Home » News » India Foils Pakistan Escalation Bid Destroys Air Defence System
News

Pakistan : పాకిస్తాన్ లోని 9 ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు.. పాక్ కు చుక్క‌లు చూపిస్తున్న భారత్

Authored By
Ramalingaiah Tandu
The Telugu News | Updated on: May 8, 2025, 5:35 pm
Advertisement

Pakistan : పాక్‌కు భారత్ చుక్క‌లు చూపిస్తుంది. జమ్మూ కాశ్మీర్, పంజాబ్, గుజరాత్ సహా ఉత్తర, పశ్చిమ భారతదేశంలోని అనేక సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని బుధవారం రాత్రి పాకిస్తాన్ మిస్సైళ్లను ప్రయోగించింది. చైనాకు చెందిన HQ-9 రక్షణ వ్యవస్థలను ఉపయోగిస్తున్న పాక్.. భారత్‌లోని సరిహద్దు రాష్ట్రాల్లో డ్రోన్లు, క్షిపణి దాడులకు యత్నించింది.

Advertisement

Pakistan : పాకిస్తాన్ లోని 9 ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు.. పాక్ కు చుక్క‌లు చూపిస్తున్న భారత్

Pakistan చుక్క‌లు చూపిస్తున్న భార‌త్..

పాక్ గగనతల రక్షణ వ్యవస్థలు ఈ దాడుల్లో తీవ్రంగా దెబ్బతిన్నాయని సమాచారం. భారత్ తలపెట్టిన ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా పాక్ లోపల గల తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను విజయవంతంగా ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. దీనికి ప్రతిదాడిగా పాక్ సరిహద్దు గ్రామాలపై కాల్పులు జరపడంతో భారత్ వారి ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలపై దాడి చేసి వాటిని ధ్వంసం చేసింది.

Advertisement

లాహోర్‌లో ఏర్పాటు చేసిన గగనతల రక్షణ వ్యవస్థ పూర్తిగా పనిచేయకుండా చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఇది పాకిస్తాన్ భద్రత వ్యవస్థకు భారీ దెబ్బగా భావిస్తున్నారు. పాక్ చర్యలతో భారత్‌ ప్రతీకార దాడులకు దిగింది. తిరిగి పాక్‌లోని అనేక ప్రాంతాలపై దాడులు చేసింది భారత్. దాడులు, ప్రతిదాడుల విషయాన్ని భారత్ ధృవీకరించింది. మరోవైపు నియంత్రణ రేఖ వెంబడి కాల్పుల విరమణ ఉల్లంఘిస్తూ పాక్ భారీ ఫిరంగులతో దాడులను కొనసాగిస్తోంది. వీటిలో ఇప్పటివరకు 16 మంది సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోయారు.

Ramalingaiah Tandu

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి