugu News | Updated on :30 January 2025,7:00 pm

ప్రధానాంశాలు:

  •  Good News : ఏపీకి సూప‌ర్ గుడ్‌న్యూస్ చెప్పిన కేంద్ర ప్ర‌భుత్వం..!

Good News  : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం కొలువుదీరిన‌ప్ప‌టి నుండి అక్క‌డి ప్ర‌జ‌ల‌కి అన్ని గుడ్ న్యూస్‌లు అందుతున్నాయి. తాజాగా కేంద్రం మ‌రో కొత్త శుభ‌వార్త చెప్పింది. సాధార‌ణంగా రైల్వే గేటు పడితే సుమారు అరగంట ఆగాల్సిందే. అత్యవసరంగా వెళ్లే వాహనాలైనా గేటు తీసేవరకూ నిరీక్షించాల్సిందే. ఎంత దూరం నుంచి వచ్చినా, పక్క ప్రాంతం నుంచి వచ్చినా వాహనాలకు బ్రేక్‌ వేయాల్సిందే. కొన్ని ప్రాంతాల‌లో రైల్వేగేటు వద్ద దశాబ్దాల కాలం నుంచి తిష్ఠవేసిన సమస్య ఇది. ఇక్కడ అండర్‌ పాస్‌ బ్రిడ్జి గానీ, ఫ్లైఓవర్‌ గానీ నిర్మించాలని పరిసర ప్రాంతాల ప్రజలు కోరుతున్నారు. ఈ క్ర‌మంలో ప్రధాన సమస్యకు పరిష్కారం చూపించేందుకు సిద్దమైంది. ఈ మేరకు క్షేత్రస్దాయిలో అధికారులు రంగంలోకి దిగారు.

Good News ఏపీకి సూప‌ర్ గుడ్‌న్యూస్ చెప్పిన కేంద్ర ప్ర‌భుత్వం

Good News : ఏపీకి సూప‌ర్ గుడ్‌న్యూస్ చెప్పిన కేంద్ర ప్ర‌భుత్వం..!

Good News  అంతా వంతెన‌లే..

దేశవ్యాప్తంగా రైల్వేశాఖ చేపడుతున్న సంస్కరణల్లో భాగంగా ఇలాంటి రైల్వే గేట్లను తొలగించి వాటి స్ధానంలో వంతెనలు నిర్మించాలని నిర్ణయించారు. ఈ మేరకు బడ్జెట్ కేటాయింపులు కూడా చేశారు.2027 నాటికి దేశవ్యాప్తంగా రైల్వే గేట్లను పూర్తిగా తొలగించాలని భావిస్తున్న కేంద్రం వాటి స్ధానంలో రైల్వే ఓవర్ బ్రిడ్జిలు, అండర్ బ్రిడ్జులను నిర్మించాలని యోచిస్తుంది.. ఇందుకోసం ఏపీలోనూ భారీ సంఖ్యలో ఉన్న రైల్వే గేట్లపై సర్వే నిర్వహిస్తోంది. ఇందులో రాష్ట్రంలో మొత్తం 390 రైల్వే గేట్లు ఉన్నట్లు తేల్చారు. 100గేట్లను ఇప్పటికే సర్వే చేసేసిన అధికారులు మరికొన్ని రోజుల్లో మిగిలిన గేట్లను కూడా పరిశీలించి వాటిపై ఓ నిర్ణ‌యానికి వ‌స్తార‌ట‌.

ప్ర‌త్యేకంగా నిధులు కేటాయించి రైల్వే గేట్ల స్ధానంలో వంతెనలు నిర్మించనున్నారు. దీని వల్ల దశాబ్దాలుగా జనం ఎదుర్కొంటున్న ట్రాఫిక్ సమస్యలు తీరడంతో పాటు ప్రజలకు భారీగా సమయం కూడా ఆదా అయ్యే అవ‌కాశం ఉంది. ప్ర‌భుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణ‌యం ప‌ట్ల హర్షం వ్య‌క్తం అవుతుంది.ఇదిలా ఉంటే ఇటీవ‌ల ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మీదుగా కొత్త రైల్వే లైన్‌‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. తెలంగాణలోని ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం నుంచి అమరావతి మీదుగా నంబూరు వరకు 57 కి.మీ. మేర కొత్త రైలు మార్గం దిశగా అడుగులు పడుతున్నాయి. ఈ మేరకు ఈ నూతన రైల్వేలైను పనులకు సంబందించి తొలి అడుగు పడింది

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది