Home » News » Indian Army Makes Key Announcement
News

Indian Army : భారత్-పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన ఇండియ‌న్ ఆర్మీ..!

Authored By
Ramalingaiah Tandu
The Telugu News | Updated on: May 10, 2025 4:59 pm
Advertisement

Indian Army : ప్ర‌స్తుతం భార‌త్- పాకిస్తాన్ మ‌ధ్య యుద్ధం ఓ రేంజ్‌లో న‌డుస్తుంది. నువ్వా, నేనా అంటూ రెండు దేశాలు త‌ల‌ప‌డుతున్నాయి. ఇలాంటి స‌మ‌యంలో భారత సైన్యానికి సాయం అందించాలంటూ ప్రాదేశిక సైన్యానికి పిలుపు అందింది. ఈ మేరకు రక్షణ మంత్రిత్వ శాఖ గెజిట్ జారీ చేసింది. ప్రాదేశిక సైన్యం సేవలను ఉపయోగించుకునేందుకు భారత సైనిక అధ్యక్షుడికి పూర్తి అధికారం ఉందని చెప్పింది. సైన్యానికి అనుబంధంగా ఉంటూ ప్రాదేశిక సైన్యం చేయూత అందించనుంది.

Advertisement

Indian Army : భారత్-పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన ఇండియ‌న్ ఆర్మీ..!

Indian Army మంచి అవ‌కాశం..

18 ఏళ్ల నుంచి 42 ఏళ్లలోపు వారికి అవకాశం కల్పించనున్నట్లు ఆ నోటిఫికేషన్‌లో పేర్కొంది. అయితే, ఇందుకు విద్యార్హతను డిగ్రీగగా నిర్దారించారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు, ఆదాయం కలిగి ఉన్నవారికి సైతం ఇందులో ప్రాధాన్యత కల్పిస్తామని ఇండియన్ ఆర్మీ ప్రకటించింది. ఇదిలాఉండగా, పాక్ తో యుద్ధం నేపథ్యంలో టెరిటోరియల్ ఆర్మీలోని 14 బెటాయిన్లను సైతం ఆర్మీ రంగంలోకి దించుతున్న విషయం తెలిసిందే.

Advertisement

గతంలో కూడా సైన్యానికి ప్రాదేశిక సైనిక వర్గం సేవలు అందించింది. ఇప్పుడు కూడా సేవలు అందించబోతుంది. ఆపరేషన్ పరాక్రమ్, కార్గిల్ యుద్ద సమయంలోనూ ప్రాదేశిక సైన్యం.. భారత సైనిక దళానికి సేవలు అందించింది. ఈ ప్రాదేశిక సైన్యంలో చాలా మంది ప్రముఖులు ఉన్నారు. లెఫ్ట్‌నెంట్ కల్నల్ హోదాలో టీమిండియా మాజీ కెప్టెన్‌లు మహేంద్ర సింగ్ ధోనీ, కపిల్ దేవ్ ఉండగా.. మాజీ కేంద్ర మంత్రి సచిన్ పైలెట్ కూడా ప్రాదేశిక సైన్యంలో కెప్టెన్ హోదాలో కొనసాగుతున్నారు. ప్రాదేశిక సైన్యం అనేది స్వచ్ఛంద పౌరులతో కూడిన సైనిక సంస్థ, వీరు దేశానికి అవసరమైనప్పుడు సేవ చేయడానికి శిక్షణ పొందుతారు.

Ramalingaiah Tandu

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి