
Indian Army : పాక్ కు పట్టిస్తున్న భారత సైన్యం.. పేకమేడలా కూలుతున్న ఉగ్రవాదుల ఇల్లులు..!
Indian Army : జమ్మూ కశ్మీర్ లోని అనంత్‌నాగ్ జిల్లా పహల్గామ్‌లో ఏప్రిల్ 22న పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి తర్వాత భద్రతా దళాలు ఉగ్రవాదుల వేటను ముమ్మరం చేశాయి. ఈ దాడికి సహకరించిన స్థానిక ఉగ్రవాదులపై చర్యలు ప్రారంభించి, వారి మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. శనివారం రాత్రి మరో ముగ్గురు ఉగ్రవాదుల ఇళ్లను ధ్వంసం చేశారు. గత రెండు రోజుల్లో మొత్తం తొమ్మిది ఇళ్లను కూల్చివేసిన భద్రతా బలగాలు, 175 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు.
Indian Army : పాక్ కు పట్టిస్తున్న భారత సైన్యం.. పేకమేడలా కూలుతున్న ఉగ్రవాదుల ఇల్లులు..!
బందిపోరా, పుల్వామా, షోపియాన్ జిల్లాల్లో ఉగ్రవాద కార్యకలాపాల్లో నిమగ్నమైన వారి ఇళ్లను కూల్చివేశారు. కుప్వారా జిల్లాలో పాక్ ఆక్రమిత కశ్మీర్‌కు చెందిన ఫరూక్ అహ్మద్ తడ్వా ఇంటిని బాంబులతో పేల్చివేశారు. పుల్వామాలో ఆమీర్ నజీర్ ఇంటి ధ్వంసం, బందిపోరాలో లష్కరే తొయిబా ఉగ్రవాది జమీల్ అహ్మద్ ఇంటిని కూల్చడం వంటి చర్యలు చేపట్టారు. ఇటీవలి 48 గంటల్లో ఎవరైతే ఉగ్రవాదులతో సంబంధం కలిగి ఉన్నారో వారి ఇళ్లను ధ్వంసం చేసి భద్రతా బలగాలు గట్టి బహిరంగ హెచ్చరిక ఇచ్చాయి.
కుల్గాం, షోపియాన్ జిల్లాల్లో కూడా ఉగ్రవాద మద్దతుదారుల ఇళ్లను ధ్వంసం చేశారు. అదిల్ హుస్సేన్ థోకర్ వంటి ఉగ్రవాదులకు సహకరించిన వారి ఇళ్లను కూల్చి, చుట్టుపక్కల ఇళ్లకు నష్టం కలగకుండా నియంత్రిత మార్గంలో చర్యలు తీసుకున్నారు. ఇదిలా ఉండగా, బందిపోరాలో జరిగిన ఎదురుకాల్పుల్లో లష్కరే తొయిబా టాప్ కమాండర్ అల్తాఫ్ లల్లి హతమయ్యాడు. భద్రతా బలగాల ప్రకారం, ఉగ్రవాద మద్దతుదారులపై చర్యలు ఇంకా కొనసాగనున్నాయి.
America : అగ్రరాజ్యం అమెరికా అంటేనే ప్రపంచానికి ఒక ప్రత్యేకమైన గౌరవం. తమ దేశానికి చెందిన ఒక్క వ్యక్తి ప్రాణాలకు…
Ajit Doval : రష్యా ఉప ప్రధానమంత్రి డెన్నిస్ మాంట్రువ్ ఇటీవల భారత పర్యటనకు రావడం అంతర్జాతీయ రాజకీయాల్లో పెద్ద…
Rahul Gandhi : ఎన్నికల రాజకీయం ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరూ ఊహించలేరు. అధికారమే పరమావధిగా రాజకీయ పార్టీలు చేసే…
Modi : భారత్ మరియు ఇరాన్ దేశాల మధ్య ప్రస్తుతం నడుస్తున్న చమురు మరియు గ్యాస్ సరఫరా వ్యవహారం అంతర్జాతీయంగా…
Revanth Reddy : తెలంగాణ Telangana State రాష్ట్రంలో నివసిస్తున్న ఇతర రాష్ట్రాల ప్రజలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అదిరిపోయే…
Summer Business Idea : వేసవి కాలం వచ్చేసింది.. ఉదయం నుంచే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఇలాంటి ఎండల్లో…
PM Kisan 23rd installment : దేశవ్యాప్తంగా రైతుల ఆర్థిక కష్టాలను తీర్చడానికి, పెట్టుబడి సాయం అందించడానికి కేంద్ర ప్రభుత్వం…
Gold Silver Rate April 6th 2026 : గత కొన్ని రోజులుగా ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్న పసిడి ధరలకు…
Karthika Deepam 2 April 6th 2026 Episode : స్టార్ మా Star Maa ఛానెల్‌లో ప్రసారం అవుతూ,…
Summer Buttermilk : ఎండలు మండిపోతున్న వేళ శరీరాన్ని చల్లబరచడానికి మజ్జిగను మించిన పానీయం మరొకటి లేదు. సాధారణంగా మజ్జిగ…
Mango : వేసవి కాలం రాగానే మనందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది మామిడి పండు. అయితే పచ్చి మామిడికాయ మరియు…
Iced Tea Iced Coffee : వేసవి కాలంలో చల్లటి పానీయాలు తాగడం అందరికీ ఇష్టమే కానీ బరువు తగ్గాలని…
This website uses cookies.